Fashion

కనపడవు గానీ బాగా పనిచేస్తాయి

Soul Huggers Socks For Women-Daily Fashion News In Telugu

ఈ కాలంలో బూట్లు వేసుకుని వర్షంలోకి వెళ్తే…అవి తడిసిపోయి బూట్లు పాదం నుంచి జారిపోవచ్చు. ఈ సమస్య ఎదురుకాకుండా అన్ని రకాల బూట్లకు సౌకర్యంగా ఉండేలా సాక్సులాంటివి అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు. అవే సోల్‌ హగ్గర్స్‌ సీక్రెట్‌ 2.0. బూట్లు వేసుకునే ముందు వీటిని తొడుక్కోవాలి. సాక్సుల్లానే ఉన్నా…బయటకు కనిపించవు. వీటికి మడమలు, అరికాళ్లు, కాలి వేళ్లను పట్టి ఉంచేలా సిలికాన్‌ గ్రిప్‌ ఉంటుంది. అరికాళ్ల దగ్గర దూది లాంటిది ఉంటుంది. ఇది బూటు లోపల ఏర్పడే చెమటను పీల్చుకుంటుంది. ఇవి ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. చెప్పుల్లానే సైజులవారీగా ఉంటాయి.