NRI-NRT

కోలాహలంగా తానా రెండో రోజు మధ్యాహ్నం

2019 TANA 22nd Conference In Washington DC Second Day Celebrations

వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న 22వ తానా మహాసభల్లో రెండో రోజు శుక్రవారం మధ్యాహ్నం తానా సభల ప్రాంగణం అంతా కోలాహలంగా సందడిగా సాగింది. సాహిత్య, ఆధ్యాత్మిక, వివాహ, వ్యాపార, వాణిజ్య, క్రీడా, ప్రవాస ప్రతిభా వేదికల్లో పలువురు ప్రవాసులు బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాహిత్య వేదికలో జొన్నవిత్తుల, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మేడసాని మోహన్, పారుపల్లి కోదండరామయ్య, లెనిన్, జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య సెమినార్ వేదిక కిక్కిరిసిపోయింది. పలువురు వ్యాపారవేత్తలౌ తమ అనుభవాలను సభికులతో పంచుకున్నారు. వీరమాచినేని రామకృష్ణతో ముచ్చటించేందుకు ప్రవాసులు ఎగబడ్డారు. ఖమ్మం, చిత్తూరు ప్రవాసుల సంఘం సమావేశాలు ఆద్యంతం సరదాగా ఆత్మీయంగా సాగాయి. క్రీడా సెమినార్లలో కపిల్‌దేవ్ పాల్గొన్నారు. హఠ యోగా, వివాహ పరిచయ వేదికల వద్ద కూడా రద్దీ సాగింది. ప్రవాసులు కొంతమంది ఈ వేదికల్లో, మరికొంతమంది ప్రధాన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాల్లో, ఇంకొంతమంది స్టాల్స్ వద్ద సందడిగా తిరగడం సభకు నిండుదనాన్ని తీసుకువచ్చింది. అధ్యక్షుడు వేమన సతీష్ అన్ని వేదికల వద్దకు కలియ తిరుగుతూ అందరికీ కరచాలనం ఇస్తూ ఆయన మార్కు హడావుడి చేశారు.