ScienceAndTech

భారత వాయుసేనకు పావురాల భయం

Indian AirForce Facing Troubles With Pigeons

భారత వాయుసేనకు పావురాలు తలనొప్పులు తెస్తున్నాయి. ముఖ్యంగా రాఫెల్‌ యుద్ధవిమానాల కోసం సిద్ధం చేసిన అంబాలా వాయు సేన స్థావరం చుట్టుపక్కల పావురాలు విపరీతంగా సంచరిస్తున్నాయి. దీంతో తమ విమానాలకు ఇవెక్కడ ముప్పుగా మారతాయోనని అధికారులు భయపడుతున్నారు. ‘‘ ఇటీవల కాలంలో కొందరు స్థానికులు పావురాలను పెంచుతున్నారు. దీంతో వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. వాయు సేన స్థావరానికి అత్యంత సమీపంలో ఇవి సంచరిస్తున్నాయి. ఇవి మా ఫైటర్‌ జెట్లకు భారీ ముప్పుగా మారాయి.’’ అని ఐఏఎఫ్‌ వర్గాలు పేర్కొన్నాయి. గత వారం ఒక జాగ్వర్‌ విమానం ఇంజిన్‌లోకి పావురం వెళ్లిపోయింది. దీంతో ఆ ఇంజిన్‌ పనిచేయలేదు. ఫలితంగా బాహ్య ఇంధన ట్యాంక్‌, 10 కిలోల బరువైన డమ్మీ బాంబులను జారవిడిచేసి అతి కష్టం మీద విమానాన్ని నేలపైకి దింపారు. 2020 మే నాటికి రాఫెల్‌యుద్ధ విమనాలు భారత్‌కు చేరడం మొదలవుతుంది. వాటికి ఇక్కడ ఉన్న 17వ స్క్వాడ్రన్‌లో చేరుస్తారు. దీంతో వీటిని రాఫెల్‌కు ముప్పు లేకుండా చేయాలని వాయుసేన భావిస్తోంది. అందుకే ఆ చుట్టుపక్కల ఎవరూ పావురాలను పెంచకుండా చర్యలు తీసుకోవాలని కోరుతోంది.