WorldWonders

ఈ పిస్తోలు 450కోట్ల కిందటీ ఉల్కతో చేశారు

This pistol was made using 450 crore years old meteorite

ఈ పిస్తోళ్లు చాలా చాలా స్పెషల్. మామూలుగా అయితే, తుపాకులను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. కానీ, ఈ రెండు పిస్తోళ్లను మాత్రం ఓ ఉల్కతో తయారు చేశారు. 450 కోట్ల ఏళ్ల వయసున్న మువోనియోనాలుస్తా అనే మీటియోరైట్ రాయితో వీటిని రూపొందించారు. 10 లక్షల ఏళ్ల క్రితం భూమిని ఢీకొట్టిన ఆ ఉల్క 1906లో స్వీడన్లో దొరికింది. అంత స్పెషాలిటీ ఉన్న ఆ తుపాకులను అమెరికా డాలస్లోని హెరిటేజ్ ఆక్షన్స్ అనే సంస్థ జులై 20న వేలం వేయనుంది. ఆ వేలంలో వీటికి సుమారు ₹10.26 కోట్లు (15 లక్షల డాలర్లు) పలకొచ్చని అంచనా వేస్తున్నారు. చూడ్డానికి రెండూ కొంచెం ఒకేలా ఉన్నా రెండు మోడళ్లూ వేరని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.