NRI-NRT

కాలిఫోర్నియాలో తెలుగు వ్యక్తి మృతి

Telugu Guy Dandupally Aasheesh Dies In South Lake Tahoe California - కాలిఫోర్నియాలో తెలుగు వ్యక్తి మృతి

ఆశీష్ దండుపల్లి(27) కాలిఫోర్నియాలోని సౌత్ లేక్ టహోఈలో జరిగిన నీటి ప్రమాదంలో మృతి చెందాడు. లెస్తర్ బీచ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన సమయంలొ అతను లైఫ్ వెస్ట్ ధరించలేదని అధికారులు పేర్కొన్నారు. అతని మృతదేహం మెక్‌ఫార్లేన్‌లోని మార్చురీలో ఉందని, పోస్టు మార్టం ఇతరత్రా కార్యక్రమాలు పూర్తి అయిన అనంతరం పార్ధివదేహాన్ని ఇండియా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. తానా తరఫున మృతదేహాన్ని ఇండియా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యదర్శి పొట్లూరి రవి తెలిపారు.
More Info: