Devotional

31 కంపార్టమెంట్లలో వేచి ఉన్న భక్తులు

31 కంపార్టమెంట్లలో వేచి ఉన్న భక్తులు -There Is A Huge Rush By Devotees In TTD 31 Compartments

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు.. గోరింటాకు గుర్తుకు వస్తుంది. అమ్మాయిలకు మంచి నేస్తం. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెబుతూ ఉంటారు. చేతికి పెట్టుకున్న తర్వాత ఎవరిది ఎంత ఎర్రగా పండిందో చూసుకుని మురిసిపోతుంటారు. చేతిని అందంగా పండించే గోరింటాకు వల్ల ఆరోగ్యానికి, అందానికి కూడా అనేక లాభాలున్నాయి. జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు… ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడవకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.
*** ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటాకును కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. గోరు పుచ్చిపోవడం, ఏదైనా దెబ్బతగిలి ఇన్ఫెక్షన్ సోకడం వంటివి జరిగినప్పుడు గోరింటాకు ముద్దని గోరుకు తరుచూ పెట్టుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. కొందరికి అరికాళ్లు మండుతూ ఉంటాయి. అప్పుడు కూడా గోరింట పేస్టును రాయాలి. మంట తగ్గి కాస్త ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులకు కూడా గోరింట ముద్ద బాగా పనిచేస్తుంది. గోరింటాకు బెరడు, విత్తనాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. విత్తనాలు విరేచనాలను తగ్గిస్తాయి. గోరింటాకు ముద్దని మాడుకి తగలేలా రాసుకుంటే వెంట్రుకలు రాలడం కూడా తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది. తెల్లబడిన వెంట్రుకలకు రంగు వేయడం కన్నా వారానికోసారి గోరింట పెట్టుకుంటే సహజసిద్ధంగా నల్లగా మారతాయి.
*** మహిళలు ఎంతో ఇష్టపడే గోరింటాకులో ఎన్నో ఔషధగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏదైనా పండగ వచ్చేస్తే చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవని వారు చెబుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ క్రిములను గోరింటాకు నశింపజేస్తుంది. గోరింటాకును నెలకొక్కసారి చేతికి పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలెర్జీలకు దూరంగా ఉంచుతుంది ఈ ఆకు. కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల బోదకాలు వ్యాధి -ఏనుగు కాలు (లింఫాటిక్ ఫైలేరియాసిస్) దరిచేరదంటారు. అంతేకాకుండా ఆటలమ్మ మచ్చలు పోగొట్టాలంటే గోరింటాకు బాగా నూరి మచ్చలపై పూస్తే సరిపోతుంది. వేడిగడ్డలను సైతం గోరింటాకు నయం చేస్తుంది. అలాగే నెలకోసారి గోరింటాకు పేస్ట్‌తో తలకు ప్యాక్ వేసుకుంటే.. జుట్టు బలపడుతుంది. జుట్టు రాలడానికి చెక్ పెట్టవచ్చు. చుండ్రును దరిచేరనివ్వదు. మృదువైన జుట్టు సొంతం అవుతుంది. సహజసిద్ధంగా రంగు వేసుకోవడానికి అనువుగా ఉండే ఆకు ఇది. ఇన్ని ప్రయోజనాలున్న గోరింటాకును పెట్టుకుంటే వర్షాకాలంలో వచ్చే రోగాలను దూరం పెట్టవచ్చును. మార్కెట్‌లో దొరికే మెహందీ కోన్‌ల కంటే ఆకును నూరి చేతులకు, కాళ్లకు పెట్టు కుంటేనే మంచిదని చెబుతున్నారు నిపుణులు.
2. జలమయమైన నాసిక్
మహారాష్ట్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాసిక్ జిల్లాలో ఆదివారం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖాజీగడీ ప్రాంతంలో గుడిసెల్లో నివసిస్తున్న సుమారు 250 కుటుంబాలను నాసిక్ మున్సిపల్ అధికారులు తాత్కాలిక సహాయ కేంద్రాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. త్రయంబకేశ్వర్లోని ఉమా నుంచి నాసిక్ పట్టణం వరకు పరీవాహక ప్రాంతాల్లో అనేక ఆలయాలు జలమయమయ్యాయి. నాసిక్లో కురిసిన వర్షానికి గంగాపూర్, పల్ఖేడ్ ఆనకట్టల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. గాడ్గే మహారాజ్ వంతెన సమీపంలో వాహనం వరదలో చిక్కుకోవడంతో జేసీబీ సాయంతో బయటకు తీసే ప్రయత్నం చేశారు. జిల్లాలో ఆదివారం ఉదయానికి 644 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
3. సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఆదివారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నాగదేవతను కొలిచారు. స్వామికి రుద్రాభిషేకాలు సమర్పించారు.ఆయన వెంట కృష్ణా జిల్లా జడ్జి రామకృష్ణ, అవనిగడ్డ సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జి జీవీకే సరస్వతి పాల్గొన్నారు.
4. తిరుపతమ్మకు బంగారు వడ్డాణం బహూకరణ
స్థానిక తిరుపతమ్మ అమ్మవారికి ఆదివారం గుంటూరులోని ద్వారకానగర్కు చెందిన పోలిశెట్టి రంగనాయకులు, లక్ష్మి దంపతులు బంగారు వడ్డాణం బహూకరించారు. 154 గ్రాముల బరువు ఉన్న ఆభరణం విలువ రూ. 4.53 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు. ఆలయ ఛైర్మన్ అత్తులూరి అచ్యుతరావు వడ్డాణాన్ని అందుకున్నారు. దాతలను అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు.
5. శుభమస్తు
తేది : 8, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(నిన్న ఉదయం 10 గం॥ 21 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 43 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తర
(నిన్న రాత్రి 8 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 37 ని॥ వరకు)
యోగము : వరియానము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 28 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 11 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 16 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 3 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 20 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 47 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : కన్య
6. చరిత్రలో ఈ రోజు/జూలై 8*
1898 : ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి రాజా జననం(మ.1957).
1914 : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు జననం(మ.2010).
1921 : భారత పారిశ్రామిక వేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం(మ.2011).
1949 : ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీ నాయకుడు వై.యస్.రాజశేఖరరెడ్డి జననం(మ.2009).
969 : భారతీయ నటి, నృత్యకారిణి, సంగీత దర్శకురాలు సుకన్య జననం.
1972 : భారత క్రికెట్ క్రీడాకారుడు సౌరవ్ గంగూలీ జననం.
1978 : తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్య సమర యోధుడు నాయని సుబ్బారావు మరణం(జ.1899).
2007 : భారత దేశపు 11వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ మరణం(జ.1927).
1919 : తెలంగాణ తొలితరం దళిత కవి, మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు మరణం.
7. తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం – 31 కంపార్టమెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనం భక్తులకు 16 గంటల సమయం పడుతుందినడక దారి భక్తులకు 4 గంటల సమయం300 రూ ప్రత్యేక దర్శనంకు 2 నుండి 3 గంటల సమయం పడుతుందినిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 93,647నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.35 కోట్లు8. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
8. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 16 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని నిన్న 93,647 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 35,821 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
9. గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్నసీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చక్రాయపేట మండలంలోని గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహిం‍చి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం జగన్‌ను ఆశ్వీరదించి తీర్థ ప్రసాదాలు అందించారు.అంజన్న దర్శన అనంతరం సీఎం జగన్‌ను జమ్మలమడుగు బయల్దేరారు. కాసేపట్లో సీఎం జగన్‌ అక్కడ జమ్మలమడుగులో నిర్వహించనున్న వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అంతకు ముందు సీఎం జగన్‌ వైఎస్సార్‌ 70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద అంజలి ఘటించారు.
10. వేర్పాటువాదుల బంద్‌.. అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు బ్రేక్‌
అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు బ్రేక్ ప‌డింది. ఇవాళ జ‌మ్మూ నుంచి వెళ్లాల్సిన వారిని నిలిపేశారు. కాశ్మీర్ వేర్పాటువాదుల బంద్‌కు పిలుపు ఇవ్వ‌డంతో జ‌మ్మూలో యాత్రికుల‌ను నిలిపివేసిన‌ట్లు తెలుస్తోంది. భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్నందు వ‌ల్ల కూడా జ‌మ్మూ బేస్‌లో ప్ర‌యాణికుల‌ను ఆపేసిన‌ట్లు చెబుతున్నారు. బ‌ల్తాల్‌, పెహ‌ల్గామ్ రూట్ల‌లో ఎక్కువ యాత్రికులు నిలిచిపోవ‌డంతో.. జ‌మ్మూ వ‌ద్దే యాత్రికుల‌ను ఆపేశారు. జూలై 1వ తేదీన అమ‌ర్‌నాథ్ యాత్ర ప్రారంభం అయ్యింది. ఇప్ప‌టికే ల‌క్ష మంది మంచు లింగాన్ని ద‌ర్శించుకున్నారు. ఆగ‌స్టు 15వ తేదీన యాత్ర ముగుస్తుంది. స్థానిక ముస్లింల స‌హాకారం వ‌ల్లే అమ‌ర్‌నాథ్ య‌త్రా సాధ్య‌మ‌వుతోంద‌ని ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. యాత్రికుల‌కు భారీ స్థాయిలో సెక్యూర్టీ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల స్థానికులు రోజువారీ జీవ‌నం ఇబ్బందిక‌రంగా మారుతోంద‌ని జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీ తెలిపారు.