DailyDose

వై.ఎస్.రాజారెడ్డి వచ్చేస్తున్నాడు-రాజకీయ–07/10

YS Rajareddy To Enter Politics-Daily Politics-July 10 2019

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వ్యక్తి రాజారెడ్డి. రాజారెడ్డి అంటే దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి అనుకుంటే పొరపాటే. రాజారెడ్డి మునిమనవడు, వైయస్ షర్మిల అనిల్ దంపతుల వారసుడు రాజారెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాల్లో రాజారెడ్డి హల్ చల్ చేశారు. వైయస్ఆర్ జయంతి ఉత్సవాల్లో రాజారెడ్డి హల్ చల్ చేశారు. ఆరున్నర అడుగుల ఎత్తుతో మంచి ఫిట్నెస్ తో బాలీవుడ్ హీరోని తలపించేలా కనిపించడంతో అంతా ఆయనపైనే దృష్టి సారించారు. వైయస్ షర్మిల, అనిల్ దంపతులను మించి మంచి హైట్ రాజారెడ్డి. వైయస్ జయంతి ఉత్సవాల్లో మేనమామ సీఎం వైయస్ జగన్ తో ముచ్చటించారు. సీఎం జగన్ తో కలిసి సందడి చేశాడు. ఇకపోతే అమ్మమ్మ వైయస్ విజయమ్మ వెన్నంటి ఉండేవాడు రాజారెడ్డి. రాజారెడ్డి అంటే వైయస్ కుటుంబంలో ప్రత్యేక ఆకర్షణ. వైయస్ వంశవృక్షం అయిన రాజారెడ్డిని గుర్తుకు తెచ్చేలా షర్మిల తనయుడుకు ఆ పేరు పెట్టారు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. తన తాతయ్య రాజారెడ్డి అంటే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టం. సీఎం వైయస్ జగన్ తన తాత వైయస్ రాజారెడ్డి పోలిక అంటూ ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకు ఉన్న రాజకీయ చతురత, కోపం అన్ని జగన్ లో ఉన్నాయని ఆయన సన్నిహితులు చెప్పేవారు. వైయస్ జగన్ కు గానీ షర్మిలకు గానీ రాజారెడ్డి అంటే చాలా ఇష్టమట. తన తాతయ్యపేరు వైయస్ షర్మిల తనయుడుకు పెట్టడంతో వైయస్ జగన్ మేనల్లుడుపై ప్రత్యేక ప్రేమ చూపించేవారట. ఇంటి సభ్యులంతా కలిసినప్పుడు వైయస్ జగన్ రాజారెడ్డితోనే ఎక్కువ సమయం గడుపుతుండేవారని చెప్తుంటారు. ఆకస్మాత్తుగా వైయస్ జయంతి ఉత్సవాల్లో రాజారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో వైయస్ జగన్ వారసుడు రాజారెడ్డి అంటూ ప్రచారం జరుగుతోంది. సీఎం వైయస్ జగన్ కు కుమారులు లేరు. ఇద్దరు కుమార్తెలే. దాంతో వైయస్ షర్మిల తనయుడు రాజారెడ్డియే వైయస్ జగన్ వారసుడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాజారెడ్డికి రాజకీయాలంటే ఇష్టమని ప్రచారం ఉంది. వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్నప్పుడు తల్లి అడుగులో అడుగులు వేశాడు. చాలా సార్లు ఆమెతో కలిసి పాదయాత్ర చేశారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో రాజకీయ వేదికలపై కూడా హల్ చల్ చేశారు. అయితే గతంలో వైయస్ జగన్ పై కేసులు, ఆనాడు నెలకొన్న రాజకీయ సమస్యల నేపథ్యంలో వాటి ప్రభావం రాజారెడ్డిపై పడకుండా ఉండాలని కుటుంబ సభ్యులు అతనిని బెంగళూరుకు పంపించి వేశారు. రాజారెడ్డి బెంగళూరులోనే ఉండి చదువుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నాడు రాజారెడ్డి. మరోవైపు రాజారెడ్డిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని ప్రచారం కూడా ఉంది. రాజారెడ్డి తన తండ్రి బ్రదర్ అనిల్ మాదిరిగా మత ప్రబోధకుడిగా మారుతాడని తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే విదేశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారని ప్రచారం. మెుత్తానికి రాజారెడ్డి టాపిక్ మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడం విశేషం. రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారా లేక తండ్రి అడుగుజాడల్లో నడుస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి.
* రాజ్‌భవన్ ముందు కాంగ్రెస్ ధర్నా……..
ర్ణాటకలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్‌భవన్‌ ముందు బుధవారం నాడు ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నర్‌ను ఉపయోగించుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా గవర్నర్లను కేంద్రం తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొంటుందని కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు.అరుణాచల్‌ప్రదేశ్ నుండి కర్ణాటక రాష్ట్రం వరకు కేంద్రం గవర్నర్లను ఇందుకే వినియోగించుకొంటుందని ఆయన ఆరోపించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
* ఎన్ఆర్‌సీని కర్ణాటకలో అమలు చేయాలి: బీజేపీ ఎంపీ
జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్‌సీ)ని కర్ణాటకలో అమలు చేయాలని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి వలస వచ్చిన వారి వల్ల రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాది బెంగళూరులో పట్టుబడిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. రాష్ట్రంలో జాతీయ పౌర జాబితాను అమలు చేసి అక్రమ వలసదారులను బయటకు పంపాలని విన్నవించారు. కాగా.. తేజస్వీ సూర్యా బెంగళూరు సౌత్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
* చంద్రబాబు పాలన గడ్డుకాలం: ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన బుగ్గన………
తెలుగుదేశం పాలన కాలం ఒక బేడ్ పీరియడ్ అంటూ అభివర్ణించారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమరావతి సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉందంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని కానీ అది వాస్తవ పరిస్థితులో ఎక్కడా కనిపించడం లేదన్నారు. అంకెలు తప్ప వాస్తవ పరిస్థితుల్లో ఆ అభివృద్ధి కనిపించలేదన్నారు.వ్యవసాయ రంగం తగ్గుముఖం పట్టిందే తప్ప ఎక్కడా వృద్ధి చెందలేదన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధిని పరిశీలిస్తే అన్నీ మైనస్ స్థానంలో ఉన్నాయన్నారు. అయితే చేపలు, గొర్రెలు పెంపకం ఉత్పత్తి పెంచడాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవసాయ రంగం 33 శాతం పెరిగిందని చూపించారని అది సరికాదన్నారు. చేపల ఉత్పత్తి పెంపకం పెరిగినంత మాత్రాన గ్రోత్ రేట్ అనేది వ్యవసాయ రంగంలో ఉంటుందా అని నిలదీశారు. 2004 నుంచి 2009 కాల మంధ్యఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని స్పష్టం చేశారు. 12శాతం వృద్ధితో దేశవ్యాప్తంగా ముందుస్థానంలో నిలిచామని తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో ఏపీ స్థూల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందన్నారు. చంద్రబాబు పాలన ఏపీకి గడ్డు కాలమని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో అప్పులు విపరీతంగా పెరిగాయని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పరిమితికి మించి అప్పులు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు.
*అప్పట్లో జగన్ ఫిర్యాదు: ఇప్పుడు సిబిఐ దాడులు, ఎవరీ బొల్లినేని గాంధీ…….?
ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణపై జిఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనపైనే కాకుండా ఆయన భార్య శిరీషపై కూడా కేసు నమోదు చేశారు. ఈ స్థితిలో ఎవరీ బొల్లినేని శ్రీనివాస గాంధీ అనే ఆసక్తి చోటు చేసుకుంది. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లో పనిచేసిన గాంధీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులను దర్యాప్తు చేశారు. అదే విధంగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కంపెనీలపై కూడా దర్యాప్తు చేశారు. రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. బొల్లినేని ఆస్తులను సోదా చేసిన సిబిఐ అధికారులు రూ. 3.75 కోట్ల అక్రమాస్తులను కనిపెట్టారు. గాంధీ విషయంలో రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రోద్బలంతో గాంధీ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.
* కోర్టుకెక్కిన కర్నాటకం..
కర్ణాటక రాజకీయ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఎటూ తేల్చకపోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. తమ రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్‌ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజీనామాలను ఆమోదించకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో పాలన గాడితప్పిందని.. అవినీతి, కుంభకోణాలు జరిగాయని ఎమ్మెల్యేలు పిటిషన్‌లో ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై రేపు విచారణ చేపట్టనుంది.
*చంద్రబాబు ప్రకటన.. పరిటాల కుటుంబానికి కీలక పదవి
పరిటాల కుటుంబానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పదవి కట్టబెట్టారు. మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటకు చంద్రబాబు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి బాధ్యతలు పరిటాల కుటుంబానికే అప్పగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబానికే కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అయితదే ఇందులో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఎవరు ఎక్కడ బాధ్యతలు తీసుకుంటారో వారి నిర్ణయానికే వదిలేస్తున్నానని అన్నారు.పరిటాల సునీత కుటుంబ సభ్యులతో చర్చించి ఎవరు ఎక్కడ ఇన్‌చార్జిగా ఉండాలో తెలియజేస్తామని చెప్పడంతో ధర్మవరానికి వారిరువురిలో ఎవరు బాధ్యత వహిస్తారన్నది తెలియాల్సి ఉంది.అనంతరం పరిటాల సునీత మాట్లాడుతూ ఓ నాయకుడు ఇదే ధర్మవరంలో తాము మాట్లాడటానికి కూడా అవకాశమివ్వలేదని, అదే వ్యక్తి పార్టీని వీడి వెళ్లాడన్నారు. అయితే కొందరు వస్తుంటారు, పోతుంటారని, వారి గురించి పట్టించుకోనవసరం లేదన్నా రు. చంద్రన్న మాటే శిరోధార్యమన్నారు. మా కుటుం బ సభ్యులందరితోనూ చర్చించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఇన్‌చార్జిగా ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకుంటామని ఆమె పేర్కొన్నారు.
* యూఏఈతో సంబంధాల బలోపేతం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో గత ఐదేళ్లలో ద్వైపాక్షిక సంబంధాలు బాగా మెరుగయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంధనం, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో ఆ దేశంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. భారత పర్యటనకు విచ్చేసిన యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ దిల్లీలో మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు యూఏఈ నాయకత్వం తరఫున మోదీకి జాయెద్ శుభాకాంక్షలు తెలిపారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు.
* కమలానికి రూ. 915 కోట్ల కార్పొరేట్ విరాళాలు – ఏడీఆర్ నివేదిక
కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించిన జాతీయ పార్టీల్లో భాజపాకు 2016-17 నుంచి 2017-18 మధ్య రూ. 900 కోట్లకు పైగా అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పేర్కొంది. జాతీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలపై ఏడీఆర్ మంగళవారం ఓ నివేదికలో విశ్లేషించింది. ఈ రెండేళ్ల కాలంలో వివిధ వాణిజ్య సంస్థలు జాతీయ పార్టీలకు రూ.985.18 కోట్ల విరాళాలు అందజేసినట్లు తెలిపింది. భాజపా దాదాపు మొత్తం రూ. 915.59 కోట్లు (1,731 కార్పొరేట్ల నుంచి) స్వీకరించగా, కాంగ్రెస్ రూ. 55.36 కోట్లు (151), ఎన్సీపీ రూ. 7.73 కోట్లు (23) స్వీకరించినట్లు ఏడీఆర్ పేర్కొంది. కార్పొరేట్ విరాళాల్లో సీపీఐకి 2% అందినట్లు ఏడీఆర్ పేర్కొంది.ఈ రెండేళ్లలో రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో 49.58% వాటా ఎలక్టోరల్ ట్రస్ట్లదే. తర్వాతి స్థానాల్లో తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్), స్థిరాస్తి, మైనింగ్, నిర్మాణ, ఎగుమతులు, ట్రస్ట్లు, గ్రూప్లు, హెల్త్కేర్, ఫైనాన్స్ సంస్థలున్నాయి.
* రూ.7లక్షలు పరిహారం ఇచ్చేలా చట్టం:ఏపీ సీఎం
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారాలను పంపిణీ చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 2014-19 వరకు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు వీటిని అందజేయాలని తెలిపారు. 2014-19 సమయంలో మొత్తం 1,513 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినట్లు రికార్డులు చెబుతుండగా.. 391 మంది రైతుల కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చినట్లు గణాంకాలు ఉన్నాయన్నారు. వీటిని చూస్తే గత ప్రభుత్వం ఈ కుటుంబాలకు పరిహారం నిరాకరించినట్లు అర్థమవుతోందని సీఎం పేర్కొన్నారు. జిల్లాల్లో డేటాలను పరిశీలించి అర్హత ఉన్న కుటుంబాలకు తక్షణమే పరిహారం ఇవ్వాలని తెలిపారు.
* రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి : కాంగ్రెస్‌
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌.. ఈ అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదని హేళన చేశారు. అసలు రుణమాఫీ ఒకేసారి చేస్తారా, విడతల వారీగా చేస్తారా అనే స్పష్టత ఇవ్వాలని మండిపడ్డారు. రైతు బంధు పథకం పై గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పవరకు కేవలం 50 శాతం రైతులకు మాత్రమే రైతు బంధు చెక్కులు అందాయన్నారు.
* సుప్రీంకు చేరిన కర్ణాటక సంక్షోభం
కర్ణాటక రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరింది. తమ రాజీనామాలను స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఆమోదించకపోవడంపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. రెబల్‌ ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టేందుకు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అంగీకరించారు.కర్ణాటకకు చెందిన 14 మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు సమర్పించగా.. వాటిలో ఐదు మాత్రమే ఫార్మట్‌ ప్రకారం ఉన్నాయని స్పీకర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్‌ నిర్ణయంపై రెబల్‌ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్పీకర్‌ రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వహించడంలేదని విమర్శించారు.
* సోనియాతో సౌమ్యారెడ్డి భేటీ.. వేగంగా మారుతున్న పరిణామాలు
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అసంతృప్తులను కాంగ్రెస్-జేడీఎస్ నేతలు బుజ్జగిస్తూనే ఉన్నారు. సీఎల్పీ సమావేశానికి 21 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అటు ఈనెల 21న క్యాబినెట్ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని మాజీ సీఎం సిద్ధారామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఆపరేషన్ కమల్‌కు చెక్‌ పడుతుందని పేర్కొన్నారు.కర్ణాటకలో రాజకీయ పరిణామాలు క్షణం క్షణం మారుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఏ మాత్రం ఫలించడం లేదు. ముంబైలో ఉన్న 13 మందిని కలవడానికి కాంగ్రెస్ ట్రుబల్ షూటర్ డీకే శివకుమార్ సోమవారం వెళ్లేసరికి వాళ్లు గోవాకు మకాం మార్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశమైంది. తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా చర్చించారు. . ఈ సమావేశానికి 21 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి మొత్తం 78 మంది కాంగ్రెస్‌ సభ్యులుంటే, 57 మంది మాత్రమే హాజరయ్యారు. రిజైన్ చేసిన ఎమ్మెల్యేలతో పాటు రాజీనామా చేయని మరో ఆరుగురు ఎమ్మెల్యే లు మీటింగ్‌కు హాజరు కాలేదు. శివణ్ణ, MBTనాగరాజు, రోషన్‌ బేగ్‌, బీకే సంగమేష్‌, అంజలి నింబా ళ్కర్‌, కె. సుధాకర్‌ సీఎల్పీ భేటీకి దూరంగా ఉన్నారు. ఇందులో రోషన్ బేగ్ తన పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను స్పీకర్‌కు సమర్పించారు. ఈయన బీజేపీలో చేరబోతున్నారని సమాచారం . ఈ భేటీకి అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి సోనియాగాంధీతో సమావేశమైన తర్వాత హాజరయ్యారు.
* నాది ఆయన లాంటి వ్యక్తిత్వం కాదు:బాల్క సుమన్‌
టీఆర్‌ఎస్‌కు ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గుడ్‌ బై చెప్పారు. ఐతే.. వెళ్తూ వెళ్తూ ఆయన చేసిన ఆరోపణలు టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతున్నాయి. పార్టీలో అరాచకం పెరిగిపోయిందని.. కేసీఆర్‌ డిక్టేటర్‌గా మారిపోయారంటూ సోమారపు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఐతే.. త్వరలోనే సోమారపు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ.. వెళ్తూ వెళ్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. రామగుండంలో తన ఓటమికి బాల్క సుమన్, మరికొందరు నేతలు కారణమని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా తనను వేధించారన్నారు. పార్టీలో గౌరవం లేనప్పుడు పనిచేయడం కష్టమన్నారు. కేసీఆర్ ను తాను అడగకుండానే ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అయినా..కొందరి తీరు వల్లే టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నానన్నారు.
* ఆ వార్త పూర్తిగా అవాస్తవం..: హరీశ్‌ రావు
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం మంగళవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్ర్తోక్తంగా వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఎల్లమ్మ తల్లిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌ రావు కాళ్లు మొక్కేందుకు ఇంద్రకరణ్‌రెడ్డి ప్రయత్నించారని ఓ వార్తాపత్రికలో ఫొటోతో పాటు కథనాన్ని ప్రచురించారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో హరీశ్‌ రావు ట్విటర్‌లో స్పందించారు.
* ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ సీఎం చంద్రబాబు చెప్పారు. మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. శ్వేతపత్రాల్లో ఏం చెబుతారో వేచి చూస్తామన్నారు. గతంలో టీడీపీ కూడా వైట్ పేపర్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. అప్పుడూ.. ఇప్పుడూ సమాచారం ఇచ్చింది ఒకే అధికారులని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు వంటి అంశాల్లో నిరంతర పర్యవేక్షణ వల్లే టీడీపీ హయాంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని తెలిపారు. గోదావరికి వరద ఉధృతి ఉన్నప్పటికీ పట్టిసీమ నీళ్లు ఇవ్వడంలో జాప్యం జరిగిందని ఆరోపించారు. అధికారులతో పాలకులు సమన్వయం లేకుంటే ఇలాంటి ఇబ్బందులే వస్తాయని విమర్శించారు. హంద్రీనీవా జలాల లబ్ధి ఆ ప్రాంత ప్రజల కళ్లల్లో కనిపిస్తుందని స్పష్టం చేశారు.
* రూ.7లక్షలు పరిహారం ఇచ్చేలా చట్టం:ఏపీ సీఎం
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారాలను పంపిణీ చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 2014-19 వరకు ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు వీటిని అందజేయాలని తెలిపారు. 2014-19 సమయంలో మొత్తం 1,513 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినట్లు రికార్డులు చెబుతుండగా.. 391 మంది రైతుల కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇచ్చినట్లు గణాంకాలు ఉన్నాయన్నారు. వీటిని చూస్తే గత ప్రభుత్వం ఈ కుటుంబాలకు పరిహారం నిరాకరించినట్లు అర్థమవుతోందని సీఎం పేర్కొన్నారు.
* పెన్షన్ పెంపు, వైసీపీ ప్రభుత్వం ప్రకటనల పై … ట్విట్టర్ లో నారా లోకేష్
పెన్షన్ పెంపు పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రకటనల పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విటర్ ద్వార తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వం జనవరి 2019 నుంచి జూన్ వరకు అంటే ఆరు నెలల పాటు.. రూ.2వేలు పెన్షన్ ఇచ్చింది మర్చిపోయారా? దులో ఐదు నెలలపాటు చంద్రబాబు సీఎంగా ఉండగా పెన్షన్ ఇచ్చిన విషయం మరిచిపోయారా? అంటూ ముఖ్యమంత్రి జగన్ ను ద్దేశించి లోకేష్ ప్రశ్నించారు. ఒక ప్రభుత్వ ప్రకటనలు ఇన్ని అబద్ధాలు?.. ఎందుకు ఇన్ని డబ్బులు తగలెయ్యాలి? అంటూ ట్విట్టర్లో లోకేష్ పేర్కొన్నారు.
*స్పీకర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం: మురళీధర్రావు
కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై అక్కడి స్పీకర్ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సభ్యత్వ నమోదు ప్రారంభించేందుకు మంగళవారం భువనగిరికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి భాజపా, మోదీకి వ్యతిరేకంగా ఏర్పడిందని, అది ఎక్కువ రోజులు నిలవదని ఇప్పుడు స్పష్టమైందన్నారు. స్పీకర్ తుది నిర్ణయంపైనే తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.
*తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఉత్తమ్
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం నెరవేర్చాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ హామీలను ఇంకా నెరవేర్చలేదన్నారు. గతేడాది, ఈ ఏడాది బడ్జెట్లలో రూ.కోటి వంతున గిరిజన వర్సిటీకి కేటాయించారని, వీటితో ఏర్పాటు సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు.
*మురుగు నీటి శుద్ధి కేంద్రాలు పెంచాలి
మూసీ నది కాలుష్యకాసారంగా మారినందున మురుగు నీటి శుద్ధి కేంద్రాలు పెంచాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 240 కిలోమీటర్లు ప్రవహించే మూసీ నది 70 శాతం తన నియోజకవర్గ పరిధిలోనే ఉందని తెలిపారు. హైదరాబాద్ మహానగర నీటిసరఫరా, మురుగు నీటి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో 20 మురుగు నీటి శుద్ధి కేంద్రాలున్నాయని తెలిపారు.
*మిషన్ భగీరథే..‘హర్ ఘర్ జల్’
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో పేర్కొన్న హర్ ఘర్ జల్ (ప్రతి ఇంటికి నీరు) పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో ప్రవేశపెట్టారని తెరాస లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. 2016, ఆగస్టు 7న ప్రధాని మోదీ మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్పై చర్చలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు ఆడబిడ్డ. తెలుగింటి కోడలు. అయినా కేంద్ర బడ్జెట్లో తెలంగాణతోపాటు దక్షిణాదిరాష్ట్రాలకు అన్యాయం జరిగింది. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా పథకం అమలు చేస్తామని, ఈ అంశంలో రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని కేంద్రం చెబుతోంది.
*తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఉత్తమ్
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం నెరవేర్చాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీ హామీలను ఇంకా నెరవేర్చలేదన్నారు. గతేడాది, ఈ ఏడాది బడ్జెట్లలో రూ.కోటి వంతున గిరిజన వర్సిటీకి కేటాయించారని, వీటితో ఏర్పాటు సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు.
*రెవెన్యూ చట్టాల మార్పు పేరుతో గారడీ!: చాడ
తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ అధికారుల పట్ల ఇష్టానుసారం వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు.ఆయన మంగళవారం పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ, రెవెన్యూ చట్టాల మార్పుదల అంటూ మాటల గారడీ చేస్తున్నారన్నారు.
*పార్లమెంటును కుదిపేసిన కర్ణాటక సంక్షోభం
కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై పార్లమెంటులో కాంగ్రెస్ మంగళవారం గళమెత్తింది. భాజపా తిరుగుబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. లోక్సభ, రాజ్యసభల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కర్ణాటక పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు నిరసనలకు దిగటంతో రాజ్యసభ కార్యకలాపాలకు పదే పదే అవరోధం కలిగింది. చివరకు ఎలాంటి చర్చ జరగకుండానే మధ్యాహ్నం 2 గంటల సమయంలో సభ వాయిదా పడింది.
*అధికారికంగా జరగాలి
కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం జరుగుతున్న కసరత్తుపై ఆ పార్టీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేది తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సాంకేతికంగా ఇంకా పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతున్నందున ఆయనే తన వారసుడిని ఎంపిక చేసేలా ఒక విధానాన్ని రూపొందించి ఉండవలసిందని అభిప్రాయపడ్డారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో పార్టీ సంప్రదాయాలను, నిబంధనలను అనుసరించాలన్నారు. ‘నాకు ఉన్న అవగాహన మేరకు రాహుల్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ ప్రాతిపదికనే కొన్ని నియామకాలు కూడా జరుగుతున్నాయి.
*కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి
ప్రతిష్ఠాత్మక రీతిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. లోక్సభలో మంగళవారం బడ్జెట్పై చర్చలో పాల్గొంటూ, రాష్ట్ర జీవనాడి అయిన ఆ ప్రాజెక్టును వచ్చి చూడాలన్నారు. అందరికీ హామీలు ఇచ్చినా అమలుచేయకుండా మోసగిస్తోందంటూ కేంద్రప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ముస్లింలకు, దళితులకు ఉపకార వేతనాలు తగ్గించారని నిరసన వ్యక్తంచేశారు. ముంబయిలో పెద్దపెద్ద భవంతుల్లో ఉండే పెట్టుబడిదారులకే కేంద్రం మేలుచేస్తోందని; ముడి సామగ్రి లభించక ఇబ్బందులు పడుతున్న భివండీ, ఇతర ప్రాంతాల నిరుపేద చేనేత పనివారిని పట్టించుకోవడం లేదని అసదుద్దీన్ ఆరోపించారు.
*పోచారంతో కేరళ సభాపతి రామకృష్ణన్ భేటీ
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేరళ సభాపతి శ్రీరామకృష్ణన్ మంగళవారం రాష్ట్ర శాసనసభలో సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డితో భేటీ అయ్యారు. శాసనసభాకార్యదర్శి నర్సింహాచార్యులు, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, హన్మంతు షిండే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేరళ, తెలంగాణ శాసనసభ విశేషాలు, నిర్వహణ, ఇతర అంశాల గురించి ఇద్దరు సభాపతులు చర్చించినట్లు తెలిసింది. త్వరలో కేరళకు రావాలని ఈ సందర్భంగా రామకృష్ణన్.. పోచారం శ్రీనివాస్రెడ్డిని ఆహ్వానించారు.
*వల్లభనేని వంశీ ఎన్నికను రద్దుచేయండి
కృష్ణాజిల్లా గన్నవరం నుంచి తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఎన్నికను రద్దుచేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలైంది. ఆ నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున బరిలో దిగిన వై.వెంకటరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలను వంశీ ఉల్లంఘించారన్నారు. ‘ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో వంశీ సూచన మేరకు ఆయన ప్రతినిధులు పూర్వ తహశీల్దార్ సంతకంతో ఇంటి స్థలాల పట్టాలను పంచిపెట్టారు. నకిలీ పట్టాలను పంచారని తెలుసుకున్న కొందరు ఠాణాలో ఫిర్యాదు చేశారు’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లను మరోసారి లెక్కించేలా ఆదేశించాలని, ఓట్లను తిరిగి లెక్కించాలని అభ్యర్థించారు.
*కాపుల రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి: ముద్రగడ
కాపుల రిజర్వేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో లేఖ ప్రతులను విలేకర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాష్ట్రంలోని కాపులు తమకు మేలు జరుగుతుందని ఆలోచించి వైకాపాకు ఓటువేసి గెలిపించారని పేర్కొన్నారు.
*భాజపాలో చేరిన ఈదర హరిబాబు
ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ తాజా మాజీ అధ్యక్షుడు ఈదర హరిబాబు మంగళవారమిక్కడ భాజపాలో చేరారు. హరిబాబు, ఆయన కుమారుడు భరత్లకు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం హరిబాబు మాట్లాడుతూ..ఏ సంకల్పంతో ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారో ఆ సంకల్పం ప్రస్తుత పార్టీలో లేదన్నారు. నవ భారత నిర్మాణం కోసం ప్రధాని మోదీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.
*పరువు నష్టం కేసుల్లో రాహుల్కు సమన్లు
పరువు నష్టం దావాలకు సంబంధించి విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి గుజరాత్లోని రెండు న్యాయస్థానాలు సమన్లు జారీ చేశాయి. ఆగస్టు 9న హాజరు కావాలని అహ్మదాబాద్లోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు ఇచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ‘హత్య కేసు నిందితుడి’గా సంబోధించడంపై స్థానిక భాజపా నేత ఈ దావాను వేశారు. ఈ కేసులో మే 1న ఒకసారి రాహుల్కు సమన్లు జారీ అయ్యాయి. ఆయన ఎంపీ కావడంతో లోక్సభ స్పీకర్ ద్వారా వాటిని జారీ చేశారు. అయితే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి స్పీకర్ నిరాకరించడంతో సమన్లు తిరిగొచ్చాయి. అలాగే ‘దొంగలందరి ఇంటి పేరు మోదీ’ అంటూ చేసిన వ్యాఖ్యలపై జులై 16న హాజరు కావాల్సిందిగా సూరత్లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమన్లు ఇచ్చారు.