Health

నీరు ఎంత తాగితే అంత బలం

8 Glasses Of Water Daily Yields Lot Of Benefits In Long Run

ఆశ్చర్యంగా ఉందా… అవును రోజూ కచ్చితంగా ఎనిమిది గ్లాసుల నీరు తాగితే… డీహైడ్రేషన్‌ సమస్య దూరం కావడమే కాదు…మరికొన్ని అనారోగ్యాలూ దరిచేరవంటున్నారు నిపుణులు.
* 1. పరగడుపున నీరు తాగితే శరీరం నుంచి వ్యర్థాలు బయటకు పోతాయి. కడుపును శుద్ధి చేసే ప్రకియ మంచినీటితోనే ఆరంభమవుతుంది.
* 2. భోజనానికి ముందు గ్లాసు నీరు తాగి చూడండి. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం మితంగా తీసు కుంటారు. అధిక బరువు సమస్య దరిచేరదు.
* 3. సాధారణంగా వచ్చే తలనొప్పి, మైగ్రేన్‌, మలబద్ధకం, కొలెస్ట్రాల్‌, కాలేయ సంబంధ వ్యాధులు వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.
* 4. చర్మం పగిలినట్లు కనిపించడం, నల్లగా మారడం, ముడతలు.. వంటివన్నీ అదుపులో ఉంటాయి. తాజాగా ఉంటుంది. చర్మం సహజ నూనెలు కోల్పోదు.
* 5. డీహైడ్రేషన్‌ సమస్య అదుపులో ఉంటుంది. శరీరం త్వరగా అలసిపోదు. నీరసం, నిస్సత్తువ, అలసట వంటివి దరిచేరవు.
* 6. వ్యాయామాలు చేసేటప్పుడు క్రమం తప్పకుండా కొద్దికొద్దిగా నీరు తాగితే కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. చెమట రూపంలో బయటకు పోయిన నీరు తిరిగి శరీరానికి అందుతుంది
* 7. మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. హార్మోన్ల విడుదలా సజావుగా సాగుతుంది. రోజంతా చురుగ్గా ఉంటారు.
* 8. శరీరమంతటిక ప్రాణవాయువు సక్రమంగా అందుతుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది.