DailyDose

తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘానికి కొత్త కార్యవర్గం-తాజావార్తలు–07/08

Telangana IAS Officers Union Gets New EC-Daily Breaking News In Telugu-July82019

*తానా సభల్లో బీజేపీ నేత రాంమాధవ్‌ను అవమానించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. అవి తానా సభలు కాదని.. టీడీపీ భజన సభలంటూ సెటైర్లు వేశారు.పచ్చ తమ్ముళ్లు అమెరికాలో కూడా తెలుగువారి ప్రతిష్టను దిగజారుస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంమాధవ్ ప్రసంగానికి అడ్డు తగిలి.. లోకేశ్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ధిని బయటపెట్టారని ఫైరయ్యారు.టీడీపీ బురద రాజకీయాలలోంచే కమల వికాసం జరుగుతుందంటూ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. తానా 22వ మహాసభలకు హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ప్రసంగిస్తుండగా.. ఈలలు, కేకలు వేస్తూ ఆయన వేదిక దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో మాధవ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించి వెనుదిరిగారు.
* గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం, తంగేడలో వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. తంగేడలో టీడీపీకి చెందిన బత్తుల సుబ్బమ్మ, నరసింహారావు మధ్య స్థల వివాదం నడుస్తోంది. గతంలో ఈ ఇద్దరి మధ్య సమస్యను గ్రామ పెద్దలు పరిష్కరించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వివాదం మరొసారి తెరపైకి వచ్చింది. నరసింహారావు అనుచరులు సుబ్బమ్మపై దాడి చేసి.. ఆ ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారు. తర్వాత ఆమెతో పురుగుల మందు తాగించారు. ప్రస్తుతం బాధితురాలు గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గతంలో ఆ స్థలం సుబ్బమ్మకే చెందుతుందని గ్రామ పెద్దలు తేల్చి చెప్పారు. అధికారం, అంగబలంతో నరసింహరావు వైసీపీకి చెందిన కొంతమందిని వెంటతీసుకువచ్చి ఈ అరాచకానికి పాల్పడ్డాడు. కాగా చికిత్స పొందుతున్న సుబ్బమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిని మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షానికి ముంబయి రోడ్లు వరదలా పారుతున్నాయి. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయితో పాటు పూణే, కొంకణ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజా వర్షాల కారణంగా అంధేరీ ఈస్ట్‌లో గోడ కూలిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.రానున్న 24 గంటల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ముఖ్యంగా రాయఘడ్‌, థానే, పాలఘర్‌ ప్రాంతాల్లో రేపు(మంగళవారం) భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ అలలు తాకిడి ఉంటుందని ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు అరేబియా సముద్రంలోకి అడుగుపెట్టవద్దని మత్స్యకారులను వాతావరణశాఖ హెచ్చరించింది.
* ఐక్య‌రాజ్య‌స‌మితి మాన‌వ హ‌క్కుల నివేదిక‌ను భార‌త్ ఖండించింది. జ‌మ్మూక‌శ్మీర్ ప‌రిస్థితిపై యూఎన్ ఇచ్చిన నివేదిక‌ను భార‌త్ త‌ప్పుప్ట‌టింది. ఎప్ప‌టి త‌ర‌హాలోనే త‌ప్పుడు నివేదిక ఇచ్చింద‌న్నారు. ఇవాళ యూఎన్ ఆఫీసులో భార‌త్ త‌న నిర‌స‌న వ్య‌క్తం చేసింది. గ‌త ఏడాది కూడా క‌శ్మీర్‌పై యూఎన్ హై క‌మిష‌న్ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌కు అప్‌డేట్‌గా ఈసారి కూడా యూఎన్ మ‌ళ్లీ అలాంటి కామెంట్ చేసింది. క‌శ్మీర్ స‌మ‌స్య‌పై భార‌త్‌, పాక్‌లు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని త‌న నివేదిక‌లో చెప్పింది.
* ఫ్రాన్స్‌లో జరిగిన ఫార్ములా వన్ హెచ్ఓ రేసింగ్‌లో అమరావతి జట్టు గెలవడంపై మాజీ మంత్రిఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమరావతి జట్టు సభ్యులకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. బహుమతి ప్రధానోత్సవ వేదికపై జాతీయ గీతం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయని లోకేశ్ ట్వీట్ చేశారు.
*విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ సిటీ సెంట్రల్ పార్కును డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్కుగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ
* ప్రపంచకప్ లో టీం ఇండియా సెమీఫైనల్స్ కి చేరుకుంది. మాంచెస్టర్‌లోని ప్రఖ్యాత ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో మంగళవారం ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో భారత్‌-కివీస్‌ మధ్య ఇదే తొలిపోరు కానుంది. లీగ్‌ దశలో గత నెల 13న నాటింగ్‌హామ్‌లో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దైన సంగతి తెలిసిందే.
* కర్ణాటకలో నెలకొన్న తాజా పరిణామాల వెనక భాజపా హస్తం ఉన్నట్లు కాంగ్రెస్‌ చేస్తున్న వ్యాఖ్యలను భాజపా ఖండించింది. స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్‌ రాజీనామా చేసి భాజపాకు మద్దతిస్తానని తెలపడంపై ఆ పార్టీ స్పందించింది. దీనిపై పార్టీ నాయకురాలు శోభ మాట్లాడారు. తమ పార్టీలోకి ఎవరొచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు.
* కాశం జిల్లా కొండపి నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. స్థానిక ఓ కల్యాణమండపంలో నిర్వహిస్తున్న ‘రైతుభరోసా’ కార్యక్రమానికి హాజరు కాకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే కల్యాణమండపం బయటే ఉండిపోయారు. అనంతరం వీరాంజనేయస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైతే అడ్డుకోవడం దారుణమన్నారు. శాంతిభద్రతల సమస్య రాకూడదని పోలీసులకు చెప్పి మరీ కార్యక్రమానికి వచ్చానని, అయినప్పటికీ పోలీసులు తనకు రక్షణ కల్పించలేదని ఆరోపించారు. ఓ ఎమ్మెల్యేకే రక్షణ కల్పించకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.
* వాణిజ్య రాజధాని ముంబైని మరోసారి వానలు ముంచెత్తాయి. సోమవారం రోజు కేవలం రెండు గంటలపాటు కురిసిన అతిభారీ వర్షంతోనగర వీధుల్లో వరద పోటెత్తింది. ఉదయం ఎనిమిదిన్నర గంటలనుంచి 11.30 నిమిషాల వరకు 789 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైందని స్కైమెట్‌ అంచనా వేసింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైతో పాటు, పుణే, తీరప్రాంత కొంకణ్‌ ప్రాంతాల్లో భారీగా వర్షం నమెదవుతోంది. తాజా వర్షాల కారణంగా అంధేరీ ఈస్ట్‌లో గోడ కూలిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
*ఏసీబీ కి పట్టుబడ్డ మేడ్చల్ కోపరేటివ్ సొసైటీ జిల్లా రిజిస్ట్రార్,అసిస్టెంట్ రిజిస్టర్మేడ్చల్ కోపరేటివ్ సొసైటీ జిల్లా రిజిస్ట్రార్ చంద్ర కిరణ్, ,అసిస్టెంట్ రిజిస్టర్ దామోదర్ లపై ఏసీబీ సోదాలుభూమి రె అనే వ్యక్తి దగ్గర ఒక కేసు వివాదంలో 20 వేలు లంచం డిమాండ్ చేసిన అధికారులుఈరోజు 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన అధికారులుపారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో కొనసాగుతున్న విచారణ.
*జగన్ నుంచి ప్రజలు చాలా ఆశించారు.. కానీ ఇప్పుడు వారికి నిరాశే మిగిలింది.22 మంది ఎంపీలను ఇచ్చిన ప్రత్యేక హోదా సాదించలేకపోయారుకేంద్ర బడ్జెట్లో ఏపీ పై శీతకన్ను వేసినా పట్టించుకోలేదుపోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదువిద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్ష అనడంతో కరెంటు కోతలు మొదలయ్యాయిపట్టిసీమ నీరు ఆలస్యం కావటంతో ఖరీఫ్ సీజన్ ఇంకా మొదలు కాలేదువిత్తనాల పంపిణీ పై సర్కారుకు సరైన ప్రణాళిక లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ నిలిపివేశారు
*శ్రీకాకుళం జిల్లారాజాం నియెజకవర్గ కేంద్రంలో మీడియాతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అద్యక్షులు కిమిడి కళా వెంకటర్రావ్ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి తెలుగు దేశం పార్టీపైన , కార్య‌క‌ర్త‌ల‌పైన వైసిపి వ‌ర్గీయులు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని , ఇప్ప‌టికే ఆరు మ‌ర్డ‌ర్‌లు జ‌రిగాయ‌ని , ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 40 రోజుల్లోనే టిడిపి వ‌ర్గీయుల‌పై ఎక్క‌డ‌క‌క్క‌డే దాడులు జ‌రుతున్నాయ‌ని టిడిపి పార్టీ అద్య‌క్షుడు , మాజీ మంత్రి క‌ళా వెంక‌ట‌రావు మండిప‌డ్డారు.
*హిందూస్తాన్ షిప్ యార్డ్ విశ్రాంత ఉద్యోగులకు తీపి కబురువచ్చే ఏడాది జనవరి నాటికళ్ళ బకాయి పడ్డ 17 కోట్ల వేతన సవరణ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపిన నౌక నిర్మాణ సంస్థ
* ఎన్నికలకు ముందు బదిలీ చేసిన త‌హ‌సీల్దార్లను తిరిగి పాత జిల్లాల‌కు ట్రాన్స్ ఫర్ చేయాలనే డిమాండ్ తో సోమవారం నుంచి ఆందోళనలు చేపట్టాలని రాష్ట్ర త‌హ‌సీల్దార్ల సంఘం(టీజీటీఏ) నిర్ణయించింది. హైద‌రాబాద్‌ నాంప‌ల్లిలోని సీపీఎఎల్ఏ ఆవ‌ర‌ణ‌లోని టీజీటీఏ కేంద్ర కార్యాల‌యంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశంలో కార్యాచరణ ప్రకటించింది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, సీసీఎల్‌ఏలను కలిసి కలిసి నోటీసు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు.
* డీజిల్, పెట్రోల్తో నడిచే బండ్లకు త్వరలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. వాటి రెన్యూవల్ చార్జీలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. పొల్యూషన్ తగ్గించడంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
*తెలంగాణలో సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
*కర్ణాటకలో నెలకొన్న తాజా పరిణామాల వెనక భాజపా హస్తం ఉన్నట్లు కాంగ్రెస్‌ చేస్తున్న వ్యాఖ్యలను భాజపా ఖండించింది. స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్‌ రాజీనామా చేసి భాజపాకు మద్దతిస్తానని తెలపడంపై ఆ పార్టీ స్పందించింది. దీనిపై పార్టీ నాయకురాలు శోభ మాట్లాడారు. తమ పార్టీలోకి ఎవరొచ్చినా సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. అసమ్మతి నేతలతో భాజపా నేతలెవ్వరూ టచ్‌లో లేరని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మెజారిటీ కోల్పోయినందున ఆయనకు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టారని తెలిపారు. మరో ప్రభుత్వం ఏర్పాటు కోసం కుమార స్వామి దారివ్వాలన్నారు. మరోవైపు కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరినప్పటికీ తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదంటూ కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
* ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిపై వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. స్థానిక ఓ కల్యాణమండపంలో నిర్వహిస్తున్న ‘రైతుభరోసా’ కార్యక్రమానికి హాజరు కాకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే కల్యాణమండపం బయటే ఉండిపోయారు. అనంతరం వీరాంజనేయస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైతే అడ్డుకోవడం దారుణమన్నారు. శాంతిభద్రతల సమస్య రాకూడదని పోలీసులకు చెప్పి మరీ కార్యక్రమానికి వచ్చానని, అయినప్పటికీ పోలీసులు తనకు రక్షణ కల్పించలేదని ఆరోపించారు. ఓ ఎమ్మెల్యేకే రక్షణ కల్పించకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.
*కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రులంతా రాజీనామాలు చేస్తారని ఆ పార్టీ ఎంపి డికె సురేశ్‌ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ పార్టీల మధ్య అంతర్గత పోరాటం ఏమీ లేదని ఆయన అన్నారు. ప్రస్తుత సంక్షోభానికి బిజెపి జాతీయ నాయకత్వం కారణమని, ప్రజాస్వామ్యాన్ని వారు నాశనం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
*ఒక చోట పింఛన్లు ఇస్తామని ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి.. మరో చోట పింఛన్‌ లను పంపిణీ చేసిన వైనం సోమవారం కాకినాడ రూరల్‌ మండలం 50 వ డివిజన్‌ లో చోటు చేసుకుంది. ‘ కాకినాడ రూరల్‌ మండలం సోమాలమ్మ గుడి వద్ద పింఛన్‌ లు అందిచడం జరుగుతుంది ‘ .. అని ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, పింఛన్‌ లబ్ధిదారులంతా సోమాలమ్మ గుడి వద్ద ఎండలో పడిగాపులు కాశారు.
*పన్నీరు బట్టర్‌ మసాలా స్థానంలో బట్టర్‌ చికెన్‌ను సర్వ్‌ చేసిందుకు వినియోగదారుల కోర్టు జొమాటోతో పాటు ఆ ఆహారాన్ని సర్వ్‌ చేసిన హోటల్‌కు భారీగా జరిమానా విధించింది. పుణెకు చెందిన శణ్ముఖ్‌ దేశ్‌ముఖ్‌ అనే న్యాయవాది పన్నీరు బట్టర్‌ మసాలా కోసం జొమాటో ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేశాడు. కానీ పన్నీరు బట్టర్‌ మసాలా స్థానంలో బట్టర్‌ చికెన్‌ను సర్వ్‌ చేశారు. పన్నీరు మాదిరిగానే చికెన్‌ కూడా ఉండడంతో.. నాన్‌వెజ్‌ను తినేశాడు లాయర్‌. ఆ తర్వాత అది చికెన్‌ అని తాను గుర్తుపట్టాడు. దీంతో జొమాటోతో పాటు ఆ హాటల్‌పై వినియోగదారుల కోర్టులో న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. శాఖాహారానికి బదులుగా మాంసాహారాన్ని సర్వ్‌ చేసినందుకు జొమాటోతో పాటు ఆ హోటల్‌కు రూ. 55 వేల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది
*విజయనగరం జిల్లా శఅంగవరపుకోట మండలం కొత్తూరు గ్రామ కల్లాల పశువుల పాకలో సోమవారం అయిదు బస్తాల గంజాయిని అధికారులు గుర్తించారు. స్థానిక వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన దాసరి భాస్కర్‌ రావు ఎప్పటిలాగే తన పశువులను పాక నుండి బయట కట్టేందుకు వెళ్లగా.. పాకలో అయిదు బస్తాలు ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే భాస్కరరావు కంగారుపడి బస్తాలో ఏమున్నాయోనని పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లుగా తేలింది. గంజాయి ఎన్ని కేజీలో ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*ఎమ్మెల్యేల రాజీనామాలతో కర్ణాటక ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే నగేశ్‌ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ వాజుభాయ్‌ వాలాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ‘కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నా మద్దతు ఉపసంహరించుకుంటున్నాను. ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీని మీరు(గవర్నర్‌) ఆహ్వానిస్తే ఆ పార్టీకి నేను మద్దతిస్తాను’ అని నగేశ్‌ గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
*బంగాళాఖాతంలో చేపలు పట్టడానికి వెళ్లిన 31 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లవద్దంటూ అధికారులు చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా వారు సముద్రంలోకి వెళ్లి గల్లంతయ్యారని సుందర్‌బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి మంతూరామ్‌ పఖీరా చెప్పారు. రెండు బోట్లలో వెళ్లిన 31 మంది మత్సకారులు గల్లంతయ్యారని ఆయన చెప్పారు. మరొక బోటులో వెళ్లిన 13 మంది మత్స్యకారులు బోటు ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో బంగ్లాదేశ్‌ జలాల్లోకి కొట్టుకుపోయారని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. భారత, బంగ్లాదేశ్‌లకు చెందిన కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వారిని రక్షించారని రక్షణ శాఖ అధికారులన్నారు.
*దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌లో సీఎం జగన్‌ నివాళులర్పించారు. జగన్‌తో పాటు వైఎస్.విజయలక్ష్మీ, బ్రదర్ అనిల్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిచ్చారు
* రాష్ట్రంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి.. అవినీతికి ఆస్కారం లేని విధానాలు… ప్రజలకు పారదర్శక సేవలు లక్ష్యంగా కొత్త విధానాలను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. నగర, గ్రామీణ, రెవెన్యూ విధానాలను అమలులోకి తెస్తామని చెప్పారు. అధికారులతో కూడిన 100 సంచార నిఘా బృందాలను (ఫ్లయింగ్ స్క్వాడ్స్ను) ఏర్పాటు చేస్తున్నామని అవి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు.
* అధికంగా వ్యయం చేసే వారు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. పన్ను విధించదగ్గ ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే ప్రస్తుతం ఎలాంటి రిటర్నులూ సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ వ్యయం అధికంగా ఉన్నప్పుడు రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నా రిటర్నులు దాఖలు చేయక తప్పదు.
*రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో అవసరమైన ముందస్తు ప్రక్రియను మరింత ముందుకు తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ఈ నెల 14వ తేదీ లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు.
*ఎంసెట్ సీట్లను ఈ నెల 10వ తేదీన కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 53,890 మంది విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాగా, ఆదివారం నాటికి 38,495 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఆప్షన్ల ఎంపికకు నేటితో గడువు ముగియనుంది.
*తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల కింద సాగునీటి అవసరాలు తీరాకే ఇతర బేసిన్లకు గోదావరి జలాలను తరలించే ఆలోచన చేయాలని విశ్రాంత ఇంజినీర్లు పేర్కొన్నారు. ‘ఇతర బేసిన్లకు గోదావరి జలాల తరలింపు’ అంశంపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఛైర్మన్ రామేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు విశ్రాంత ఇంజినీర్లు మాట్లాడారు.
* ఎన్నికల అనంతరం చేపట్టాల్సిన తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్ల తిరుగు బదిలీలను చేపట్టకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందంటూ తెలంగాణ తహసీల్దార్ల సంఘం ఆందోళన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 15 లోపు బదిలీలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లంతా సామూహిక సెలవు (మాస్ క్యాజువల్ లీవ్) పెడతారని ప్రకటించింది.
*ప్రస్తుత సచివాలయాలన్ని కూలగొడతామంటే చూస్తూ ఊరుకోం.. అడ్డుకుంటాం అని అఖిల పక్షాలు హెచ్చరించాయి. కొత్తగా భవనాలను కట్టాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని కూడగట్టి ఉద్యమించాలని నిర్ణయించాయి.
*ప్రస్తుత సచివాలయాలన్ని కూలగొడతామంటే చూస్తూ ఊరుకోం.. అడ్డుకుంటాం అని అఖిల పక్షాలు హెచ్చరించాయి. కొత్తగా భవనాలను కట్టాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని కూడగట్టి ఉద్యమించాలని నిర్ణయించాయి. కూల్చివేతపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు వదిలేది లేదని స్పష్టం చేశాయి.
*హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో పోటీకి తెరాస టికెట్ కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు నేతలు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిసి టికెట్ను కోరుతున్నట్లు తెలిసింది. తాజాగా ఒక ఎన్ఆర్ఐ కేటీఆర్ను కలిసి టికెట్ను కోరినట్లు సమాచారం. సభ్యత్వ నమోదు అనంతరం చర్చిస్తామంటూ కేటీఆర్ ఆయనతో చెప్పారు.
*పదహారేళ్ల క్రితం జరిగిన గుజరాత్ హోంమంత్రి హరేన్పాండ్య హత్యకేసులో హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ రవూఫ్కు శిక్షపడలేదు. ఈ కేసులో నల్గొండకు చెందిన అస్గర్అలీతోపాటు మరో 11 మందికి శిక్ష విధిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
*రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించిన తరువాత జాతీయ బీసీ కమిషన్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా సోమవారం హైదరాబాద్కు రానుంది. ఛైర్మన్ భగవాన్లాల్ సహాని, వైస్ఛైర్మన్ డా.లోకేష్ కుమార్ ప్రజాపతి, సభ్యులు తల్లోజు ఆచారి, కౌశలేంద్ర పటేల్, సుధాయాదవ్ తదితరులతో కూడిన కమిషన్ బృందం నగరంలోని రవీంద్రభారతిలో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటలకు సమావేశం కానుంది.
*తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రైల్వే డీజీ సందీప్శాండిల్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తన బదిలీ విషయాన్ని వీకే సింగ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తనకు సాయం అందించిన జైళ్ల శాఖ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నారు.
* టీఎస్ఈసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 11వ తేదీ నుంచి మొదలు కానుంది. మొదటి విడతలో సీటు రాని అభ్యర్థులు 11న ఆన్లైన్లో ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 12న ధ్రువపత్రాల పరిశీలన, 13 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉంది. 15న సీట్ల కేటాయింపు పూర్తవగానే, 17 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి, రిపోర్టు చేయాలి. కౌన్సెలింగ్కు సంబంధించిన ఇతర వివరాలను వెబ్సైట్లో ఉంచినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.
*చేపల బోటు మరమ్మతుతో సముద్రంలో చిక్కుకున్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన 8 మంది మత్స్యకారులను తీర గస్తీ దళం రక్షించింది. ఈ మత్స్యకారులు గత నెల 22న కాకినాడ నుంచి వేటకు వెళ్లారు. తిరిగివస్తుండగా మధ్యలో బోటు స్టీరింగ్ మొరాయించడంతో చిక్కుకుపోయారు.
* షిర్డీకి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంటున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం చోటుచేసుకుంది. విమానాశ్రయం అధికారుల కథనం ప్రకారం… స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ ఎస్జీ-3576 విమానం ఉదయం 9.25 గంటలకు ప్రయాణికులతో షిర్డీకి వెళ్లేందుకు రన్వే పై నుంచి టేకాఫ్ తీసుకుంటుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని గమనించిన పైలట్ వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రయాణికులను కిందకు దించి విమానాన్ని మరమ్మతుకు తరలించారు. మరమ్మతుల అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు విమానం షిర్డీకి బయల్దేరి వెళ్లింది.
*కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపిణీలో స్టాంపు డ్యూటీ భారం తగ్గించాలని ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ యోచిస్తోంది. ఆస్తుల విలువల ప్రకారం ఏపీ స్టాంపు డ్యూటీ కింద గరిష్ఠంగా రూ.20వేలు చెల్లించేలా చేస్తే రికార్డుల్లో వాస్తవ వివరాలు నమోదై పొరపాట్లు తగ్గుతాయని రిజిస్ట్రేషన్ శాఖ ఆలోచిస్తోంది.
* తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘానికి కొత్త కార్యవర్గం ఏర్పడింది. అధ్యక్షునిగా సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను, కార్యదర్శిగా వికాస్రాజ్ను ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన వార్షిక సమావేశంలో నిర్వహించిన ఎన్నికల్లో శాంతికుమారి ఉపాధ్యక్షురాలిగా, సంయుక్తకార్యదర్శిగా సందీప్కుమార్ సుల్తానియా, కార్యవర్గ సభ్యులుగా అజయ్మిశ్రా, నవీన్మిత్తల్, అర్విందర్సింగ్, ఆమ్రపాలి, కొర్రా లక్ష్మి, ఎండీ ముషారఫ్లు, ప్రత్యేక ఆహ్వానితులుగా విశ్రాంత అధికారులు వినోద్అగర్వాల్, రేమండ్ పీటర్లు ఎన్నికయ్యారు.
*రాష్ట్రంలో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకుడు వైకే రెడ్డి చెప్పారు. బిహార్, ఉత్తర్ప్రదేశ్ల్లో అల్పపీడనం ఉందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతంపై చురుగ్గా ఉన్నాయి.
*అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వస్తారు. అనంతరం తిరుమల చేరుకుని శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. 14వ తేదీ ఉదయం 9.20 గంటలకు శ్రీ వారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు శ్రీహరికోట చేరుకుంటారు.
*గోదావరి నదిలో నీటిమట్టం పెరగడంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి ఆదివారం నీటి విడుదలను పెంచారు. మొన్నటి వరకు ఒకటి, రెండు పంపుల ద్వారా కొద్ది పరిమాణంలో నీరు విడుదల చేయగా.. ప్రస్తుతం ఇటుకలకోట డెలివరీ సిస్టమ్ నుంచి 22 పంపుల ద్వారా 7,700 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు.
*నాయీబ్రాహ్మణులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మల్కాపురం కనకారావు, తుళ్లూరు సూరిబాబు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
* పుట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. సరదా కోసం వేడుకల్లో స్నో స్ప్రే కారణంగా పుట్టిన రోజు జరుపుకుంటున్న యువకుడి ముఖమంతా కాలిపోయింది. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఈఘటన చోటు చేసుకుంది. యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.మండపేట కలవపువ్వు సెంటర్‌లో స్నేహితులతో కలిసి యువకుడు బర్త్ డే కేక్‌ క్యాండిల్ వెలిగించాడు. తోటి స్నేహితులు సరదాగా ఆ యవకుడి తలపై స్ప్రే చల్లారు. ఎక్కువగా చల్లడంతో క్యాండిల్ మంటలు ఒక్కసారిగా యువకుడికి అంటున్నాయి. దీంతో యువకుడి ముఖమంతా కాలిపోయింది.