Movies

సమాజానికి ఉపయోగపడే మరో చిత్రంలో

Jyothika To Star In Another Message Oriented Social Movie

సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్న 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో సందేశాత్మక చిత్రాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తన సతీమణి జ్యోతిక ప్రధాన పాత్రలో మరో సినిమాను నిర్మిస్తున్నారు సూర్య. ఆ సినిమాకు ‘పొన్‌మగల్‌ వందాల్‌’ అని పేరు పెట్టారు. ఇందులో సీనియర్‌ దర్శక నటులు భాగ్యరాజ్, పాండియరాజన్, పార్తిబన్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తుండటం విశేషం. ప్రతాప్‌ పోతన్‌ కీలకపాత్రలో కనిపిస్తారు. జేజే ప్రట్రిక్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ‘రాక్షసి’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతిక ఇందులోనూ ఓ సందేశాత్మక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. రామ్‌జీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గోవింద్‌ వసంత సంగీతం సమకూర్చుతున్నారు. చెన్నై వలసరవాక్కంలోని అగరం ఫౌండేషన్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఇందులో సీనియర్‌ నటులు శివకుమార్, నిర్మాత, నటుడు సూర్య, కార్తి, జ్యోతిక, భాగ్యరాజ్, పార్తిబన్, పాండియరాజన్, దర్శకుడు హరి, ముత్తయ్య, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో రాజశేఖర్, నిర్మాతలు ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.