Videos

మరో సీన్ లీక్ అయింది

Radhika Apte's The Wedding Guest Hot Scenes Leaked

రాధికా ఆప్టే.. బాలీవుడ్ హీరోయినే కాదు తెలుగులోనూ రక్తచరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈమె ఎక్కువగా బాలీవుడ్, వెబ్సిరీస్లపైనే ఫోకస్ పెడుతున్నారు. ఈమె దేవ్ పటేల్తో కలిసి `ది వెడ్డింగ్ గెస్ట్` అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది. ఈ సినిమాను ఫిలిం ఫెస్టివల్స్లో కూడా ప్రదర్శిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సీన్కు ఒకటి లీకైంది. ఇప్పుడు ఆ సీన్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ చర్యపై రాధికా ఆప్టే తన కోపాన్ని వ్యక్తం చేశారు. సినిమాలో ఎన్నో మంచి సన్నివేశాలుండగా రొమాంటిక్ సీన్ లీక్ అవడం చూస్తుంటే మన సోసైటీలోని సైకోటిక్ మెంటాలిటీని అర్థం చేసుకోవచ్చు. అది కూడా నా పేరుపై స్ప్రెడ్ ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదన్నారు రాధికా అప్టే. బోల్డ్ సీన్స్లో నటించడానికి భయమెందుకు? నటిగా నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి? అని చెప్పింది రాధికా ఆప్టే.