Agriculture

వానపాములు భూమిని సారవంతం చేస్తాయి

Earthworms will make your farming soil more fertile

భూమిలో పుట్టి పెరిగే వానపాములు వల్ల రైతులకు అనేక లాభాలున్నాయి. వానపాములు వ్యవసాయ భూములలో 24 గంటలు ఉండటం వల్ల మట్టిని గుల్లబారు చేసి ద్రవాలను విసర్జించటం ద్వారా మట్టి సారవంతం అవుతుంది. ఎన్నో అడుగుల లోతు నుండి పైకి వచ్చి పోషకాలను, మొక్కల వేర్లకు అందజేస్తాయి. మట్టి, ఇసుకను తింటూ భూమి సారాన్ని పెంచుతాయి. వానపాములు భూమిలో 15 అడుగుల లోతుకి వెళ్ళి సారవంతమైన మట్టిని పైకి తెస్తూ విరామం లేకుండా పని చేస్తాయి.
*300 రకాల దేశవాళి వానపాములు…
మన భూముల్లో 300 రకాల దేశవాళి వానపాములు ఉన్నాయి. రైతులు కొన్ని సంవత్సరాలుగా ఎరువుల వాడటం వలన దాదాపు చాలా వరకు వానపాములు నశించాయి. ఒక జత వానపాములు ఒకే ఈతలో 6 నుండి 8 పిల్లలు పెడతాయి. ఇలా ఏటా దాదాపు 6 సార్లు పిల్లలు పెడతాయి. అవి రెండు ఎకరాల్లో 80 టన్నుల మట్టిని తింటాయి. దేశవాళి వానపాములు ఒక్కొక్కటి 400 గ్రాముల పొడి మట్టిని తింటాయి. ప్రతి చదరపు మీటరుకి పాములు ఉంటే రెండు ఎకరాల్లో ఏడాదికి 80 టన్నుల మట్టితో పాటు ఇసుక, ముడి రాళ్ళు, సున్నపు రాళ్ళు కూడా తింటాయి. ఏడాదిలో కనీసం సుమారు 45 కిలోల మట్టిని తినే విసర్జిస్తాయి.
*నాణ్యమైన ఎరువు తయారీ…
వానపాముల విసర్జించడం వల్ల భూమికి 5 రెట్లు నత్రజని, 7 రెట్లు ఫాస్పెట్ 11 రెట్లు క్యాల్షియం, 4 రెట్లు మెగ్నిషీయం అందుతుంది. దీనికి తోడు వానపాముల విసర్జితాలతో సేంద్రీయ పదార్ధాలను కుల్లబెట్టే విధంగా 13 రెట్లకు ఎక్కువగా అవుతుంది. అదే విధంగా వ్యాధికారక క్రిములను నశింపజేసి సూక్ష్మజీవులు కూడా ఉత్పత్తి అవుతాయి. వానపాములు ఎంత బరువు ఉంటాయో అంతే స్థాయిలో విసర్జితాలను విడుదల చేస్తాయి.
*ఎక్కువ ప్రోటీన్లు….
ఎండిన వానపాము దేహంలో 72 శాతం ప్రొటీన్లు ఉంటాయి. రెండో ప్రపపంచ యుద్దం సమయంలో ఆహార కొతర ఏర్పడగా జపాన్ ప్రభుత్వం స్థానిక వ్యవసాయ భూమిలోని వానపాములు తినమని ప్రజలకు సూచించింది. వానపాములు చనిపోయిన అనంతరం అవి మట్టిలో కలిసిపోయినప్పటికీ 10 మిల్లీ గ్రాములు నైట్రేట్ అందిస్తుంది. వానపాములను పంట పొలాల్లో పెంచటం ద్వారా రైతులకు పంట దిగుబడులు పెరిగి అధిక లాభాలు వస్తాయి. వాన పాముల వలన పంట పొలాలు సారవంతంగా మారి భావితరాలకు ఉపయోగపడుతాయి.