DailyDose

దూకుడు పెంచిన సిబీఐ-నేరవార్తలు–07/10

CBI Coming With Full Force - Daily Crime News - July 10 2019

* సీబీఐ దూకుడు పెంచింది. మంగళవారం ఒక్క రోజే 19 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 110 చోట్ల దాడులు నిర్వహించింది. అవినీతి, వెపన్స్‌‌ స్మగ్లింగ్‌‌, బ్యాంకులను మోసం చేయడం వంటి కేసులకు సంబంధించి ఈ దాడులు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం 110 టీమ్‌‌లుగా విడిపోయిన సిబ్బంది ఏకకాలంలో మెరుపు దాడులకు ప్లాన్‌‌ చేశారు. బ్యాంకు మోసాలకు సంబంధించి ఈ నెల 2న సోదాలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 50 సిటీల్లో సెర్చ్‌‌ ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం అంతకు మించి తనిఖీలు చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ముంబై, ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్‌‌, రాయ్‌‌పూర్‌‌, మధురై, కోల్‌‌కోతా, రాంచీ, లక్నో, కాన్పూర్‌‌, లూథియానా, థానే, వల్సాద్‌‌, పుణె, జైపూర్‌‌, గోవా, గురుగ్రాం, చండీగఢ్‌‌, భోపాల్‌‌, సూరత్‌‌తోపాటు పలు పట్టణాల్లో దాడులు కొనసాగాయి. హైదరాబాద్‌‌, ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగాయి. 16 కేసుల్లో రూ.1,100 కోట్ల బ్యాంకు మోసాలకు సంబంధించి ఈ దాడులు చేపట్టినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం దాడులకు సంబంధించి వివిధ సంస్థలు, బ్యాంకు అధికారులు, వ్యక్తులపై 30కి పైగా ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు చేసినట్టు తెలిసింది. ఏఏ కేసులకు సంబంధించి సోదాలు నిర్వహించింది మాత్రం సీబీఐ అధికారికంగా వెల్లడించలేదు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్‌‌ మోడీ, మెహుల్‌‌ చోక్సీ వంటి కేసుల్లో ప్రభుత్వం ఎన్నికల సమయంలో పలు విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో అవినీతిపై పోరాటానికి ప్రభుత్వం సిద్ధమైందని పలువురు విశ్లేషిస్తున్నారు.
* మచిలీపట్నంలోని ఓగీసుపేటలో దారుణం.13 ఏళ్ళ బాలిక (సీరంసెట్టి నాగ మల్లీశ్వరి, అలియాస్ అంజు) ను గర్భవతిని చేసిన బంధువు…బాలికకు దగ్గర బంధువు వరుసకు అన్నయ్య అయిన మోహన్ కుమార్ బాలికతో చనువుగా ఉంటూ నిత్యం హత్యాచారం….
ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.విషయాన్ని బయటకు చెపితే చంపేస్తానని బాలికకు బెదిరింపు…తిను బండారాలు ఇప్పిస్తానని తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెబుతున్న బాలిక కుటుంబ సభ్యులు…రంగంలోకి దిగిన ఐ. సి.డి.ఎస్ అధికారులు….
* కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ లు దోంగతనం చేస్తున్న వ్యక్తి ని అరెస్టు చేసిన నందిగామ పోలీసులునందిగామ మండలం లిగాలపాడు లో నివాసం ఉంటున్న వేమూరి కృష్ణ ను అరెస్టు చేసిన పోలీసులు2003 నుంచి దోంగతనాలు చేస్తున్నారని తెలిపిన పోలీసులుఅరెస్టు చేసిన వ్యక్తి నుంచి 10బైక్ లు స్వాధీనం.నాలుగు హోండా యూనిక్రాన్ ,ఆరు హోండా షైన్ బైకులు స్వాధీనం
దోంగిలించిన బైక్ లను లింగాలపాడు గ్రామానికి చెందిన బండి నరసింహారావు వద్ద అమ్మటానికి ఉంచారని తెలిపిన పోలీసులు
దోంగిలించిన బైక్ ల విలువ 450000/-.
* కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలంలోని ముత్యంపేటలో మోటారు అమర్చేందుకు బావిలోకి దిగిన ముగ్గురు యువకులు శ్వాస ఆడక మృతిచెందారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్త కొత్తూరులో టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు.
* హైదరాబాద్ చైతన్యపురి పీఎస్ పరిధిలోని ఓ లాడ్జ్ లో యువతిపై యువకుడి దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యువతి గొంతుకోసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు యువకుడు వెంకటేశ్వర్లు.కేసు వివరాలను ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీరావు వివరించారు.
* కర్నూలు జిల్లా డోన్‌ పట్ణణంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. స్కూల్‌కు లేటుగా వస్తున్నారని.. సరిగా చదవడంలేదంటూ ఐదుగురు విద్యార్ధినిలను చితకబాదాడు. ఉపాధ్యాయుడు శివప్రసాద్‌ క్లాసులోకి రాగానే విద్యార్ధినిలు లేచి నిలుచున్నారు.
* దేవనకొండ మండలం నెల్లిబండ, కప్పట్రాళ్ల గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతిచెందాడు. బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
* కౌటాల మండలం ముత్యంపేట్‌లో విషాదం చోటుచేసుకుంది. పూడిక తీసేందుకు బావిలోకి దిగి ముగ్గురు యువకులు మృతిచెందారు. విషవాయువులు వెలువడటంతో ఊపిరాడక మృతిచెందారు. మృతులు రాజు (26), శ్రీనివాస్‌ (25), మహేష్‌ (18)గా గుర్తించారు. గ్రామంలో, కుటుంబాల్లో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* గిద్దలూరు మండలం ఉయ్యాలవాడలో నవ దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్య…పిక్కిలి రామయ్య(22), చంద్రవతి(19)..వీరికి రెండు నెలల క్రితం వివాహం జరిగిందిఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది.
* పెబ్బేరు మండలంలోని గుమ్మడం గ్రామం ఎంపీటీసీ సభ్యురాలు రజిత(20) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి తల్లితో గొడవ పడిన రజిత తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వైద్యులు సూచన మేరకు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతిచెందింది.
* తూర్పు గోదావరి మతిస్థిమితం లేని మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన సామర్లకోటలోని అమ్మణమ్మ కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన మతిస్థిమితం లేని మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* కృష్ణా పామర్రు మండల పరిధిలో గల కొండిపర్రు గ్రామాల్లో తెల్లవారుజామున 30 ఎకరాల గడ్డివామి,పశువుల పాక దగ్ధంమంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. సుమారు 4లక్షల మేర ఆస్తి నష్టం.
* స్థానికులు చూసి దేహశుద్ది, పోలీస్ లకు అప్పగింత.నిందితుడు వెంకటప్ప పై 342.376.ఫోక్స్.చట్టం నమోదు.రిమాండ్ కు తరలింపు.బాలికను వైద్య చికిత్స ల కోసం అనంతపురం సర్వజన ఆసుపత్రి కి తరలింపు.
* మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పాకాల ఏరు వద్ద కాకతీయ ప్యాసింజర్ కు తప్పిన పెను ప్రమాదం
విరిగిన పట్టాను గమనించి ట్రై న్ ను నిలిపివేసిన డ్రైవర్ అప్పటికే విరిగిన పట్టాను దాటిన బోగీలు ఉదయం 5 గంటలకు కాకతీయి ప్యాసింజర్ జరిగిన సంఘటన
*డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడంతో యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తాపడి ముగ్గురి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విశాఖ మన్యంలోని పాడేరు ఘాట్ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
*తక్కువ ధరకే ఖరీదైన ద్విచక్రవాహనం ఇస్తానని ఆన్లైన్లో నమ్మబలకడంతో ఓ యువకుడు రూ.30 వేలు చెల్లించి మోసపోయిన సంఘటన ఇది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నివాసముండే శివ(23) డోజర్ వాహనం డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
*ఆవు, గేదెల నుంచి అధిక మొత్తంలో పాలను కృత్రిమంగా రప్పించడానికి ఇచ్చే నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను విక్రయించిన ఓ నిందితునికి సికింద్రాబాద్ 10వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం మూడేళ్ల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.30వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
*ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలోని దబ్బకాంత అటవీ ప్రాంతంలో మంగళవారం సీఆర్పీఎఫ్ జవాన్లు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది.
*ఉద్యోగి ప్రిన్స్ శాంతకుమార్ హత్య కేసులో దోషిగా తేలిన శరవణ భవన్ అధినేత పి.రాజగోపాల్ ఎట్టకేలకు మంగళవారమిక్కడ అదనపు నాలుగో సెషన్స్ కోర్టులో లొంగిపోయాడు.
*అధికార తెరాసకు చెందిన ఓ ఎంపీటీసీ సభ్యుడిని మావోయిస్టులు అపహరించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్తకొత్తూరులో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
*గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య(వైకాపా)పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*దిల్సుఖ్నగర్లో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మనస్విని కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
*తమను దుండగులు అపహరించారని అసత్యాలు చెప్పి ఇద్దరు విద్యార్థులు తమ తల్లిదండ్రులను, పోలీసులను పరుగులు పెట్టించిన ఘటన లఖ్నవూలోని సాదత్గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
*కర్ణాటక రాజధాని బెంగళూరులోని పులకేశి నగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం బుధవారం తెల్లవారుజామున కూలింది. ఈ ఘటనలో ఘటనలో బిహార్కు చెందిన ఓ కార్మికుడు మృతిచెందాడు.
*అదనపు కట్నం వేధింపుల కారణంగా నిండు గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. మరో మూడు రోజుల్లో శిశువుకు జన్మనివ్వాల్సిన ఆమె ప్రాణాలు కోల్పోయిన ఘటన కూకట్పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
*కర్ణాటక రాజధాని బెంగళూరులోని పులకేశి నగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం బుధవారం తెల్లవారుజామున కూలింది. ఈ ఘటనలో ఘటనలో బిహార్కు చెందిన ఓ కార్మికుడు మృతిచెందాడు.