Movies

బాల్య వివాహం కాదుగా

Anushka Speaks On Her Wedding With Virat Kohli

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో వివాహం గురించి మరోసారి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ. 29 ఏళ్లకే అనుష్క.. విరాట్‌ను పెళ్లాడారు. అయితే ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో నటీమణులు త్వరగా పెళ్లిళ్లు చేసుకుంటున్న విషయం గురించి అనుష్క తన అభిప్రాయాలను వెల్లడించారు.‘మన చిత్ర పరిశ్రమ కంటే ప్రేక్షకులే ఎంతో పరిణతి చెందారు. తెరపై ఎలా నటిస్తున్నారన్న విషయాన్ని మాత్రమే వారు పట్టించుకుంటున్నారు తప్ప నటీమణుల వ్యక్తిగత జీవితాల గురించి అంతగా ఆలోచించడం లేదు. ఫలానా నటికి పెళ్లైందా? తల్లి కాబోతోందా? వంటి విషయాల్లో తక్కువ ఆసక్తి చూపుతున్నారనిపిస్తోంది. మనం కూడా పరిణతి చెందాలి. నేను 29 ఏళ్లకు పెళ్లి చేసుకున్నాను. ఓ నటి పెళ్లి చేసుకోవడానికి అది చిన్న వయసే. కానీ నేను విరాట్‌తో ప్రేమలో ఉన్నాను. అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నాను. పెళ్లనేది సహజ ప్రక్రియే. ఓ పురుషుడు పెళ్లి చేసుకున్నాక తన కెరీర్‌ ఏమైపోతుందోనని బాధపడడు. అలాంటప్పుడు ఓ మహిళ ఎందుకు బాధపడాలి’ అని వెల్లడించారు అనుష్క.గతేడాది ‘జీరో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క నెలలు గడుస్తున్నా తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి ఇంకా ప్రకటించలేదు. ‘జీరో’ సినిమా ఫ్లాపవడంతో ఆమె ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ వెబ్‌ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరించే పనిలో ఉన్నట్లు గతంలో అనుష్క వెల్లడించారు.