Movies

మా మీద పడి ఏడుస్తారు

Kangana Ranaut Slams Her Problem Creators

ఎలాంటి సినీ నేపథ్యం లేని తనలాంటి వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుంటే చాలా మందికి అదో సమస్యలా మారుతోందని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. తొలుత ఈ సినిమాకు ‘మెంటల్‌ హై క్యా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కానీ మెంటల్‌ అన్న పదం వాడకూడదని సెన్సార్‌ బోర్డు అభ్యంతరం చెప్పడంతో టైటిల్‌ను మార్చారు. దీనిపై కంగన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ టైటిల్‌ పెట్టినందుకు మాపై చాలా మంది కేసులు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. మెంటల్‌ అన్న పదాలను బ్యాన్‌ చేశారని.. వాటిని టైటిళ్లుగా వాడకూడదని మాకు ఈ మధ్యనే తెలిసింది. అయినా నా విషయానికి వచ్చేసరికి చాలా మందికి సమస్యలు ఉంటాయి. నాలాగా ఎలాంటి కుటుంబ నేపథ్యం లేని వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేవారంటే కొందరికి పడదు. మేం శ్వాస తీసుకన్నా వారికి సమస్యే’ అని మండిపడ్డారు కంగన.