DailyDose

ముంబైలో కుప్పకూలిన భవనం-నేరవార్తలు–07/16

12 people die in building mishap in mumbai-daily crime news-july162019

* ముంబైలోని డోంగ్రీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. శిథిలాల కింద 40 నుంచి 50 మంది వరకూ చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ముగ్గురిని రక్షించిన రెస్క్యూ టీం వారిని ఆసుపత్రికి తరలించింది. ప్రతి సంవత్సరం మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అధారిటీ ప్రకటించే ప్రమాదకర భవనాల జాబితాలో ఈ భవనం ఒకటని తెలిసింది. ఉదయం 11 గంటలకు ఘటన జరిగినట్లు తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం అక్కడికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించింది.
*యూకే రాయల్ ఫారెస్ట్ హోటల్లో ఇంజినీర్గా ఉద్యోగం వచ్చిందంటూ నమ్మించి, ఓ యువకుడికి సైబర్నేరగాళ్లు రూ. 4.08 లక్షలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళ్లితే… ఖైరతాబాద్కు చెందిన యువకుడు నిమ్స్ దవాఖానలో డయాలసిస్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. శిక్షణ సమయంలో డయాలసిస్ టెక్నీషియన్ ఉద్యోగం కోసం గ్లోబల్ మెడికల్ రిక్రూట్మెంట్లో తన బయోడేటాను అప్లోడ్ చేశాడు. యూకే నుంచి అని యువకుడికి ఈమెయిల్ వచ్చింది. రాయల్ ఫారెస్ట్ హోటల్లో ఉద్యోగం ఉందంటూ అందులో పేర్కొన్నారు.
*ఒక మగ ఏనుగు జరిపిన లైంగిక దాడిలో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. తొలుత అనారోగ్యం కారణంగా మృతి చెందిందని భావించిన అటవీశాఖాధికారులు పోస్టుమార్టం అనంతరం ఈ విషయాన్ని నిర్ధరించారు.
*ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ముఖం చాటేశాడని.. అత్తింటి వారు ఆదరించడం లేదని ఆరోపిస్తూ విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువతి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
*తమిళనాడులో ముగ్గురు ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు పరిధి ఉగ్గడంలోని జీఎంనగర్కు చెందిన ఆటో ఫైజల్ అలియాస్ ఫైజల్ రహ్మాన్ (29), కరుంబుకడైకు చెందిన సద్దాం హుస్సేన్ (28), పీళమేడులోని కుట్టిపాళెయంకు చెందిన ముహమ్మద్ బుర్హాన్ (26) నివాసాల్లో సోమవారం తెల్లవారుజామున నగర పోలీసులు సోదాలు నిర్వహించారు.
*విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ మహిళ రూ.కోట్లు వసూలు చేసి మోసగించిందని పలువురు బాధితులు సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ విచారించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
*ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయకుణ్ని(పీఏ) అంటూ గుంటూరులోని మొబైల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ను నమ్మించి వసూళ్లకు దిగిన మాజీ క్రికెటర్ను అరండల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారిపేటకు చెందిన బుడుమూరు నాగరాజు మాజీ క్రికెటర్.
*వ్యవసాయ భూమికి సంబంధించిన సర్వే నిర్వహణలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఈ ఘటన జరిగింది.
*భారీ వర్షాల ధాటికి హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో నాలుగు అంతస్థుల భవనం కూలి మృతిచెందిన వారి సంఖ్య 14కు చేరింది.
*పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న నయీం తల్లి తాహెరాబేగంను అరెస్టుచేసి రిమాండుకు తరలించామని భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ సురేందర్ తెలిపారు. భూ కబ్జాలు, బెదిరింపులు, మోసాలతో పాటు పలు నేరాలకు పాల్పడ్డారంటూ ఆమెపై 12 కేసులు నమోదైనట్లు చెప్పారు.
*ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తెలంగాణ సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేస్తామని పేర్కొంది.
*ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖలో ఓఎస్డీగా పనిచేస్తున్న అబ్రహం లింకన్ను ఆ స్థానం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. రెండేళ్ల కాలపరిమితితో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆయన నియమితులయ్యారు. ఏసీబీ డీజీ వినతి మేరకు ఆయన్ని తొలగిస్తున్నట్లు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
*గోదావరి జలాలను కృష్ణా పరీవాహకానికి ఎత్తిపోసే ప్రతిపాదనల తయారీకి బుధవారం రెండోసారి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సాగునీటి పారుదల ఇంజినీర్లు సమావేశం కానున్నట్లు తెలిసింది.
*ఇంజినీరింగ్ బోధన రుసుములపై కళాశాలల యాజమాన్యాలతో సోమవారం విద్యాశాఖ మంత్రి సురేష్ జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రభుత్వం నుంచి విద్యార్థికి రూ.35వేల చొప్పున పూర్తిగా బోధన రుసుములు చెల్లిస్తామని, కొత్తగా రుసుముల నియంత్రణ కమిటీ వేసి, ఆ కమిటీ సిఫార్సుల మేరకు మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొంటోంది.
*కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులు సక్రమం కాదంటూ దాఖలైన పిటిషన్పై విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఈ నెల 29కి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిందంటూ హయాతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ రఘువేంద్ర ఎస్.రాథోడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.
*బాపట్ల వ్యవసాయ కళాశాల 75వసంతాల వేడుకలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైభవంగా నిర్వహించాలని పూర్వ విద్యార్థుల సంఘం డిమాండ్ చేసింది.1945 జులై 16న ప్రారంభమైన ఈ కళాశాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడ చదువుకున్న చాలామంది ఉన్నత స్థానాల్లో స్థిరపడి దేశ వ్యవసాయ రంగ ప్రగతిలో భాగస్వాములవుతున్నారని ఓ ప్రకటనలో తెలిపింది.
*ప్రాథమిక నిబంధనల ప్రకారం ఒనగూరే ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని రాష్ట్ర విశ్రాంత పోలీసు అధికారుల సంఘం నాయకులు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కిశోర్కుమార్ను సోమవారం సచివాలయంలో కలిసి విన్నవించారు. గతేడాది చేపట్టిన సీనియారిటీ రివిజన్లో నోషనల్గా వివిధ క్యాడర్లలో సీనియారిటీ పొందినవారికి లబ్ధి కల్పించాలని విశ్రాంత అధికారులు రవిచంద్ర, డీవీఎస్ఎస్ మూర్తి, మాణిక్యాలరావు, రాజు కోరారు.
* శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం యాభై ఏళ్ల సందర్భంగా ఈ నెల 18న ‘రాజ్య నిర్బంధం-త్యాగాల పరంపర’ అనే అంశంపై బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు అమరుల బంధుమిత్రుల సంఘం(ఏబీఎంఎస్) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
*లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి. కొత్తకోట మండలం పాలెం దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని అటుగా వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ట్రావెల్స్ బస్సు క్లీనర్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.