Health

చర్మదానంపై అవగాహన పెంచుకోండి

Please Donate Skin To Help Acid Attack Victims

యాసిడ్ దాడి, ప్రమాదవశాత్తూ శరీరం కాలిపోయిన బాధితుల పక్షాన లక్ష్మీ అగర్వాల్ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. చర్మాన్ని దానం చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని ప్రచారం చేస్తున్నది. కిడ్నీ ఫెయిల్ అయిన వారికి, కాలేయం అవసరమైన వారికి అవయవదానం చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. అందుకోసమే దేశంలోని పలు అవయవదాన కేంద్రాలు పనిచేస్తున్నాయి కూడా. అయితే పలు సంఘటనల్లో చర్మాన్ని కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని లక్షి అగర్వాల్ కోరుతున్నది. ఇందుకు చర్మదాన కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. కర్ణాటకకు చెందిన లక్ష్మీ అగర్వాల్‌పై గతంలో యాసిడ్ దాడి జరిగింది. దీంతో ఆమె అందవికారంగా మిగిలిపోయింది. తనలాగే ఎవ్వరూ ఉండకూదంటూ చర్మదానంపై అందరికీ అవగాహన కల్పిస్తున్నది. ఈ ప్రచార కార్యక్రమాలకు మరింత ఊతం ఇచ్చేందుకు తన జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో కూడా ఈమేరకు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ బయోపిక్‌లో నటి దీపకా పదుకొనె ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 15 యేండ్ల వయసులో లక్ష్మీపై యాసిడ్ దాడి జరిగింది. చాలాకాలం ప్రాణాలతో పోరాడి గెలిచింది. కొన్నాళ్ల తర్వాత యాసిడ్ అమ్మకాలపై ధైర్యంగా ఉద్యమాన్ని లేవనెత్తింది. రేప్‌కు గురయిన మహిళలకు రక్షణ కల్పించాలని 2013లో కోర్టులో వాజ్యం దాఖలు చేసి విజయం సాధించింది. ఇప్పుడు లక్ష్మీ అగర్వాల్ ఛాన్వ్‌అనే ఫౌండేషన్ ద్వారా యాసిడ్ దాడికి గురయిన బాధితులకు చేయూతనిచ్చేందుకు పని చేస్తున్నది. బెంగళూరులో ఇటీవల ఆమె రోటరీ బెంగళూరు మిడ్‌టౌన్, పలు సంస్థల ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ వాకథాన్‌కు 4,500మంది హాజరు కాగా, 1500మంది చర్మత దానం చేసేందుకు ముందుకు వచ్చారు.