DailyDose

అమెరికాలో హిందూ పూజారిపై దాడి-నేరవార్తలు–07/22

Hindu Priest Attacked In USA - Today Telugu Crime News-July 22 2019

*అమెరికాలోని గ్లెన్ ఓక్స్ ప్రాంతంలోని శివ శక్తి పీఠం పూజారి హరీశ్ చందర్ పూరీపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. పీఠం సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న హరీష్ చందర్పై వెనుకనుంచి వచ్చిన అతను విచక్షారహితంగా కొట్టాడు. దీంతో ఆ స్వామీజీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అక్కడి హిందూ వర్గాలు వెల్లడించాయి. దీనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు దాడికి పాల్పడ్డ సెర్జియా గువెయ(52) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇది విద్వేషపూర్వకంగా చేసిన దాడి అని హరీశ్ చందర్ శిష్యులు అనుమానం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ సమయంలో నిందితుడు ‘ఇది తమ ప్రాంతం’ అంటూ నినాదాలు చేసినట్టు సమాచారం. దాడిలో తాను తీవ్రంగా గాయపడ్డానని.. ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నానని హరీశ్ చందర్ తెలిపారు. అయితే ఇది విద్వేషపూరితంతో చేసిన నేరమా.. కాదా.. అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
* పార్వతీపురం ఓ ప్రవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని నందిని అనారోగ్యంతో క్లాస్ రూమ్ లోనే కుప్పకూలి మృతి.
*విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలను తొండంతో లాగిన మూడేళ్ల గున్న ఏనుగు విద్యుదాఘాతంతో మృతి చెందింది. చిత్తూరు జిల్లా పలమనేరు పురపాలక సంఘం పరిధిలోని గొబ్బిళ్లకోటూరు గ్రామ సమీపంలో అడవి నుంచి పొలాల్లోకి వచ్చిన ఎనిమిది ఏనుగులు ఆదివారం తెల్లవారుజామున తిరిగి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
* సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హిందీ సబ్జెక్టు మీద PHD చేస్తున్న దీపికా మహాపాత్ర..సోమవారం తెల్లవారుజామున బాత్రూంలో పడి చనిపోయింది.
* సౌదీలోని రియాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మంచిర్యాల జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. ద్విచక్రవాహనంపై పనులకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను జన్నారం మండలం రోటీగూడకు చెందిన ఉప్పు మల్లేశ్ (40), దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన నాంపల్లి రాజు (24)గా గుర్తించారు. వీరిద్దరూ మూడేళ్ల క్రితం సౌదీ వెళ్లారు. మల్లేష్కు భార్య భాగ్య, డిగ్రీ చదువుతున్న ఇద్దరు కుమారులు రాకేశ్, వినయ్ ఉన్నారు. రాజుకు తల్లిదండ్రులు సత్తయ్య, రాజవ్వ, తమ్ముడు వెంకటేశ్, చెల్లెలు మౌనిక ఉన్నారు. పొట్టకూటి కోసం వెళ్లి మృత్యువాత పడడంతో ఆ రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
* ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎంటీఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ కార్యాలయ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. 9 అంతస్తులున్న ఈ భవనంలో 3,4 అంతస్తుల్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. సుమారు 100 మందికి పైగా కార్యాలయ సిబ్బంది భవనం డాబాపై చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 14 అగ్నిమాపక వాహనాలు ప్రస్తుతం ఘటనా స్థలిలో మంటలార్పుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
* కన్నబిడ్డను కాపాడుకునేందుకు మాతృమూర్తి తన ప్రాణాన్నైనా ఫణంగా పెడుతుందని చెప్పే మరో ఘటన ఇది. ఏనుగు దాడి చేయనుందని గ్రహించిన ఆమె తన బిడ్డను పొదల్లోకి విసిరేసి, తాను గజరాజు దాడిలో బలయింది. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర జిల్లా మలైమహదేశ్వర కొండల్లోని దొడ్డాణె గ్రామంలో శనివారం సాయంత్రం విషాదం నింపింది.
*ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం మురికి కాలువలో విసిరివేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. ఒడిశాలోని అనుగుల్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
*ఉత్తరప్రదేశ్లోని పలుజిల్లాల్లో ఆదివారం సంభవించిన పిడుగుపాటుకు మొత్తం 32 మంది మరణించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేస్తూ…. మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
*క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో ఝార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో శనివారం అర్ధరాత్రి చేసిన మూకదాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
*జిరాక్స్ నోట్లతో బురిడీ-నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఘటన
నగదు మార్పిడి కేంద్రంలో జిరాక్స్ తీసిన నోట్లు ఇచ్చి చెల్లుబాటయ్యే కరెన్సీ తీసుకొని పరారైన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు, మీ-సేవ నిర్వాహకుడు చందు తెలిపిన ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై నవీపేటలోని ‘హనుమాన్ మీ-సేవ’ కేంద్రానికి(ఖాతాదారుల కేంద్రం) వచ్చారు. షకీల్ అనే వ్యక్తి కేంద్రంలోకి వెళ్లగా తోడుగా వచ్చిన వ్యక్తి బయటే వాహనంపై ఉన్నాడు. యూఏఈ దేశానికి చెందిన 4,800 దిర్హమ్స్(కరెన్సీ) అసలైనవి తీసుకొచ్చి డబ్బు మార్పిడి చేసి ఇవ్వాలని(స్వదేశీ కరెన్సీ) ఆపరేటర్ రేఖకు అందించాడు. వాటిని ఆమె తీసుకొని పరిశీలించి రూ.88,800 వస్తాయని చెప్పడంతో చాలా తక్కువ ఇస్తున్నారని ఆపరేటర్తో వాగ్వాదానికి దిగి ఇచ్చిన నోట్లు వాపసు తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి కనీసం రూ.89 వేలు ఇవ్వాలని కోరగా అందుకు ఆమె సమ్మతించారు. రెండోసారి వచ్చిన షకీల్ అసలైన దిర్హమ్స్ కరెన్సీకి బదులుగా వాటి నకలు నోట్లను ఓ పర్సులో పెట్టి ఇచ్చాడు. ఇది వరకు ఇచ్చిన సరైన దిర్హమ్స్నే సదరు వ్యక్తి మళ్లీ ఇచ్చాడని భావించిన ఆమె రూ.89 వేల నగదు ఇచ్చారు. అనంతరం నిందితుడు ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తితో కలిసి పరారయ్యాడు. అతడు ఇచ్చిన పర్సు నుంచి డబ్బులు తీసేందుకు ఆమె ప్రయత్నించగా జిప్ పనిచేయలేదు. కొద్దిసేపటి తర్వాత జిప్ తీసి చూడగా అందులో జిరాక్స్ నోట్లు కనిపించాయి. ఈఘటనకు సంబంధించి కేంద్రంలోని సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు చెప్పారు. నవీపేటలో డబ్బు మార్పిడి చేసిన ముఠా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.ఎక్కడికి వెళ్లినా ముఠా సభ్యులు 4,800దిర్హమ్స్ ఇచ్చి రూ.90 వేలు దేశీయ కరెన్సీ తీసుకొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
*మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజాపూర్-కుచ్చెర్కల్ రహదారిలో కారు ఢీకొని ముగ్గురు మృతిచెందారు.
* ప్రమాదవశాత్తు పేగులు బయటపడినా అలాగే 11 కిలోమీటర్లు నడిచివెళ్లి ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి సాహసగాథ ఇది. వరంగల్ అర్బన్ జిల్లా ఉప్పల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ సంఘటన వివరాలను కాజీపేట రైల్వే పోలీసులు వెల్లడించారు.
* హైదరాబాద్ నుండి గుంటూరు వైపు వెళ్తున్న కారు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం వద్ద బోల్తా పడింది.
కారు లో ఉన్న వాళ్లు అందరూ కూడా పెదనందిపాడు మండలం పాలపర్తి గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు.
అందులో 4గురు ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సతేనపల్లి ప్రభుత్వ వైద్యశాలకి తరలింపు.
* ఉత్తరప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడు పిడుగులు పడుతున్నాయి. పిడుగుపాటుకు 32 మంది మృతి చెందారు.
* కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ పరిధిలోని మొవ్వలో కౌలు రైతు ఆత్మహత్యఅప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగినా కొనకళ్ల విజయ్ కుమార్ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిమృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.గవర్నర్‌ విశ్వభూషణ్‌ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
* అర‌వింద్ న‌గ‌ర్ లోని నారాయ‌ణ కాలేజీలో గోడ కూలిన ఘ‌ట‌న‌లో ఆరుగురు విద్యార్ధులు గాయాల‌పాలైన విష‌యం తెలిసిందే.
* వినుకొండ పట్టణంలో కాశీరెడ్డి హాస్పిటల్ గొందిలో నిప్పుంటుకుని మహిళ కు ప్రమాదం వివరాలు తెలియాల్సివుంది …
* గుంటూరు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదంమాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో పప్పుల యాకోబు(27).మరియు మరో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ద్విచక్ర వాహనం వస్తుండగా అదుపు తప్పిగంగిరెడ్డిపాలెం రామాలయం సమీపంలో ఉన్న కరెంట్ స్తంభాని ఢీ కొనగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయిగాయాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ప్రేవేట్ ఆసుపత్రికి తరలించారుపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*తిరుపతి ప్రకాశం పార్కు సమీపంలో మున్సిపల్ స్మార్ట్వాటర్ మేనేజ్మెంట్ సిస్టం భవనంలో నూతనంగా నిర్మిస్తున్న పంప్హౌస్ శ్లాబ్ కూలి ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.
* అధిక వడ్డీల పేరిట ప్రజల నుంచి రూ.వేల కోట్ల డిపాజిట్లు స్వీకరించి వంచనకు పాల్పడిన ఐఎంఏ సంస్థ వ్యవస్థాపకుడు మహ్మద్ మన్సూర్ ఖాన్ను ఈడీ అధికారులు శనివారం మళ్లీ నిర్బంధంలోకి తీసుకున్నారు
*ఏకాంతం కోరి వచ్చిన ఓ జంటను ముగ్గురు యువకులు నిర్బంధించారు. వారిలో ఇద్దరు ఆ యువతిపై అత్యాచారం చేశారు. ప్రకాశం జిల్లా కారంచేడులో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.
*స్నేహితులందరూ కలిసి విహారయాత్రకు వెళ్లి రోజంతా ఉల్లాసంగా గడిపి తిరిగి వస్తుండగా వారిని మృత్యువు కబళించింది. మహారాష్ట్రలోని పుణె-శోలాపుర్ జాతీయ రహదారిలో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందారు.
*తమ సోదరి మృతికి కారణమన్న అనుమానంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది.
*నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం ఓ యువకుడు (28) దారుణహత్యకు గురైన ఘటన నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది.
* ప్రకాశం జిల్లా దర్శి మండలంలో వృద్ధ దంపతులు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
* సింహాచలం ఈరోజు ఉదయం 7 30 నిమిషాలకు సింహాచలం, సాయి నగర్ లో భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి కరెంటు పోల్ ను ఢీకొట్టింది.అదృష్టవశాత్తు స్కూల్ విద్యార్థులకు ఏమీ అవలేదు. కరెంట్ పోల్ విరిగి స్కూల్ బస్ పై కరెంటు తీగలు అల్లుకున్నాయి ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుస్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి మరియు ఆర్టీవో నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారుఫిట్నెస్ లేని బస్సులకు ఎలా అనుమతి ఇచ్చారు అంటూ ఆందోళనకు దిగారు.
* నెల్లూరు సంగం (మ) చెన్నవరపాడులో ఆశ వర్కర్ ఆత్మహత్యాయత్నంవైసిపి కార్యకర్తలు వేధిస్తున్నారంటూ నిద్ర మాత్రలు మింగిన వెంకట రమణమ్మ108లో ఆసుపత్రికి తరలింపు.
* అమెరికాకు చెందిన గూఢచారి సంస్థ సీఐఏ తరఫున పనిచేస్తోన్న 17 మంది సభ్యులను ఇరాన్ అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం అక్కడి మీడియా వెల్లడించింది. వారిలో కొందరికి ఉరిశిక్ష కూడా విధించినట్లు తెలిపింది. సీఐఏ తరఫును గూఢచర్యం చేస్తోన్న 17 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు ఇరాన్ ఇంటిలిజెన్స్‌ విభాగం వెల్లడించినట్లు ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అరెస్టు అయిన వారిలో కొందరికి ఉరిశిక్ష పడినట్లు ధికారులు తెలిపినట్లు వెల్లడించింది.మేలో ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలను తీవ్రతరం చేసిన దగ్గరి నుంచి పాశ్చాత్య దేశాలకు, ఇరాన్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ నుంచి అరెస్టుల ప్రకటన వెలువడింది. సముద్ర జలాల నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో గతవారం హార్ముజ్‌ జలసంధి వద్ద ఇరాన్‌ బ్రిటీష్ ట్యాంకర్‌ను ఇరాన్‌ అదుపులోకి తీసుకుంది. ఆ నౌకలో భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. జులై 4న జిబ్రాల్టర్‌ తీరం వద్ద బ్రిటన్‌కు చెందిన రాయల్ మెరైన్స్‌ ఇరాన్‌ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టింది. ‘మేము అదుపులోకి తీసుకున్న గూఢచారులు అత్యంత ప్రాధాన్య రంగాలైన ఆర్థిక, అణు, మౌలిక, మిలిటరీ, సైబర్ రంగాల్లో విధులు నిర్వర్తిస్తూ, ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు’ అని ఇరాన్‌ ప్రకటన విడుదల చేసినట్లు ఆ మీడియా సంస్థ వెల్లడించింది.