DailyDose

రోజా భర్తకు కీలక పదవి-తాజావార్తలు–07/22

Rojas Husband Gets New Post-Today Telugu Breaking News-July 22 2019

*ఎమ్మెల్యే రోజా భర్తకు కూడా ఓ పదవి లభించడం విశేషం. రోజా భర్తకు దక్కింది రాజకీయ పదవి కాదు.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినది. ఆర్కే సెల్వమణి తమిళనాడు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో సెల్వమణి భారీ మెజారిటీతో విజయం సాధించడం విశేషం.
*ఉత్తరప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడు పిడుగులు పడుతున్నాయి. పిడుగుపాటుకు 32 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాము కాటుకు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్‌, ఫతేపూర్‌లో ఏడుగురు చొప్పున, ఝాన్సీలో ఐదుగురు, జలౌన్‌లో నలుగురు, హమీర్‌పూర్‌లో ముగ్గురు, ఘాజిపూర్‌లో ఇద్దరు, జౌన్‌పూర్‌, ప్రతాప్‌ఘర్‌, కాన్పూర్‌ దేహత్‌, చిత్రకోట్‌లో ఒకరి చొప్పున మృతి చెందారు. మృతుల కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు.
* దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం నిగంబోధ్‌ ఘాట్‌లో జరిగాయి. సాధారణంగా ఆస్థాయి వ్యక్తులు మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు ఎంత ఘనంగా జరుగుతాయో మనకు తెలిసిందే. స్వతహాగా ప్రకృతి ప్రేమికురాలైన షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు మాత్రం అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా జరిగిపోయాయి. నిజానికి ఇది ఆమె కోరికట. దిల్లీలో కాలుష్యం ఏస్థాయిలో పెరిగిపోతుందో తెలిసిందే. దేశ రాజధానితో పాటు చుట్టు పక్కల గుడ్‌గావ్‌ వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే ప్రకృతిని కాపాడటంలో సాటి వారికి షీలా స్ఫూర్తిగా నిలిచారు. సీఎన్‌జీ(కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) పద్ధతిలో షీలా అంత్యక్రియలు జరిగాయి. ఇది కాలుష్య రహిత పద్ధతి. ఖర్చు కూడా ఎక్కువగా ఉండదు. ఇదే విధానంలో జరిగిన షీలా అంత్యక్రియల ఖర్చు అక్షరాల రూ.500. సాధారణంగా కట్టెలు ఉపయోగించి దహనం చేసినట్లయితే రూ.1,000 ఖర్చవుతుంది. అదికూడా మృతదేహం పూర్తిగా కాలడానికి 10-12 గంటల సమయం పడుతుంది. కానీ, సీఎన్జీ పద్ధతిలో అంతిమ సంస్కారాలు చేస్తే మృతదేహం గంటలో కాలిపోతుంది. అయితే షీలా అంత్యక్రియలు ఇలా చేయడాన్ని కొందరు వ్యతిరేకించారు. ఇది హిందూ సంప్రదాయం కాదని దిల్లీలోని కొందరు అర్చకులు అభ్యంతరం తెలిపారు.
* ఈడి ఎదుట హాజరైన గాలి జనార్దన్ రెడ్డి..
హైదరాబాదులోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరైన గాలి జనార్దన్ రెడ్డి..అక్రమ మైనింగ్ కేసులో మైనింగ్ కేసులో హాజరైన గాలి జనార్దన్ రెడ్డి….2007లో గాలి పైన సిబిఐ కసారి ఎదుట హాజరైన గాలి జనార్దన్ రెడ్డి లో గాలి జనార్దన్ రెడ్డి పైన కేసు నమోదు..అక్రమ మైనింగ్ కేసులో మొదటి సారి ఈ డి ఎదుట హాజరైన గాలి జనార్దన్ రెడ్డి
* దుబాయ్లో గుండెపోటుతో భారత సంతతి కమెడియన్ మృతిభారత సంతతికి చెందిన స్టాండప్‌‌ కమెడియన్‌‌ మంజునాథ్‌‌ నాయుడు(36) గుండెపోటుతో చనిపోయారు. దుబాయ్‌‌లోని ఓ హోటల్‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో జోక్స్ చెబుతూ, ఆడియన్స్ను నవ్విస్తూనే ఆయన కుప్పకూలిపోయారు. ఒత్తిడి గురించి చెబుతుండగా ఆయన స్టేజిపై పడిపోవడంతో అది కూడా షోలో భాగమేమోనని అంతా భావించారు. ఎంతసేపటికీ మంజునాథ్ లేవకపోవడంతో నిర్వాహకులు స్టేజిపైకి వెళ్లి చూడగా.. ఆయనలో చలనంలేదు. దీంతో మంజునాథ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనను పరీక్షించి, అప్పటికే చనిపోయాడని తేల్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వల్లే మంజునాథ్‌‌కు గుండెపోటు వచ్చి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌ గురించి చెప్తూ.. ఎలా ఎక్సైట్‌‌ అయ్యేవాడో వివరిస్తున్న టైంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని మంజునాత్కో ఆర్టిస్ట్చెప్పారు. అబుదాబిలో పుట్టిన మంజునాథ్‌‌ దుబాయ్‌‌లో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు గతంలోనే చనిపోగా.. మంజునాథ్ సోదరుడితో ఉంటున్నారు.
* ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆగ‌స్టులో భూటాన్‌కు వెళ్ల‌నున్నారు. పొరుగు దేశాల‌తో స్నేహ‌సంబంధాలు కొన‌సాగించాల‌న్న ఉద్దేశంతో మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న చేప‌ట్ట‌నున్నారు. రెండు రోజుల పాటు ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు. ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు మోదీ కొన్ని నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. ఇటీవ‌లే విదేశాంగ మంత్రి జైశంక‌ర్ భూటాన్‌కు వెళ్లారు. ఆ దేశ ప్ర‌ధాని లోటే త్స‌రింగ్‌ను ఆయ‌న క‌లిశారు.
* నెల్లూరులో నారాయణ జూనియర్‌ కాలేజీలో గోడకూలి విద్యార్థులకు గాయాలైన ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందించారు. ఈ ఘటనపై ఆయ‌న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే విచారణ జరపాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. నిబంధనల ప్రకారం వసతులు లేని కళాశాలల మూసివేతకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
* టీడీపీ ప్రభుత్వ హయాంలో 104, 18 సేవలు నిర్వీర్యమై పోయాయని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో 104, 108 సేవల పనితీరుపై చర్చ జరుగుతోంది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూౌ సరైన పర్యవేక్షణ, నిధులు లేకపోవడంతో టీడీపీ పాలనలో నిర్వీర్యమయ్యాయన్నారు. కన్ను, చెవికి సంబంధించిన సేవలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
* రామకృష్ణ బీచ్ గుడి వద్ద ఏర్పాటుచేసిన విశాఖ ఏషియన్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శన మరియు అమ్మకం ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, VMRDA అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు మరియు ఇతర అధికారులు.
* ఏపీకి నూతన గవర్నర్‌గా నియమితులయిన విశ్వభూషణ్‌ హరిచందర్‌తో వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.భువనేశ్వర్‌లో ఆయన నివాసానికి వెళ్ళి కలిశారు.శాలువాతో సత్కరించి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయిన సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రజల తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
* రాష్ట్ర ప్రభుత్వం సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది “స్పందన కార్యక్రమంతిరువూరు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో “స్పందన కార్యక్రమంలోపాల్గొన్న కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి లత,నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అసిస్టెంట్ కలెక్టర్ అనుపమ పాల్గొన్న జిల్లా స్థాయి అధికారులు.
* ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) ఫలితాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఫలితాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు నెలల తరబడి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. వారి అభ్యర్థన మేరకు సీఎం జగన్‌ నేడు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ కుమార్‌ విశ్వజిత్‌ తదితరులు పాల్గొన్నారు.
*తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికి మాతృవియోగం కలిగింది. అనారోగ్య కారణంగా ఆయన తల్లి తారకమ్మ(105) సోమవారం తెల్లవారుజామున వనపర్తిలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు నిరంజన్రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. పెద్ద దిక్కును కోల్పోయినందుకు కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.
*ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్ కోటాకు చెందిన ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మూడో విడత సీట్ల భర్తీ ప్రక్రియను ఈనెల 31 నుంచి నిర్వహిస్తారు.
* పురపాలక ఎన్నికల్లో బీసీలు, ముస్లింలకు యాభై శాతం టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
*ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అలోపతీ, ఆయుష్ సేవలు అందించే ఆరోగ్య కేంద్రాలు పాటించాల్సిన కనీస ప్రమాణాలను ప్రతిపాదించింది.
*ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వం మాత్రమే పనిచేస్తే సరిపోదని.. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం ఉంటేనే ‘ఆరోగ్య భారత్’ సాకారమవుతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
*ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. వేర్వేరు ఆరోగ్య పథకాల ద్వారా రాష్ట్రంలో దాదాపు కోటి కుటుంబాలకు ప్రభుత్వమే ఉచిత వైద్యసేవలందిస్తోందని వివరించారు.
*భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ గేట్లను ఆదివారం సాయంత్రం 4 గంటలకు మూసివేశారు. మూడు రోజులుగా గేట్లు తెరిచి నీటిని కిందకు వదిలారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పదివేల క్యూసెక్కులు దిగువకు వెళ్లింది.
*‘రైతునేస్తం’ 15వ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అగ్రి జర్నలిస్టులతో పాటు విస్తరణ అధికారులను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించారు.
*ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ప్రతిపాదనను భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము ఉపసంహరించుకున్నట్టు ప్రపంచబ్యాంకు ఆదివారం స్పష్టీకరించింది.
*తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వివేకానంద విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి 27 వరకు తిలక్రోడ్లోని కార్యాలయంలో మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరిపాలనాధికారి రఘురాంశర్మ తెలిపారు.
*రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
*ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ప్రతిపాదనను భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము ఉపసంహరించుకున్నట్టు ప్రపంచబ్యాంకు ఆదివారం స్పష్టీకరించింది.
*ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్కు పదోన్నతి కల్పించాలంటూ చేసిన సిఫార్సును పునఃపరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు కొలీజియంను కేంద్రప్రభుత్వం కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
*ఆంధ్రప్రదేశ్కు చెందిన పీసీ రాయులుకు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డు దక్కింది. ఆదివారమిక్కడ వెటరన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా రాయులు ఈ అవార్డు అందుకొన్నారు.
*తెలంగాణలో వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ప్రాజెక్టుల అవసరాలు తీరాకే గోదావరి జలాలను వేరే బేసిన్కు మళ్లించాలని.. ఉన్న నీళ్లు ఇక్కడి అవసరాలకే సరిపోతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ పేర్కొంది.
*గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 27న స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన్ ఉపకులపతి డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఆదివారం వెల్లడించారు.
*ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఏడీసీ (ఎయిడ్ డీ క్యాంప్)గా ఎస్వీ మాధవ్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన విజయవాడ అదనపు డీసీపీ (ట్రాఫిక్)గా వ్యవహరిస్తున్నారు.
*ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 24న విజయవాడ ఎంబీ భవన్లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు.
*ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉంటున్న గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలో భద్రతా చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు.
*ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 24న విజయవాడ ఎంబీ భవన్లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు.
*విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మెడికల్ కౌన్సెలింగ్లో బీసీ కేటగిరీ అభ్యర్థుల సీట్ల కేటాయింపులో ప్రతిష్టంభన తొలగలేదు. వైద్య విద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల సీట్లకు సంబంధించి 2001 నుంచి అమలుచేస్తున్న జీవోనంబరు 550పై సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో దాని ప్రకారమే ఈ ఏడాది ప్రవేశాలను కల్పించనున్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.