DailyDose

పరారీలో కోగంటి సత్యం-నేరవార్తలు–07/08

Today Crime News - July 8 2019

* పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్యకేసులో కొనసాగుతున్న విచారణ.హత్య చేసింది సుపారీ గ్యాంగ్ గా అనుమానం ఇంకా అజ్ఞాతం లోనే ఉన్న కోగంటి సత్యం కోగంటి కోసం గాలిస్తున్న మూడు ప్రత్యేక బృందాలు పక్కపథకంతోనే రెక్కీ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం సీసీ కెమెరాల దృశ్యాలు ఆదరంగా కొనసాగుతున్న విచారణ కారు నెంబర్ ను గుర్తించి , కారు ఓనర్ ను విచారించిన పోలీసులు కోగంటి సత్యం అల్లుడు కృష్ణ రెడ్డి ని విచారిస్తున్న పోలీసులు
* రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు, లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కారు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది.
*గుంటూరు దాచేపల్లి మండలం తంగేడ గ్రామంలో ఆస్థి వివాదంలో మహిళా పై అఘహిత్యందారుణంగా కొట్టి ఇంటి ప్రహరీ గోడ ద్వంసం అనంతరం ఆమెను పురుగుల మందు తాగించారు అని బంధువుల ఆరోపణఈ వివాదం గతం లో భర్య భర్త ల మధ్య వివాదం పరిష్కారానికి వచ్చిన పెద్దలే చేశారు అని ఆరోపణ
* అటవీ భూములను స్వాధీనం చేసుకోడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారి అనితపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు, ఆయన అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎఫ్‌ఆర్‌ఓ అనితపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఆమెతోపాటు మరో 15 మంది అధికారులపై కేసు నమోదుచేయడం గమనార్హం. ఫారెస్ట్ అధికారి అనిత, ఇతర సిబ్బంది తనను కులం పేరుతో దూషించడమే కాక, దాడికి పాల్పడ్డారని సార్సాల గ్రామానికి చెందిన నాయిని సరోజ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఫారెస్ట్ సిబ్బందిపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశామనీ, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
* హైదరాబాదులోని పంజగుట్టలో హత్యకు గురైన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హంతకులు వాడిన కారను పోలీసులు గుర్తించారు. రాంప్రసాద్ ను హత్య చేసిన తర్వాత హంతకులు బొలేరో వాహనంలో పారిపోయినట్లు తెలుసుకున్నారు.
* రాంప్రసాద్ హత్య: పోలీసులు అదుపులో కోగంటి సత్యం అల్లుడు……..పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం అల్లుడు కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
* 24 వ్యాన్‌లలో ఆవులను తరలిస్తున్నా 25 మందిని గోసంరక్షకులు పట్టుకున్న సంఘటన మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా ఖల్వాస్ ప్రాంతంలోని సన్వాలిఖేదాలో గ్రామంలో జరిగింది. గ్రామస్థులు గోవులను తరలిస్తున్న 25 మందిని తాళ్లతో కట్టేసి మోకాళ్లపై కూర్చోబెట్టడమేకాకుండా గోమాతాకి జై.. గోమాతాకి జై పలుమార్లు బలవంతంగా నినాదాలు చేయించారు.
* నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై భూమా ట్రావెల్స్ కు చెందిన బస్సు దగ్ధమైంది. కోకాపేట సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గమనించిన డ్రైవర్ బస్సును ఆపి కిందికి దిగాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
* అన్నవరం కొండపై ఓ వ్యాన్ బోల్తా పడింది. లోవ దర్శనం తర్వాత 22మందితో వెళ్తున్న ఒక వాహనం కొండపైకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కొండపై మొదటి మలుపులో డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో వ్యాన్ బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో 10మందికి గాయాలవగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో క్షతగాత్రులను ఆటోలో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
* ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేయబోయాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం ఎల్బీ నగర్‌లో జరిగింది. మన్సూరాబాద్‌ కి చెందిన జానీ అనే 35 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల పాపపై అత్యాచారయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసును ఆశ్రయించారు. జానీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు జానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
* లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 29 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు యమున ఎక్స్‌ప్రెస్ వే పైనుంచి ప్రయాణిస్తుండగా ఆగ్రా సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
* న్యాయం కోసం ఆందోళన చేపట్టిన MPTCపై పోలీసులు దాడి చేసిన ఘటన మహబూబాబాద్ లో జరిగింది. రెండు రోజుకు క్రితం తొర్రురులో ట్రాక్టర్ బోల్తా పడి బుక్య శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోయాడు. మృతుడి ఫ్యామిలీకి కాంట్రాక్టర్ ఆర్థికసహయం చేయాలంటూ మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకు మద్దతు తెలిపిన అమ్మాపురం MPTC విక్రమ్ రెడ్డిని పోలీసులు దారుణంగా కొట్టారు. అందరు చూస్తుండగానే బూతులు తిడుతూ.. దురుసుగా పిడిగుద్దులతో లాక్కెళ్లారు.
* ఆయనో పేరు పోయిన డాక్టర్‌. ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంను నడుపుతున్నాడు. పవిత్ర వృత్తిలో ఉన్న ఆ డాక్టర్‌ ఓ పాడు పని చేశాడు. తన ఆస్పత్రిలో పని చేసే ఓ నర్సుమీద కన్నేసిన ఆ డాక్టర్‌.. మాయ మాటలు చెప్పి లైంగికంగా ఆమెను లోబర్చుకున్నాడు. ఈ విషయం తన భార్యకు తెలియడంతో ఆస్పత్రి నుంచి నర్సును బయటకు పంపించేసింది. అయినా వేరో చోట కాపురం పెట్టించి ఆమెతో సహజీవనం కొనసాగించాడు. తీర ఆ మహిళ గర్భవతి అని తేలడంతో ఆమెను అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు సదరు వైద్యుడు. నల్గొండ జిల్లా కోదాడలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* ఆర్థిక ఇబ్బందులు తాళలేక విశాఖలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విషాదానికి కారణమైంది. విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన సింహాద్రి ఈశ్వరరావు కుటుంబం పురుగులు మందు తాగి సింహాచలం డిపో సమీపంలో ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి వీరిని కేజీహెచ్‌కు తరలించారు . ఆసుపత్రికి వచ్చేసరికే ఈశ్వరరరావు ఆయన కుమార్తె చాందిని మృతి చెందారు. భార్య చంద్రకళ ప్రాణాలతో బైటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..
* పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో దారుణం జరిగింది. కన్న కూతురిని గర్భవతిని చేశాడో కీచక తండ్రి. విషయం తెలుసుకున్న తల్లి నిర్ఘాంతపోయింది. వెంటనే తల్లి, బాలిక బుట్టాయగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు.
* సూర్యాపేటలో అర్థరాత్రి దారుణం జరిగింది.. విధులు ముగించుకుని వెళ్తున్న ఓ కానిస్టేబుల్‌ను బుల్లెట్‌ బైక్‌తో ఢీకొట్టారు ముగ్గురు వ్యక్తులు. ఉద్దేశపూర్వంగానే ఇలా దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలు కావడంతో సుధాకర్‌ను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి విషమించడంతో ఆయన్ను నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్‌ మృతిచెందాడు. కానిస్టేబుల్‌ మరణాన్ని డిపార్ట్‌మెంట్‌ సీరియస్‌గా తీసుకుంది. దీని వెనుక మిస్టరీ ఛేదించేందుకు ప్రయత్నం
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం కుదునూరులో సీపీఐ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సీపీఐ నేత రాఘవయ్య(41)ను ఇనుపరాడ్లతో కొట్టి చంపారు దుండగులు. రాఘవయ్య హత్యపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*నిజామాబాద జిల్లాలోని ఇందల్‌వాయి మండలం ఎల్లరెడ్డిపల్లి గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గంగారాం అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు రోకలి కర్రతో కొట్టి చంపేశారు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
* సూర్యపేట పట్టణంలో శంకర్‌విలాస్ సెంటర్‌లో రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కానిస్టేబుల్ సుధాకర్‌తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
* నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కుమార్తెను రోకలిబండతో తండ్రి కొట్టి చంపాడు. మతిస్థిమితం లేని కుమార్తె శ్యామల(26)ను తండ్రి ఎర్రన్న హత్య చేశారు.
*మతిస్థిమితం లేని కుమార్తెను ఓ తండ్రి అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలోని కల్వకోల్‌లో ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది.
* పశ్చిమ బెంగాల్‌లోని సుఖియా వద్ద పుబుంగ్‌ ఫటక్‌లో ఒక ఇంటిపై కొండ చరియలు విరిగి పడ్డాయి. దీనితో ఆ ఇల్లు పూర్తిగా శిథిలమైంది. ఆ ఇంట్లో నివసిస్తున్న 60 ఏళ్ల వ్యక్తి, అతడి భార్య శిథిలాల కింద కూరుకుపోయి మరణించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి.
* తాడిపత్రి రైల్వే పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. శెట్టివారిపల్లె సమీపం వద్ద ముద్దనూరు తాడిపత్రి వెళ్లే రైల్వే పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతునికి సంబంధించి, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
*ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా – లఖ్‌నవూ యమున ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతన పైనుంచి బస్సు జర్న నాలాలో పడిపోవడంతో జరిగిన ప్రమాదంలో 29 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఓ బస్సు, కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 29 మంది ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయారు. యూపీ రవాణాశాఖకు చెందిన స్లీపర్ కోడ్ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వస్తూ 15 అడుగుల లోతున్న డ్రైనేజీ కాలువలో పడిపోయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
*యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి సమీపంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బొమ్మాయిపల్లికి చెందిన వినోద్గా గుర్తించారు. వినోద్ భువనగిరిలోని ఓ షాప్లో పనిచేస్తున్నాడు.
*మహబూబాబాద్ జిల్లా పరిధిలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ కామాంధుడు మానవత్వం మరిచి కర్కశంగా ప్రవర్తించాడు. బయ్యారం మండలం వెంకట్రాపురం గ్రామంలో ఇస్లావత్ రవి అనే వ్యక్తి మతిస్థిమితం లేని ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడు ఇస్లావత్ రవిని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
*గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతన కాలనీ కోల్కారిడార్ రెడ్డి కాలనీలో రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా, తల్లీ కొడుకు పరిస్థితి విషమంగా మారింది.
* *భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలం పెనగడప గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బొగ్గులారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
*ఆవుదూడను చంపాడనే ఆరోపణలు రుజువు కావడంతో గుజరాత్ రాజ్కోట్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష పడింది. రూ.1 లక్ష జరిమానా కూడా విధించారు. అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి హెచ్కే దవే ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
*రెండు పడవల్లో బయలుదేరిన 31 మంది మత్స్యకారులు బంగాళాఖాతంలో ఆదివారం గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులో నేపథ్యంలో సముద్రంలోకి వెళ్లవద్దన్న అధికారుల హెచ్చరికలను ఖాతరుచేయకుండా వారంతా నామ్ఖానా నుంచి రెండు పడవల్లో వెళ్లినట్లు మంత్రి ఒకరు వెల్లడించారు. మరో 13 మంది మత్స్యకారులు ప్రయాణిస్తున్న పడవ పాడైపోయి బంగ్లాదేశ్ సాగరజలాల్లోకి ప్రవేశించగా బంగ్లా-భారత తీరరక్షణ దళం సభ్యులు వారిని రక్షించారు.
*కుమురం భీం జిల్లా కొత్తసార్సాల పోడు భూముల దాడి ఘటనలో కాగజ్నగర్ ఎఫ్ఆర్ఓ అనితతో పాటు మరో 15 మంది సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఈజ్గాం పోలీసులు తెలిపారు. ఆదివారం కొత్తసార్సాలకు చెందిన నాయిని సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది
*ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ సమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
*విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం ఇంటికి హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు చేరుకున్నారు. హైదరాబాద్లో హత్యకు గురైన వ్యాపారి రాంప్రసాద్ కేసులో కోగంటి సత్యం ప్రమేయం ఉందంటూ మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపేందుకు పోలీసులు విజయవాడ వెళ్లారు. పటమట పోలీసుస్టేషన్లో కోగంటి సత్యం అల్లుడిని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం పెనగడపల వద్ద కారును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కొత్తగూడెం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
*నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన అధ్యాపకుడిని విద్యాలయం నుంచి తొలగించారు. పత్రికల్లో వచ్చిన కథనాలు, విద్యాలయ అంతర్గత విచారణ కమిటీ నివేదికల మేరకు రసాయనశాస్త్ర విభాగాధిపతి రవి వరాలను విద్యాలయం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉపకులపతి అశోక్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
*హైదరాబాద్ శివారు నార్సింగి వద్ద ఈనెల 4న ఫైజన్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన కేసు మలుపు తిరిగింది.
*వ్యాపారి తెల్లప్రోలు రామ్ప్రసాద్(49) హత్యోదంతం కీలక మలుపు తిరిగింది. హైదరాబాద్లో శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయన్ని దారుణంగా పొడిచి చంపడం వెనక ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
*ఉత్తరప్రదేశ్లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున దాదాపు 50 మంది ప్రయాణికులతో యమునా ఎక్స్ప్రెస్వేపై వెళ్తున్న యూపీ రోడ్వేస్ బస్సు.. ఆగ్రా సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలో పడింది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం పెనగడపల వద్ద కారును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కొత్తగూడెం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.