NRI-NRT

శ్రీనివాస కళ్యాణంతో ప్రారంభమైన తానా మూడోరోజు

TTD Sreenivasa KalyanaM Starts In TANA 2019 At Washington DC

తితిదే వేదపండితుల ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న 22వ తానా మహాసభల్లో తిరుమల శ్రీ వేంకటేశుని కళ్యాణం వైభవంగా జరుగుతోంది. వేదపండితులు, తితిదే అర్చకులు శాస్త్రోక్తంగా ఈ కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహిస్తున్నారు. డీసీ కాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి కళ్యాణాన్ని ఆరంభించారు. ఈ కళ్యాణంలో తానా అధ్యక్షుడు వేమన సతీష్, రవి మందలపు, డా.యడ్ల హేమప్రసాద్, పంత్ర సునీల్, గాయనీ సునీత, దేవినేని లక్ష్మీ, గాయనీ స్మిత, చలపతి కొండ్రుకుంట, ప్రభల జగదీష్, సూరపనేని రాజా తదితరులు పాల్గొన్నారు.

* నేడు గోదావరి-కృష్ణా ప్రవాసుల ఢీ
మూడో రోజు ముగింపు వేడుకల్లో భాగంగా ఉదయం శ్రీనివాస కళ్యాణం అనంతరం మధ్యాహ్న కార్యక్రమాల్లో భాగంగా గోదావరి, కృష్ణా ప్రవాసుల సమావేశాలు, వైద్యుల సమావేశాలు జరగనున్నాయి. బిజినెస్ ఫోరంలో ఎల్లా కృష్ణ ప్రసంగించనున్నారు. మహిళల ఫోరంలో పలు ఆసక్తికర చర్చావేదికలు జరగనున్నాయి.