DailyDose

కేశినేని బుద్దా మధ్య ముదురుతున్న రగడ-రాజకీయ–07/15

Kesineni Buddha Fight - Daily Telugu Politics - July 15 2019

*టీడీపీలో ట్విట్టర్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. ట్విట్టర్ వేదికగా నేతల మధ్య దూషణల పర్వం కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా వరుస ట్వీట్లతో హాట్‌టాపిగ్గా మారిన టీడీపీ ఎంపీ కేశినేని నాని…తాజాగా మరో సంచలన ట్వీట్ చేశాడు. పార్టీలో కొంతమంది నాయకులపై తనకున్న అసంతృప్తిని నేరుగా అధినేత చంద్రబాబుకు తెలిసేలా పోస్ట్ పెట్టాడు. వద్దంటే చెప్పండి.. చంద్రబాబు గారు..నాలాంటి వాళ్లు పార్టీలో వద్దనుకుంటే వెంటనే చెప్పండి. ఎంపీ పదవికి, పార్టీకి వెంటనే రాజీనామా చేస్తా. నా లాంటి వాళ్లు కావాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను కంట్రోల్‌ చేయండి’’ అని ట్వీట్ చేశారు. కేశినేని నాని తాజా పోస్టుతో టీడీపీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. పార్టీలో కొంతమంది ముఖ్య నేతలతో విభేదాల వల్లే కేశినేని నాని పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.విజయవాడ టీడీపీలో గత కొంతకాలంగా అంతర్గతపోరు నడుస్తుంది. కేశినేని నానికి..చంద్రబాబుకు నమ్మకస్తుడుగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న బుద్ధా వెంకన్నకు కొంతకాలంగా వైరం నడుస్తుంది.ఎన్నికల ముందు అంతర్గతంగా నడిచిన ఈ పోరు.. పార్టీ ఓటమి తరువాత మెల్లమెల్లగా రచ్చకెక్కుతూ వచ్చింది. తాజాగా నేతల మధ్య వర్గపోరు శ్రృతిమించింది. బహిరంగంగానే ఒకరిపై ఒకరు ట్విట్టర్‌ వేదికగా దూషణలు చేసుకుంటున్నారు. నిన్న ట్విట్టర్ వేదికగా కేశినేని నాని..ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న మధ్య ట్వీట్ల వార్ నడిచింది. నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం అంటూ కేశినేని నాని ట్వీట్‌ చేశారు.కేశినేని నాని ట్వీట్‌కు అంతేస్థాయిలో బదులిచ్చాడు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. సంక్షోభం సమయంలో పార్టీ కోసం, నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు. చనిపోయే వరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి అంటూ బుద్దా వెంకన్న కౌంటర్‌ ఇచ్చాడు. కేశినేని నాని, బుద్ధ వెంకన్న మధ్య విభేదాలు పార్టీ అధిష్టానాన్ని, క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తుంది. అంతర్గత విభేదాల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అటూ పార్టీ అధినేత చంద్రబాబు కూడా వీళ్ల అంతర్గపోరుపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తుంది.కేశినేని నాని, బుద్ధ వెంకన్నల మధ్య విభేదాలతో క్యాడర్‌ కూడా రెండుగా చీలిపోయింది. పార్టీ మారుతున్నట్టు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. కేశినేని నాని బీజేపీ గూటికి చేరతాడని బుద్ధ వర్గీయులు ప్రచారం చేస్తే..బుద్దా వెంకన్న వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నాడని కేశినేని వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అయితే కేశినేని నాని..బుద్ధా వెంకన్న ఇద్దరూ టీడీపీ వలస పక్షులే. బుద్ధా వెంకన్న కాంగ్రెస్‌ ఉంచి టీడీపీలో చేరితే..కేశినేని నాని ప్రజారాజ్యం నుంచి సైకిల్‌ ఎక్కారు.
*చిరంజీవి పార్టీని కూల్చావ్: బుద్ధా వెంకన్న, కేశినేనితో ముదురుతున్న వైరం……
అమరావతి : తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు మధ్య వైరం ముదురుతోంది. పరస్పరం తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఆదివారంనాడు ఉదయం ప్రారంభమైన ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేశినేని నానిపై బుద్ధా వెంకన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు.. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు” అని బుద్ధా వెంకన్న కేశినేని నానిపై విరుచుకుపడ్డారు. “విజయసాయి రెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు.. ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు” కూడా అన్నారు. “నిన్నటి దాకా చంద్రబాబు కాళ్ళు.. రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్ళు.. కాళ్ళు కాళ్లే.. వ్యక్తులు మాత్రమే తేడా!!!” అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. దానిపై బుద్ధా వెంకన్న తీవ్రంగా ప్రతిస్పందించారు. “గుర్తింపు కోసం అడుక్కునేవాడు అధమస్థాయి బిచ్చగాడు… విజయసాయిరెడ్డి గారు దీనికి మీరు పరాకాష్ట.. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత చంద్రబాబుగారిది” అని బుద్ధా వెంకన్న అన్నారు. -“అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేసిన అవినీతికి 16 నెలలు జైల్లో కూర్చున్న ఘనత తమది. విమర్శించడానికి నోరొక్కటే కాదు, అర్హత ఉండాలి విజయసాయి రెడ్డిగారు. మీకున్న ప్రధాన అర్హత కాళ్ళమీద పడడం అని మరిచారా?” అని కూడా అన్నారు.
* ప్రియాంక గాంధీకి యూపీ కాంగ్రెస్‌ బాధ్యతలు
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఈక్రమంలో రాష్ట్రాల వారీగా ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకుంది. ఎన్నికల్లో విఫలమైన తర్వాత ఆయా రాష్ట్రాల చీఫ్‌లు రాజీనామాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యూపీ కాంగ్రెస్ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఏడాది రాజకీయ అరంగేట్రం చేసిన ప్రియాంక గాంధీకి ఉత్తర్‌ ప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ తూర్పు యూపీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక.. ఇక రాష్ట్రం మొత్తం నాయకత్వం వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని 80 స్ధానాలకు గాను కాంగ్రెస్‌ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. కాంగ్రెస్‌కు కంచుకోటయిన అమేఠీలోనూ స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ గాంధీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలీలో మాత్రమే కాంగ్రెస్‌ నిలిచింది.ఎన్నికల్లో వైఫల్యం తర్వాత యూపీలోని జిల్లా కాంగ్రెస్‌ కమిటీలన్నింటినీ అధిష్ఠానం రద్దు చేసింది. ఎన్నికల్లో నెలకొన్న వివాదాలు, ఇతర సమస్యలను పరిష్కరించుకునేందుకు గానూ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అధికార భాజపా వీటిపై ఇప్పటికే దృష్టి సారించింది. దీంతో వ్యూహాత్మకంగానే కాంగ్రెస్‌.. ప్రియాంకను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
*ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజా
ఏపీఐఐసీ చైర్మన్‌గా నగరి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రోజా ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళ పక్షపాతి. బడ్జెట్‌ చూసి, నవరత్నాలు చూసిన ఆ విషయం అర్థమవుతుంది. పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేది. పెట్టుబడులు పెట్టేవారికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. పారిశ్రామికీకరణకు బడ్జెట్‌లో ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తాం. స్థానిక పరిశ్రమల్లో యువతకు 75శాతం చోటు కల్పిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. పారదర్వకంగా ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయింపు జరుగుతుంది.’ అని రోజా తెలిపారు.
* అసెంబ్లీ సమావేశాలు తగ్గుతున్నయ్
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తగ్గుతున్నాయి. సగటున ఏటా కనీసం 50 రోజులు కూడా జరగటం లేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ విడిపోయాయి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ అసెంబ్లీతో పోలిస్తే ఏపీ అసెంబ్లీ ఎక్కువ రోజులు సమావేశమైంది. 2014 నుంచి 2018 సెప్టెంబర్ ( సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దయింది) వరకు తెలంగాణ అసెంబ్లీ 124 రోజులు మాత్రమే సమావేశమైంది. నాలుగేండ్లకు లెక్కగడితే సగటున ఏడాదికి 31 రోజులు మాత్రమే సమావేశమైంది. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2014 నుంచి 2019 మార్చి వరకు 204 రోజులపాటు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా సుమారు 60 రోజులపైనే అసెంబ్లీ సమావేశాలు జరిగేవని మాజీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. 2009 నుంచి 2014 వరకు 254 రోజులు సమావేశాలు జరిగాయని చెప్తున్నారు.
*పోలవరంపై కేంద్రాన్ని నిలదీసిన విజయసాయిరెడ్డి
పోలవరంపై రాజ్యసభలో ప్రశ్నల పరంపర కొనసాగింది. పోలవరంపై ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంపై ప్రశ్నలు సంధించారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. సీబీఐ విచారణకు ఆదేశించే ఆలోచన ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. నిధుల విడుదల కోసం ఆర్థికశాఖకు అంచనాలను పంపిచకుండా రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ ఆమోదానికి పంపించాల్సిన ఆవశ్యకత ఏమిటని మరోసారి ప్రశ్నించారు. దీని వల్ల మరింత కాలయాపన జరిగే అవకాశం ఉందని, ఎప్పటిలోగా ఈ కమిటీ తన ఆమోదం తెలుపుతుందా అని నిలదీశారు. ఎప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
* చంద్రబాబు చెబితే నమ్మాలట : ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి
2వేల కంటే 15వేలు తక్కువని చంద్రబాబు చెబితే నమ్మాలిౌ కాదంటే ధర్నాలు చేయిస్తారట అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇంటర్‌ విద్యార్థులకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం ఏడాది ఖర్చు రూ.2వేలు అన్నారు. విద్యార్థులను ఆర్థికంగా ఆదుకునేందుకు భోజనానికి బదులు ఏటా రూ.15వేలు ఇస్తామని సీఎం జగన్‌ చెబితే చంద్రబాబు దారుణం అంటున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.వైసీపీ దాడులపై అసెంబ్లీ‌లో టీడీపీ వాయిదా తీర్మానం
* వ్యవసాయం దండగా కాదు పండగ చేస్తాం. :ఎమ్మెల్యే గంగుల నాని.
శిరువెళ్ల. (మహాదేవపురం)గత ప్రభుత్వ హయాంలో విలయతాండవం చెసిన కరువు ప్రభావం నేడు రైతుల పై చూపకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తున్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల భిజేంద్రరెడ్డి(నాని)పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా శిరువెళ్ల మండలం మహాదేవపురం గ్రామంలో గత నాలుగు రోజులక్రితం ఆత్మహత్య చేసుకున్న కొట్టే శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించారుకర్నూల్ జిల్లా కలెక్టర్ విరపాండ్యన్ ఎమ్మెల్యే గంగుల భిజేంద్రరెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి లక్షల చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల నాని మాట్లాడుతూ రైతు ఆత్మహత్య సంఘటన ను తన తన తండ్రి శాసనమండలి విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గా తను ముఖ్యమంత్రి. వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సత్వర న్యాయనికి కృషిచేసినట్లు పేర్కొన్నారు.వైఎస్సార్ ప్రభుత్వ లో అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాలిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.రైతులకు భోరు బావులు ఉచితంగా వేసే ఏర్పాట్లు వేగవంతం గా జరుగుతున్నాయన్నారురైతులకు పంటల బీమా డబ్బులు ప్రభుత్వమే చెల్లించేందుకు తమ ప్రభుత్వ ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.ప్రతి రైతు ఆత్మస్థైర్యం తో పంటలసాగు చేపట్టేందుకు వ్యవసాయాన్ని పండగ చేసేందుకు తమ ప్రభుత్వం బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే గంగుల నాని తెలిపారుఆళ్లగడ్డ నియోజకవర్గ ములోని ప్రతి రైతు ఆత్మస్థైర్యం తో పంటల సాగు చేపట్టి అధిక దిగుబడులు సాదించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు తరుచు తగిన సూచనలు సలహాలు అందించేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు..ఈ కార్యక్రమంలో.వ్యవసాయ శాఖ డిడి శ్రీనివాసరావు ఆర్డీఓ నారాయనమ్మ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తహసీల్దార్ నాగరాజు ఎస్సై తిమ్మారెడ్డి మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ హాక్.vro శ్రీకాంత్ ఇతర అధికారులువైసీపీ నాయకులు కంపరాజు రాజేష్ గౌడ్.నరహరి.అబ్దుల్ సలాం.నజీర్ మందాల శివారెడ్డి. సుబ్బరాయుడు జింకల నాగన్న.నాగభూషణం రెడ్డిఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
* చంద్రబాబువిదేశీ పర్యటనలతో ప్రజలపై భారం-కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చుతో ప్రజలపై భారం పడిందని అన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రూ.39కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఆయన విదేశీ పర్యటనలపై విచారణ జరిపించాలన్నారు. తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు. ఏపీకి ఐటీ సంస్థలు వస్తున్నాయని నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారని, ఆయన అనుభవంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు.
* జాధనం దుర్వినియోగం: బుగ్గన
గత ప్రభుత్వ హయాంలో రూ.38వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో చంద్రబాబు, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనపై ప్రశ్నోత్తరాల సమయంలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. విదేశీ పర్యటనలతో ఎంత లాభం వచ్చింది? అని ప్రశ్నించారు. చంద్రబాబు తిరిగినట్లు ఇతర రాష్ట్రాల సీఎంలు తిరగలేదన్నారు. అలాంటి రాలకు కూడా పెట్టుబడులు వచ్చాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సీఎంలు విదేశీ పర్యటనలకు వెళ్లారని మనం విన్నామా? అని ప్రశ్నించారు. ఐటీ కోసం తిరిగామని తమిళనాడు ప్రభుత్వం ఏనాడూ చెప్పలేదే?నన్నారు. కంప్యూటర్‌ కూడా వాళ్లే కనిపెట్టినట్లు టీడీపీ ప్రభుత్వం చెబుతోందని, చంద్రబాబు వెళ్లడం వల్లే పరిశ్రమలు వచ్చాయని గొప్పగా చెబుతున్నారని విమర్శించారు. పరి శ్రమ పెట్టాలని గతంలో వైఎస్‌ కోరారని కియా మోటార్స్‌ ప్రతినిధులే చెబుతున్నారన్నారు. ఆరోజు వైఎస్‌ఆర్‌ చేసిన విజ్ఞప్తి మేరకే కియా మోటార్స్‌ పెట్టామని చెప్పారన్నారు.
* పెట్టుబడులను తీసుకొచ్చేందుకే విదేశాలకు వెళ్లా: చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకే విదేశాలకు వెళ్లానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి ఉపాధి కల్పించాలని పని చేశామన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమ స్థానానికి వచ్చామన్నారు. కియా మోటార్‌ను తీసుకొచ్చామన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించేందుకే రేయింబవళ్లు తిరిగానన్నారు. బురదజల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. నన్ను విమర్శించే ముందు మీ సంగతి చూసుకోండన్నారు. ఏ విచారణకైనా తాను రెడీనని చంద్రబాబు పేర్కొన్నారు.
* కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలి: యెడ్యూరప్ప
కుమారస్వామి సర్కార్ పడిపోగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా బీజేపీ పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యెడ్యూరప్ప. ఇద్దరు ఇండిపెండెంట్లు, 15మంది కాంగ్రెస్, JDS ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని.. మెజార్టీ లేనప్పుడు కుమారస్వామి సీఎంగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. రాజీనామాలు చేసినవారంతా బీజేపీకి మద్దతిస్తున్నారని చెప్పారు యెడ్యూరప్ప.
* వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచింది : టీడీపీ ఎమ్మెల్యే
45 రోజుల వైసీపీ పాలనలో ఏపీ వెలవెలపోతుంటే.. తెలంగాణ ఆర్థికంగా వెలిగిపోతుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. యువనేస్తం పథకాన్ని రద్దు చేసి.. నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైసీపీ కార్యకర్తల కోసమే వాలంటీర్‌ వ్యవస్థను తీసుకోచ్చారని ఆరోపించారాయన. బడ్జెట్‌ కేటాయింపులు చూస్తుంటే.. నవరత్నాలు నవ సందేహాలుగా మిగిలిపోతున్నాయని విమర్శించారు నిమ్మల రామానాయుడు.
* బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే
తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.. కీలకమైన నేతలను తమవైపు తిప్పుకుంటూ బలాన్ని మరింత పెంచుకుంటోంది.. తాజాగా టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. పార్టీ క్రమశిక్షణ మేరకు నడుచుకుంటానని చెప్పారు.రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సోమారపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీనియర్‌ నేత దత్తాత్రేయ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సోమారపు సత్యనారాయణతోపాటు పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోమారపు సత్యనారాయణకు రామగుండంలో గట్టి పట్టుంది. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన సోమారపు సత్యనారాయణ.. టీఆర్‌ఎస్‌ వైఖరిపై ఆగ్రహంతో పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని భావించారు. అయితే, ఆయన్ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ చర్చలు జరిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సోమారపు ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. సోమారపు సత్యనారాయణను బీజేపీలో చేరేందుకు ఒప్పించారు.
* రాబోయే రోజుల్లో ఏపీలో మిగిలేవి బీజేపీ వైసీపీలే: చౌహాన్
వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన ఆపార్టీ టీడీపీ నేతలకు గాలం వేస్తోంది. పలువురు నేతలను ఇప్పటికే పార్టీలోకి ఆహ్వానించగా.. రానున్న రోజుల్లో వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి మోదీ పాలనలోని లబ్ధి చేకూరిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రలో ఘోర పరాజయం పాలైన కమలం పార్టీ.. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలను చేర్చుకున్న బీజేపీ.. మరికొందరికి స్వాగతం పలికే పనిలో ఉంది. మరోవైపు సభ్యత్వ నమోదుతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.ఏపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హాజరయ్యారు.కోట్ల సంఖ్యలో ఉన్న కార్యకర్తలే బీజేపీకి అసలైన బలమని ఆయన అన్నారు.. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ అడ్రెస్‌ గల్లంతు ఖాయమని విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మిగిలేవి బీజేపీ,వైసీపీలేనని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.
*ఏపీ విత్తనాలు తెలంగాణకు ఎలా వెళ్లాయి?: లోకేష్‌
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. విత్తనాల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారని.. అయితే ఏపీ విత్తనాలు తెలంగాణకు ఎలా వెళ్లాయి? అని లోకేష్‌ నిలదీశారు. అన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వమే కారణమంటారా? అని ప్రశ్నించారు.ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతుల రుణాలు మాఫీ చేశామని, ఐదేళ్లలో సున్నా వడ్డీ రుణాలకు రూ.934కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిందన్నారు. అసెంబ్లీలో చాలెంజ్‌ చేసిన సీఎం జగన్‌.. సున్నా వడ్డీ రుణాలకు బడ్జెట్‌లో రూ.100కోట్లే కేటాయించారని లోకేష్ ఎద్దేవా చేశారు.
*టీడీపీ పతనానికి దగ్గరగా ఉంది: జీవీఎల్‌
తెలుగుదేశం పార్టీ పతనానికి దగ్గరగా ఉందని బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీలోని ఒకస్థాయి నేతలంతా తమ భవిష్యత్‌పై ఆందోళనగా ఉన్నారని, చంద్రబాబు నడిపిన కుటుంబ, బానిస రాజకీయాలను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వివాదం టీడీపీలో అంతర్యుద్ధంగా మారిందని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.
*ఆ ఘనత చంద్రబాబుదే: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
బడ్జెట్‌లో విద్యాశాఖకు గతం కంటే తక్కువ నిధులు కేటాయించారని, నిధులు తగ్గించి ఏవిధంగా స్కూళ్లలో మౌలికవసతులు కల్పిస్తారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కృషి వల్లే రాష్ట్రానికి కంపెనీలు వచ్చాయని, గుజరాత్‌కు వెళ్లాల్సిన కియా కంపెనీ ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. వైసీపీ కొత్త ప్రభుత్వం వచ్చాక విత్తన కంపెనీలు మూతబడ్డాయని గోరంట్ల ఆరోపించారు. 45 సాగునీటి ప్రాజెక్టులకు రూ.13 వేల కోట్లు ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లను క్రమబద్దీకరణ చేస్తామన్నారని, ఇప్పుడు సీఎం క్యాంప్‌ ఆఫీసుకు కిలోమీటరు దూరంలోనే ఆపేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.
* కుమారస్వామిపై భాజపా అవిశ్వాస తీర్మానం
కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశాలు పూర్తిగా ఆవిరైపోతున్నట్లు కన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాలతో శాసనసభలో సంకీర్ణానికి సంఖ్యాబలం తగ్గిందని ఆరోపిస్తున్న భారతీయ జనతా పార్టీ.. నేడు ముఖ్యమంత్రి కుమారస్వామిపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నోటీసును స్పీకర్‌కు సమర్పించింది.
తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బలపరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని గతవారం కుమారస్వామి శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. విశ్వాస పరీక్ష నేపథ్యంలో అటు సంకీర్ణ కూటమి, ఇటు భాజపా తమ తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించింది. సోమవారం ఉదయం ఆయా పార్టీల ఎమ్మెల్యేలు నేరుగా రిసార్టుల నుంచే శాసనసభకు చేరుకున్నారు. అనంతరం యడ్యూరప్ప నేతృత్వంలో భాజపా ఎమ్మెల్యేలు స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ను కలిసి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు సమర్పించారు.
* పోలవరం ప్రాజెక్ట్‌ వైఎస్సార్‌ కల : తెల్లం బాలరాజు
పోలవరం ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంజీవిని అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వ మీద పట్టిసీమ కట్టి రూ.350కోట్లు దోచేశారని ఆరోపించారు. లక్షా 6వేల కుటుంబాలను ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద తరలించాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్‌ కాల్వలు తవ్వకపోతే భూసేకరణకు వేలకోట్ల రూపాయల అదనపు భారం పడేదన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. పోలవరం దగ్గర ఫొటోలు తీసుకోవటం తప్ప! గత ప్రభుత్వానికి ప్రాజెక్ట్‌ పూర్తి చేద్దామన్న ధ్యాసే లేదని ఎద్దేవా చేశారు. ముంపునకు గురయ్యే లక్షలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్ట్‌ వ్యయం అంచనా పెంచుకుంటూ పోవడమే తప్ప.. టీడీపీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు.
* ప్రజాధనం దుర్వినియోగం: బుగ్గన
గత ప్రభుత్వ హయాంలో రూ.38వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో చంద్రబాబు, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనపై ప్రశ్నోత్తరాల సమయంలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. విదేశీ పర్యటనలతో ఎంత లాభం వచ్చింది? అని ప్రశ్నించారు. చంద్రబాబు తిరిగినట్లు ఇతర రాష్ట్రాల సీఎంలు తిరగలేదన్నారు. అలాంటి రాష్ట్రాలకు కూడా పెట్టుబడులు వచ్చాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సీఎంలు విదేశీ పర్యటనలకు వెళ్లారని మనం విన్నామా? అని ప్రశ్నించారు. ఐటీ కోసం తిరిగామని తమిళనాడు ప్రభుత్వం ఏనాడూ చెప్పలేదే?నన్నారు. కంప్యూటర్‌ కూడా వాళ్లే కనిపెట్టినట్లు టీడీపీ ప్రభుత్వం చెబుతోందని, చంద్రబాబు వెళ్లడం వల్లే పరిశ్రమలు వచ్చాయని గొప్పగా చెబుతున్నారని విమర్శించారు. పరి శ్రమ పెట్టాలని గతంలో వైఎస్‌ కోరారని కియా మోటార్స్‌ ప్రతినిధులే చెబుతున్నారన్నారు. ఆరోజు వైఎస్‌ఆర్‌ చేసిన విజ్ఞప్తి మేరకే కియా మోటార్స్‌ పెట్టామని చెప్పారన్నారు.
* పెట్టుబడులను తీసుకొచ్చేందుకే విదేశాలకు వెళ్లా: చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకే విదేశాలకు వెళ్లానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి ఉపాధి కల్పించాలని పని చేశామన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమ స్థానానికి వచ్చామన్నారు. కియా మోటార్‌ను తీసుకొచ్చామన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించేందుకే రేయింబవళ్లు తిరిగానన్నారు. బురదజల్లే ప్రయత్నం చేయడం మంచిది కాదన్నారు. నన్ను విమర్శించే ముందు మీ సంగతి చూసుకోండన్నారు. ఏ విచారణకైనా తాను రెడీనని చంద్రబాబు పేర్కొన్నారు.
*ఏపీకి ప్రత్యేక హోదా అసాధ్యం-రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి
ప్రస్తుత పరిస్థితుల్లో జగన్, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేరని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ప్యాకేజీ సాధించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భాజపాలో చేరాక తొలిసారి ఆదివారం విజయవాడ వచ్చిన ఆయనకు భాజపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని ఒక కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో, సాయంత్రం విలేకరులతో సుజనా మాట్లాడారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ధర్మ పోరాట దీక్షల పేరుతో అధర్మ పోరాటాలు చేశారని విమర్శించారు. దేశవాప్తంగా పరిమిత స్థానాల్లో భాజపా విజయం సాధించి ఉంటే హోదా డిమాండు చేసే వాళ్లమని జగన్మోహన్రెడ్డి అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
*పీఏసీ సభ్యుడిగా సీఎం రమేశ్
పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుడిగా భాజపా నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఎన్నికయ్యారు. పీఏసీ సభ్యులుగా సీఎం రమేశ్ సహా ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఎన్నికైనట్లు రాజ్యసభ సచివాలయం ప్రకటన విడుదల చేసింది. భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షాకు అత్యంత విశ్వాసపాత్రులు భూపేంద్ర యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్లు పీఏసీ సభ్యులుగా ఎన్నికకాగా తాజాగా సీఎం రమేశ్ కూడా ఆ జాబితాలో చేరారు. 2020 ఏప్రిల్ 30 వరకు వీరు సభ్యులుగా కొనసాగనున్నారు.
*తెలంగాణలో సభ్యత్వాలు 36 లక్షలకు చేరాలి-నమోదుపై శివరాజ్సింగ్ చౌహాన్ సమీక్ష
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో సభ్యత్వ నమోదు కీలకమని భాజపా సభ్యత్వ నమోదు జాతీయ ఇన్ఛార్జి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి అన్ని వర్గాల ప్రజల్ని పార్టీ సభ్యులుగా చేర్పించాలని సూచించారు. రాష్ట్రంలో భాజపా సభ్యత్వ నమోదు ప్రక్రియపై శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ నేతలతో ఆదివారం ఆయన రెండు గంటలపాటు సమీక్షించారు.
*భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంతోష్-కర్ణాటక నేతకు పదోన్నతి
భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి (సంస్థాగతం)గా కర్ణాటకకు చెందిన బీఎల్ సంతోష్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సంయుక్త ప్రధానకార్యదర్శి (సంస్థాగతం)గా ఉన్న ఆయనకు పదోన్నతి కల్పిస్తూ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకున్నారు. 13 ఏళ్లుగా ప్రధానకార్యదర్శిగా ఉన్న రాంలాల్.. తిరిగి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కు వెళ్లడంతో ఆ పదవిలో సంతోష్ను నియమించారు. రాంలాల్ను అఖిల భారతీయ సహసంపర్క్ ప్రముఖ్.. అంటే ఆర్ఎస్ఎస్ ప్రజాసంబంధాల కో కన్వీనర్గా నియమించారు. ఇంజినీర్ అయిన సంతోష్ 1993 జూన్లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా చేరారు.
*మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా-జూన్ 10నే రాహుల్గాంధీకి లేఖ
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు నవ్జోత్ సింగ్ సిద్ధూ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. జూన్ పదోతేదీనే రాహుల్గాంధీకి తన రాజీనామా పంపానంటూ ఆ లేఖను ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘పంజాబ్ మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తున్నాను’’ అని ఆ లేఖలో ఉంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. సిద్ధూ చేతిలో ఉన్న స్థానిక పరిపాలన, పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖలు తీసేసి.. విద్యుత్, పునరుత్పాదక ఇంధనవనరుల శాఖలు కేటాయించారు.
*బీసీ బిల్లు పెట్టకపోతే మిలిటెంట్ పోరాటాలు: ఆర్.కృష్ణయ్య
చట్టసభల్లో బీసీ బిల్లు పెట్టకపోతే మిలిటెంట్ పోరాటం తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. రాష్ట్ర వీరశైవ లింగాయత్-లింగబలిజ సంఘం (యువజన విభాగం) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో మహాసభ, ఆ సామాజిక వర్గంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.
*చర్యలు అందరిపై ఒకేలా ఉండాలి: వీహెచ్
కాంగ్రెస్లో అందరూ క్రమశిక్షణ తప్పితే పార్టీ పరిస్థితి ఏంటని సీనియర్ నేత వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు అందరి మీద ఒకేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారమిక్కడ వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే రోషన్బేగ్ మీద చర్యలు తీసుకొన్న అధిష్ఠానం తెలంగాణలో ఎమ్మెల్యేపై మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. బడుగు, బలహీనవర్గాల మీదే చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని చెప్పినా సదరు ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు లేవో అర్థం కావడం లేదన్నారు. అధిష్ఠానం ద్వంద్వ వైఖరి వీడాలని వీహెచ్ కోరారు.
*సభ్యత్వం జోరుగా సాగాలి-నేతలతో తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్
తెరాస సభ్యత్వ నమోదు జోరుగా సాగాలని, ఈ నెల 20వ తేదీ తుది గడువు వరకు పెద్దఎత్తున పార్టీలో ప్రజలను చేర్పించాలని.. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఆదివారం కేసీఆర్ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడి సభ్యత్వ నమోదు గురించి ఆరా తీశారు. గత నెల 27 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు సాగుతోంది. సభ్యత్వ నమోదు తీరును సీఎం కేసీఆర్ గత రెండు రోజులుగా స్వయంగా ఆరా తీస్తున్నారు.
*సీఎం తీరుతో ప్రజాస్వామ్యానికి చేటు
శాసనసభలో ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి చేటని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొన్నారు. నరసరావుపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పేదలను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి వంటివి బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు.
*పీఏసీ సభ్యుడిగా సీఎం రమేశ్
పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుడిగా భాజపా నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఎన్నికయ్యారు. పీఏసీ సభ్యులుగా సీఎం రమేశ్ సహా ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఎన్నికైనట్లు రాజ్యసభ సచివాలయం ప్రకటన విడుదల చేసింది. 2020 ఏప్రిల్ 30 వరకు వీరు సభ్యులుగా కొనసాగనున్నారు.
*ప్రత్యేక హోదా అసాధ్యం
ప్రస్తుత పరిస్థితుల్లో జగన్, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేరని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ప్యాకేజీ సాధించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భాజపాలో చేరాక తొలిసారి ఆదివారం విజయవాడ వచ్చిన ఆయనకు భాజపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని ఒక కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో, సాయంత్రం విలేకరులతో సుజనా మాట్లాడారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ధర్మ పోరాట దీక్షల పేరుతో అధర్మ పోరాటాలు చేశారని విమర్శించారు. దేశవాప్తంగా పరిమిత స్థానాల్లో భాజపా విజయం సాధించి ఉంటే హోదా డిమాండు చేసే వాళ్లమని జగన్మోహన్రెడ్డి అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.