WorldWonders

వైట్‌హౌస్ లోపలికి వరదనీరు

White House Basement Is Flooded Due To Heavy Rains in DC

అమెరికాలోని వాషింగ్టన్‌ను వరద నీరు ముంచెత్తింది. సోమవారం ఉదయం గంట వ్యవధిలో రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో వీధుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్లు నీటమునగడంతో వాహనదారులు వాటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి 15 మంది అత్యవసర సిబ్బంది కాపాడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వర్షం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.ఈ ప్రభావం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను కూడా తాకింది. వైట్‌హౌస్‌ బేస్‌మెంట్‌లోని కార్యాలయాల్లోకి కొద్దిపాటి వరద నీరు చేరింది. సీఎన్‌ఎన్‌ జర్నలిస్టు బెట్సీ కూడా ‘వైట్‌ ఈస్‌ లికింగ్‌’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఒక ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు. సోమవారం రోజున వాషింగ్టన్‌లో కురిసిన వర్షం ప్రమాదకర పరిస్థితులను తలపించిందని జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. గంటపాటు కురిసిన వర్షం రోజువారి రికార్డును బ్రేక్‌ చేసిందని పేర్కొంది.