Politics

మాకొచ్చిన ముప్పేమి లేదు

Kumaraswamy confident about his government

ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని కర్నాటక సీఎం హెచ్ డి కుమార స్వామి సోమవారం చెప్పారు. ఎమ్మెల్యేల రాజీనామా లెటర్లు, బీజేపీ ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. సోమవారమే బలపరీక్ష జరుగుతుందని ప్రచారం జరిగినా.. గురువారం నిర్వహించనున్నట్లు స్పీకర్​ప్రకటించారు. రెండు వారాల్లో 18 మంది కాంగ్రెస్, జేడీఎస్​ఎమ్మెల్యేలు స్పీకర్​కు రాజీనామా లెటర్లు సమర్పించడంతో కుమార స్వామి సర్కారు మైనారిటీలో పడిపోయింది. కుమార స్వామి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్​చేసింది. ఈ ఆరోపణలను స్వామి కొట్టిపారేశారు. ఈ నెల 18(గురువారం) రోజు బలపరీక్షకు సిద్దమన్నారు. అందులో నెగ్గుతామని స్వామితో పాటు సిద్ధరామయ్య కూడా ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం మొదలైంది. రెబెల్​ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ ప్రముఖ హోటల్​లో ఉండగా.. బీజేపీ, జేడీఎస్​పార్టీలు తమ ఎమ్మెల్యేలను వివిధ రిసార్టులకు తరలించాయి. ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. మరోవైపు బీజేపీ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు నోటీసులిచ్చింది. మరోవైపు తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌‌ను ఆదేశించాలంటూ ఐదుగురు కర్నాటక రెబెల్‌‌ ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్‌‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.