DailyDose

లింగమనేని కొత్త గేమ్-తాజావార్తలు–07/06

Lingamaneni New Game-Daily Breaking News-July62019

* చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట భవన యజమాని లింగమనేని రమేష్.. నోటీసులకు సమాధానం ఇచ్చారు. గతానికి భిన్నంగా ఈసారి స్పందించారు..మూడేళ్ల క్రితం ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా భవనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేశానని… దాన్ని ఏం చేసుకున్నా తనకు సంబంధం లేదని లింగమనేని రమేష్ అప్పట్లో చెప్పారు. చంద్రబాబు కూడా నాడు ఆ భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అసెంబ్లీలో ప్రకటించారు.కానీ ఇప్పుడు చంద్రబాబు దాన్ని అద్దె భవనం అంటున్నారు.తాజాగా ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు లింగమనేని రమేష్ కూడా స్పందించారు. ఒక ఆంగ్ల దిన పత్రిక విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
*అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఈ ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. కాగా.. 24 గంటల్లోనే మరోసారి భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి 8.19 గంటల సమయంలో దక్షిణ కాలిఫోర్నియాలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది.
* శాంసంగ్ కంపెనీ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎ (2019)ను తాజాగా విడుదల చేసింది. రూ.10,860 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు ఈ నెల 12వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.
* విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సీబీఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి సీబీఐ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. పదోన్నతుల్లో అవినీతి జరిగిందన్న ఫిర్యాదుపై సీబీఐ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మానవ వనరుల విభాగానికి చెందిన ఉన్నతాధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. తనిఖీలపై ఇప్పటివరకు సీబీఐ అధికారులు స్పందించలేదు.
* శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు జూలై 6న‌ రాత్రి 8 – 9 గం.ల మధ్య పెద్ద‌శేష వాహ‌నంపై భక్తులకు దర్శనమిస్తారు.
* ధంతరి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఘటన స్థలం నుంచి మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
*నైరుతీ రుతుపవనాల కారణంగా శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఆర్టీజీఎస్‌ శుక్రవారం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు 4 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడే సూచనలున్నాయని, గంటకు 45-55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన దోస్త్‌ కౌన్సెలింగ్‌ మూడో దశ పూర్తయ్యే సరికి 87 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. 200 కాలేజీల్లో కేవలం 25 శాతం కంటే తక్కువ మందే చేరారని చెప్పారు. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు రాకపోవడంతో డిగ్రీలో అడ్మిషన్లు తక్కువ జరిగాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
*సిబిఐ అదనపు డైరెక్టర్‌గా ఎన్‌ నాగేశ్వరరావును తొలగిస్తూ కేంద్రం అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆయనకు సివిల్‌ డిఫెన్స్‌, హోం గార్డ్‌, ఫైర్‌ సర్వీస్‌ల డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలను అప్పగించింది.1986 ఒడిశా కేడర్‌ చెందిన ఐపిఎస్‌ అధికారి నాగేశ్వరరావు.. సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండు సార్లు పదవీ బాధ్యతలను నిర్వహించారు. సిబిఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, డిప్యూటీ రాకేశ్‌ ఆస్తానాల మధ్య నెలకొన్న అంతర్గత వివాదం అనంతరం ప్రభుత్వం ఆయనను తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిబిఐ అదనపు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆయనను ఆ పదవి నుండి తొలగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వు వెలువడింది.
*తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు బి.సుధాకర్‌ విడుదల చేశారు.
* నారాయణపేట నియోజకవర్గంలోని కొయిలకొండ మండలం సురారంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తేనెటీగలు దాడి చేయడంతో 24 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు విద్యార్థులను హుటాహుటిన మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
*ఉత్తరాంధ్ర తీరంలో నేడు, రేపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాల కారణంగా తీరప్రాంతాల్లో సముద్రపు అలలు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించింది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉద్ధృతంగా వీస్తాయని పేర్కొంది.
*తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో నేడు ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 10 తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
*ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకుగుణదల 3 వంతెనల ఫ్లైఓవర్ వద్ద నిలిపివేసిన పనులపై పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్
* పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ అయింది. చెక్‌బౌన్స్‌ కేసులో ఒంగోలు మొబైల్‌కోర్టు మెజిస్ట్రేట్‌ బి.వాణిశ్రీ శుక్రవారం వారెంటు జారీ చేశారు. ఒంగోలుకు చెందిన తిప్పారెడ్డి మోహన్‌రెడ్డి వద్ద 2009 ఆగస్టు 4న రూ.8లక్షలు, నవంబరు 5న రూ.9లక్షలు అప్పుగా తీసుకున్న ఎంఎస్‌ బాబు ఆ బాకీ చెల్లించేందుకు 2010 ఫిబ్రవరి 4న రూ.19లక్షలకు 6 చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు బ్యాంకులో వేయగా చెల్లకపోవడంతో మోహన రెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గతంలో కూడా ఎంఎస్‌ బాబు కోర్టుకు హాజరుకాకపోతే.. నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ చేయగా 2019 ఎన్నికలకు ముందు రీకాల్‌ చేసుకున్నారు. అప్పటి నుంచి మరలా కోర్టుకు హాజరు కాకపోవడంతో శుక్రవారం నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ చేశారు.
* ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరీ జిల్లాలో ఇవాళ భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్లో నలుగురు నక్సల్స్ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఇవాళ ఉదయం యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగుతుండగా నక్సల్స్, ఎస్టీఎఫ్ దళాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నట్టు డీఐజీ సుందర రాజ్ పేర్కొన్నారు. ఖల్లారీ, మేచ్కా గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) బలగాలపై నక్సల్స్ కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ మొదలైందన్నారు.
* స్టీల్ ప్లాంట్‌ కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఏజీఎం పదోన్నతిలో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందడంతో సోదాలు చేపట్టింది. భారీగా డబ్బు చేతులు మారిందని సీబీఐకి ఫిర్యాదులు అందాయి. సోదాల్లో భాగంగా సీబీఐ అధికారులు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
* నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాంపై మరో ఫిర్యాదు నమోదైంది. తనను బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రొంపిచెర్ల మండలం వడ్లమూడివారిపాలేనికి చెందిన కాంట్రాక్టర్ శివరామయ్య.. కోడెల శివరాంతో పాటు పీఏ నాగప్రసాద్అనుచురుడు బత్తుల రాములపై ఫిర్యాదు చేశారు.
* హైదరాబాద్ బైసైకిలింగ్ క్లబ్, చరక్ స్కూల్ ఆధ్వర్యంలో వరల్డ్ బైసైకిల్ డే ఈవెంట్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరముందన్నాయన. GHMC జోనల్ కమిషనర్ హరి చందన, మాజీ MLA చింతలతో కలిసి సైకిల్ రైడ్ చేశారు కిషన్ రెడ్డి.
*బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌తో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో.. విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. అప్రమత్తమైన CISF భద్రతాసిబ్బంది విమానాన్ని నిలిపేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు.. ఫోన్‌కాల్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు.. హైదరాబాద్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
*ఖమ్మం జిల్లా లంచం తీసుకోగానే సంబరం కాదు పని చేయకపోతే ఇలాగే ఉంటుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం శివారు వెంకటాపురం రెవెన్యూ పరిధిలో ఎకరం భూమి కి పాస్ బుక్ ఇస్తానని 10 వేలు లంచం తీసుకుని పాస్ బుక్ ఇవ్వకపోవడంతో VRO బండి తాళాలు లాక్కుంటున్న రైతు.వీడియో తీస్తున్నారని పారిపోతున్న VRO…. లంచం తీసుకోడమే కాక పోలీస్ స్టేషన్ కి వెళ్దాం, అంటూ రైతుని బెదిరిస్తున్న VRO9 నెలల చిన్నారిపై హత్యాచారం కేసులో దర్యాప్తు పూర్తి
*ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరి అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకుల మోత మోగింది. స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్టీఎఫ్‌) సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌లో భాగంగా జిల్లాలోని ఖల్లారి-మెచ్కా గ్రామాల మధ్య ఉన్న అడవుల్లో ఎస్టీఎఫ్‌ బృందం గాలింపు చేపట్టింది.
*గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించిన మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆయన ఆశయాలను స్మరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి భారీగా నిధులు ప్రతిపాదించారు.
*రైల్వేలో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు అవసరం కానున్న దృష్ట్యా ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిని పెద్దఎత్తున వినియోగించుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
*ఇంధన ధరలు సామాన్యులకు మరింత భారమయ్యాయి. ప్రస్తుత బడ్జెట్లో పెట్రోలు, డీజిలుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.1 చొప్పున పెంచారు. వాటిపై రోడ్డు-మౌలిక వసతుల సెస్సునూ లీటరుకు రూ.1 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు.
*మూడుసార్లు వాయిదా పడిన ఎంసెట్ ఆప్షన్ల ప్రక్రియ ఎట్టకేలకు శనివారం నుంచి ప్రారంభం కానుంది. కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు ఈనెల 8వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మొత్తం 191 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు రుసుము ఎంతన్న దానిపై శుక్రవారం రాత్రి విద్యాశాఖ జీఓ జారీ చేసింది.
*ఒకే దేశం, ఒకే గ్రిడ్’ లక్ష్యాన్ని సాధించేందుకు విద్యుత్ రంగానికి ప్రభుత్వం త్వరలో ఒక ప్యాకేజీని ప్రకటించనుంది. భారత్కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో ఉజ్వల, సౌభాగ్య పథకాల కింద 2022 నాటికి గ్రామాల్లో కోరుకున్న ప్రతి ఇంటికీ వంటగ్యాస్, విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాలు వెల్లడించారు. ప్యాకేజీ తీరుతెన్నులపై వివరాలు చెప్పలేదు.
*కస్టమ్స్, కేంద్ర జీఎస్టీ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్గా వాసా శేషగిరిరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పుణె కస్టమ్స్, కేంద్ర జీఎస్టీ చీఫ్ కమిషనర్గా ఉన్న ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు.
*కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వకు అనుగుణంగా తొలి బ్యారేజీ మేడిగడ్డ గేట్లు మూసివేసే ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. 85కుగాను 20 గేట్లను ఇంజినీరింగ్ అధికారులు మూసివేశారు. రెండు రోజుల్లో అన్ని గేట్లను మూసివేస్తారు.
*జాతీయ మదింపు, గుర్తింపు మండలి (న్యాక్) హోదా సాధనకు దరఖాస్తు చేస్తామంటే ఉన్నత విద్యామండలి తరఫున రూ.లక్ష ఆర్థిక ప్రోత్సాహం అందిస్తామని విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు.
*బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బీఈడీ ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. బీఈడీతో పాటు బీఈడీ(ప్రత్యేక విద్య) 2019 ఫలితాలను విడుదల చేశామన్నారు. ఫలితాలు ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్www.braouonline.in లో పరిశీలించాలని చెప్పారు.
* ఆర్థిక కారణాలతో దుబాయ్కి వెళ్లి ఇబ్బందులపాలైన రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ హమీలను ఆదుకోవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఆ మేరకు దుబాయ్లోని భారత రాయబారి నవదీప్సూరికి శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.
*తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు, ఆయా శాఖల ఉద్యోగులు శుక్రవారం ఉదయం ఆరు గంటలకే సీఎం నివాసానికి తరలివచ్చారు. అనేకమంది ఫ్లకార్డులు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
*మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8న అన్ని నియోజకవర్గాల్లో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఉచిత పంటల బీమా, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులకు రూ.7 లక్షల సాయం పథకాలను సీఎం జగన్ ప్రారంభిస్తారని వివరించారు.
*బిహార్ రాజధాని పట్నాలో ఈనెల 11 నుంచి 14 వరకు జరిగే సీనియర్ జాతీయ మహిళల కబడ్డీ పోటీల్లో పాల్గొనేలా 12 మంది ఏపీ క్రీడాకారిణులకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
*జోసా(జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ఏపీ నిట్లోని 486 సీట్లకు అలాట్మెంట్(కేటాయింపు)లు పూర్తయ్యాయని నిట్ అధికారులు శుక్రవారం వెల్లడించారు. సీటు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ కేంద్రాలకు వెళ్లి ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకున్నారని తెలిపారు. ఏడు విడతల్లో జరగనున్న జోసా కౌన్సెలింగ్ ఈనెల 18న ముగియనుంది.
*రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (సెట్) నిర్వహణ బాధ్యతను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అప్పగించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సెట్ను 2019 సంవత్సరం నుంచి నిర్వహించడానికి ఏయూను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ యూజీసీ ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఏపీసెట్ సభ్య కార్యదర్శి కె.శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
*స్తుతం బందరులో ప్రహరీ గోడ మీద పసుపు రంగు బోర్డు ..పలువురిని అయోమయానికి గురిచేస్తుంది.ఇక్కడ ఫోటోలో గృహం బందరు బుట్టాయిపేటలో ఉంది.. కానీ జి పి ఎస్ ట్యాగ్ బోర్డులో స్కాన్ చేస్తే అదే ఇల్లు పాత రామన్నపేటలో ఉన్నట్లు చూపదాంతో ఇంటి యజమాని కె. సత్యనారాయణ విస్తుపోయాడురేకుబోర్డు కొట్టిన వ్యక్తిని ప్రశ్నిస్తే …జవాబు లేదు.. ఇప్పటికే టౌన్ లో 60 శాతం పూర్తి కాబడిన ఈ ఎలక్ట్రానిక్ చిప్ ప్లేట్ చలవతో ఇపుడు బందరులో పేటలు..వార్డులు..ఇంటి నుంబర్లు మారిపోతున్నాయి..