Business

మందురాయుళ్లకు దుబాయి ఆఫర్

Dubai Offers 30 Days Free Alcohol License

అరబ్ దేశాల్లో మద్యంపై కఠిన నిబంధనలు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. మద్యం తాగేవారు అక్కడి చట్టాల ప్రకారం ప్రత్యేకంగా లైసెన్స్ కలిగి ఉండాలి. అయితే దుబాయి వెళ్లే సందర్శకులకు అక్కడి ప్రభుత్వం తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మద్యం తాగే సందర్శకులకు దుబాయి ప్రభుత్వం 30 రోజుల ఫ్రీ ఆల్కహాల్ లైసెన్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా సందర్శకులు ముస్లిమేతరులు అయ్యి ఉండి, 21 ఏళ్లకు పైబడిన వారికే ఈ లైసెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతేగాక అక్కడి చట్టాలను కూడా పాటించాల్సి ఉంటుంది. మారిటైమ్ అండ్ మెర్కాంటైల్ ఇంటర్నేషనల్(ఏంఏంఐ) ఎమిరేట్స్ గ్రూపు తన వెబ్‌సైట్‌లో టూరిస్ట్‌లు ఈ లైసెన్స్ కోసం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలో పూర్తి నియమ నిబంధనలను వెల్లడించింది. ఏంఏంఐ ఏ స్టోర్‌కైన వెళ్లి సందర్శకులు తమ ఓర్జినల్ పాస్‌పోర్టు చూపించి వారు ఇచ్చే అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో స్టోర్ యాజమాన్యం టూరిస్ట్ పాస్‌పోర్ట్‌కు సంబంధించిన జిరాక్స్ కాపీని తమ వద్ద ఉంచుకుంటుంది. అలాగే దుబాయిలో ఎలా ఉండాలో ఐదు సూచనలతో కూడిన పత్రాన్ని సందర్శకులకు ఇస్తారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు వీటిలో ముఖ్యమైనవి. ఇక దుబాయి రెసిడెంట్ వీసా కలిగిన వారికి మద్యం విషయంలో రెండేళ్ల లైసెన్స్ ఉంటుంది. వారు దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకొవచ్చు. వీసా కలిగిన వారికి నగరంలోని బార్స్ అండ్ రెస్టారెంట్స్‌లో మద్యం సేవించేందుకు కూడా లైసెన్స్ ఉంటుంది