DailyDose

నాలుగోసారి సీఎం కానున్న యెడ్యూరప్ప-రాజకీయ–07/24

Yadyurappa Becomes Chief Minister For Fourth Time-Telugu Politics Today-July 24 2019

* విశ్వాసపరీక్షలో ఓటమి తర్వాత తనకు సహకరించిన మీడియాకు థ్యాంక్స్ అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్లిపోయారు కుమారస్వామి. సభకు రాకుండా విప్ ను ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరతామన్నారు సిద్ధరామయ్య. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు.కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగోసారి పీఠమెక్కనున్నారు బొక్కనకెరె సిద్ధలింగప్ప యెడ్యూరప్ప. విశ్వాసపరీక్షలో కుమారస్వామి సర్కార్ ను కూల్చిన యెడ్డీ… రేపోమాపో సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు. అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాసపరీక్ష ఓటమితో విక్టరీ మూడ్ లో ఉన్న యెడ్డీ… తమది ప్రజస్వామిక విజయమన్నారు. కర్ణాటక అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందంటూ ప్రకటించారు. తమ ప్రభుత్వంలో రైతులకు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.2007లో మొదటిసారి కర్ణాటక సీఎం అయ్యారు యెడ్యూరప్ప. 2007 నవంబర్ 12 నుంచి అదే నెల 19వరకు సీఎంగా ఉన్నారు. మొత్తంగా మొదటిసారి 7 రోజులే సీఎం అయ్యారు యెడ్డీ. రెండోసారి 2008 మే 30 నుంచి 2011 జులై 31వరకు సీఎంగా ఉన్నారు. మళ్లీ 2018 మే 17 నుంచి మే 19వరకు రెండు రోజులు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో తగినంత మెజారిటీ లేకపోవడంతో బలపరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు యెడ్డీ. ఇప్పుడు నాలుగోసారి సీఎం పదవి చేపట్టబోతున్నారు.అసెంబ్లీ ముగిసిన తర్వాత బెంగళూరులో గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు కుమారస్వామి. రాజీనామా లెటర్ అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కుమారస్వామిని కోరారు గవర్నర్. యెడ్యూరప్ప సీఎం పదవి చేపట్టవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు కుమారస్వామి.ముంబయిలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఇంకా స్పీకర్ ఆమోదించలేదు. దీంతో వారి రాజీనామాల ఆమోదం తర్వాతే… బీజేపీలో చేరాలా..? వద్దా..? అన్నది 16 మంది రెబెల్స్, ఇద్దరు స్వతంత్రులు నిర్ణయించుకుంటారని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ చెప్పారు. తమకు 105 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నందున… స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.ముంబయిలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఇంకా స్పీకర్ ఆమోదించలేదు. దీంతో వారి రాజీనామాల ఆమోదం తర్వాతే… బీజేపీలో చేరాలా..? వద్దా..? అన్నది 16 మంది రెబెల్స్, ఇద్దరు స్వతంత్రులు నిర్ణయించుకుంటారని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ చెప్పారు. తమకు 105 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నందున… స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.
* ట్రంప్ మద్యర్తిత్వం అవసరం లేదు – మోడీ r1
కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాలని మోదీ తనను కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై బుధవారం లోక్‌సభలో మళ్లీ దుమారం చెలరేగింది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలంటూ డిమాండ్‌ చేశాయి. కేంద్రం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కశ్మీర్‌ అంశంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, నరేంద్రమోదీ జపాన్‌లో సమావేశమయినపుడు కశ్మీర్‌ వివాదం గురించి ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. కశ్మీర్‌ అంశం భారత గౌరవానికి సంబంధించిందన్నారు. కశ్మీర్‌ వివాదంలో మధ్యవర్తిత్వం చేయమని ట్రంప్‌ను మోదీ కోరలేదని మంత్రి సమాధానమిచ్చారు.కశ్మీర్‌ వివాదంపై మధ్యవర్తిత్వం చేపట్టాలని నరేంద్ర మోదీ తనను కోరినట్టుగా డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం వ్యాఖ్యానించగా దీనిపై దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దేశ ఆత్మగౌరవాన్ని అమెరికా కాళ్లముందు ఉంచారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాగా మోదీ ట్రంప్‌తో చర్చించిన అంశాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశాయి. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాధానమిస్తూ.. మోదీ మధ్యవర్తిత్వం కోరలేదని వెల్లడించారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేయడం తగదని సూచించారు.
* బిల్లులో ఆ నియ‌మం ఉండాల్సిందే : అమిత్ షా
చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నియంత్ర‌ణ బిల్లుపై ఇవాళ లోక్‌స‌భ‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఓ వ్య‌క్తిని ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించే నియ‌మం బిల్లులో ఉండాల‌ని షా తెలిపారు. అలాంటి ప‌ద్ధ‌తి అమెరికాలో, పాకిస్థాన్‌లో, చైనాలో, ఇజ్రాయిల్‌లో, యురోప్ దేశాల్లో ఉన్న‌ట్లు మంత్రి చెప్పారు. క‌ఠిన‌త‌ర‌మైన చ‌ట్టాల‌ను ఎవ‌రు రూపొందించారు, వాటికి స‌వ‌ర‌ణ‌లు ఎవ‌రు చేశార‌న్న విష‌యం మీకు తెలియ‌దా అని షా స‌భ‌లో ప్ర‌స్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడే క‌ఠిన చట్టాలు వ‌చ్చాయ‌ని, మీరు అప్పుడు చేసింది క‌రెక్ట్‌, ఇప్పుడు నేను చేసేది కూడా స‌రైందే అని షా అన్నారు.
* లోక్ సభలో ట్రంప్ కంపం…. మోడీ వివరణకు కాంగ్రెస్ పట్టు
కశ్మీర్ అంశంలో ట్రంప్ వ్యాఖ్యలపై లోక్ సభలో రచ్చ కొనసాగుతోంది. ఇవాళ కూడా విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ ఎంపీలు. కశ్మీర్ అంశంపై ఏమి మాట్లాడకపోతే ప్రధాని ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని అధీర్ రంజన్ చౌదరి నిలదీశారు. ట్రంప్ అసత్యం చెప్పారని మోడీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కశ్మీర్ విషయంలో ప్రభుత్వం క్లారిటీగా ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. విదేశాంగ మంత్రి ప్రకటన చేసినా.. విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన కౌంటరిచ్చారు.
* అప్పుడే రాజ్ భవన్ కు వెళ్తాం : యెడ్యూరప్ప
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. కాసేపట్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. యెడ్యూరప్పను బీజేఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కర్ణాటక పార్టీ ఇంచార్జ్ మురళీధర్ రావు కూడా పాల్గొంటారు. తర్వాత పార్టీ ముఖ్య నేతలతో గవర్నర్ ను కలవనున్నారు యెడ్డీ. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యెడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. తర్వాత ఢిల్లీకి వెళ్తారాయన. ప్రధాని మోడీతో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షాను కలుస్తారు. యెడ్డీ ఢిల్లీ పర్యటన తర్వాతే ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు కానుంది.
* భాజపాలో చేరిన సినీనటి ప్రియా రామన్‌
సినీనటి ప్రియా రామన్‌ భాజపాలో చేరారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మడం వల్లే తాను భాజపాలో చేరినట్టు వెల్లడించారు. ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతోనే తాను కమలదళంలో చేరినట్టు తెలిపారు. మోదీ అంటే తనకెంతో అభిమానమన్నారు. సత్యమూర్తిని కూడా తానెంతో గౌరవిస్తానని చెప్పారు. ఇలాంటి వారి నాయకత్వంలో దేశం, రాష్ట్రం ముందుకెళ్తాయని తనకు అన్పించడంవల్లే భాజపాలో చేరినట్టు తెలిపారు. మోదీ సమర్థ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. గత కొన్నేళ్లుగా తనకు ప్రజల నుంచి అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవం అందాయని.. తానెక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ఎంతో ప్రేమ లభించిందన్నారు. వారికి సేవ చేసుకోవడం ద్వారానే వారిపై తనకున్న ప్రేమను వ్యక్తపరచగలనని నటి వ్యాఖ్యానించారు
* సీఎం కేసీఆర్‌పై భాజపా ఎంపీల ఫైర్‌
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా ఎంపీలు అర్వింద్‌, బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్పంచుల అరెస్టు వ్యవహారంపై దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. నిన్న జగిత్యాలలో 380 మందికి పైగా సర్పంచులను అరెస్టు చేశారని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అన్నారు. సర్పంచులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనన్నారు. సర్పంచ్‌, కార్యదర్శికి ఉన్న చెక్‌ పవర్‌ ఉపసర్పంచ్‌కి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అవగాహన లేకే సీఎం కేసీఆర్ అనవసర నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
* వైకాపా తప్పటడుగులు వేస్తోంది: రాంమాధవ్‌
రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా తప్పటడుగులు వేస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీ భాజపాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. గత ఐదేళ్లలో ఓ ప్రాంతీయ పార్టీ వలన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు చూశారని.. అందుకే మరో ప్రాంతీయ పార్టీకి అవకాశమిచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతోందనే భయం కలుగుతోందని ఆయన ఆరోపించారు. భాజపాలో సభ్యత్వం దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అని రాంమాధవ్‌ వ్యాఖ్యానించారు. 2024 నాటికి ఏపీలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని ఆయన జోస్యం చెప్పారు. గ్రామగ్రామాన భాజపాను పటిష్ఠం చేయాలని.. సభ్యత్వ నమోదును దీనికి సాధనంగా ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు సూచించారు.
* కర్ణాటకలో కొత్త శకం రాబోతోంది : యెడ్యూరప్ప…….
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడం కర్ణాటక ప్రజల విజయం అన్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యెడ్యూరప్ప. కుమారస్వామి ప్రభుత్వం పనితీరుపై కన్నడ ప్రజలు విసిగిపోయి ఉన్నారని చెప్పారు. కొత్తపాలన, అభివృద్ధి రాబోతోందని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నానని చెబుతున్నా అన్నారు. కర్ణాటక రైతులకు రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యత పెరుగుతుందని.. వారికి మంచిరోజులు రాబోతున్నాయని చెప్పారు యడ్యూరప్ప.
* ఏపీ పీఏసీ ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌
ఏపీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పయ్యావులను ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తెదేపా అధికారంలో ఉండగా ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
* సర్పంచ్ లను అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికం: జీవన్ రెడ్డి
జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన… సర్పంచ్ లకు మద్దతు పలికారు కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి. జగిత్యాలలో మంత్రి కొప్పుల ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ్ హరిత మిషన్ అవగాహన సదస్సును బహిష్కరించి ఆందోళనకు దిగిన సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. అక్కడకు చేరుకున్న జీవన్ రెడ్డి సర్పంచ్ లతో మాట్లాడారు . సర్పంచ్ లో న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం తీర్చాలన్నారు. వారి ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సర్పంచుల హక్కులకు కత్తెర వేయడం సరికాదన్నారు జీవన్ రెడ్డి.జిల్లా కలెక్టర్ శరత్.. స్వచ్ఛ్ హరిత మిషన్ అవగాహన సదస్సును అధికారుల కార్యక్రమంగా, ప్రజాప్రతినిధులను అగౌరవపరచే విధంగా మాట్లాడితే ధర్నా చేసినందుకు అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికమని అన్నారు. 73 వ సవరణ బిల్లును కలెక్టర్ లకు అధికారులు కట్టబెట్టడం హేయమైన చర్యగా వ్యకపరచారు. దొడ్డిదారిన అధికార దుర్వినియోగం చేసి, నిధులు కాజేసి, పరోక్ష అవినీతికి పాల్పడిన ఘనత జిల్లా కలెక్టర్ డా శరత్ కె దక్కిందని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.
* మాజీ సీఎం కుమార స్వామి వెటకారం
విశ్వాసపరీక్షలో ఓటమి తర్వాత తనకు సహకరించిన మీడియాకు థ్యాంక్స్ అంటూ వెటకారంగా మాట్లాడి వెళ్లిపోయారు మాజీ సీఎం కుమారస్వామి. సభకు రాకుండా విప్ ను ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరతామన్నారు సిద్ధరామయ్య. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాతరేసిందని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు. సభలోనూ బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
* రాజగోపాల్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. రాజగోపాల్‌ వ్యవహార శైలిపై సీరియస్‌గా ఉన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా అతన్ని సస్పెండ్‌ చేయాలని ఏఐసీసీ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ మోతీలాల్‌ ఓరా, డిసిప్లనరీ కమిటీకి సిఫార్సు చేసినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీ నేతలూ రాజ్‌గోపాల్‌పై ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం వెలువడొచ్చని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఖతమైందని, బీజేపీకే భవిష్యత్తు ఉందని ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజ్‌గోపాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తమ్‌ నయం కుంతియా వేస్ట్‌’ అన్నారు. గతంలోనూ కుంతియా వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని పలు మార్లు ఆరోపించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా కూడా
మాట్లాడారు.
* అబద్ధం వందసార్లు చెబితే నిజమైపోదు:జగన్‌
ఒకే అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోదని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తున్నామని చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష తెదేపా నాయకులు తమపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. అనవసర చర్చలతో సభాసమయాన్ని వృథా చేయవద్దని సూచించారు. సభ ప్రారంభమై దాదాపు గంటసేపైనా ఇప్పటి వరకు కేవలం 3 ప్రశ్నలకే సమాధానం చెప్పగలిగామని, మిగతా వాటికి కూడా బదులిచ్చేందుకు సభ్యులు సహకరించాలని కోరారు.
*భాజపా స్వార్థమే నెగ్గింది-ట్విటర్‌లో కాంగ్రెస్‌ నేతలు
కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం కుప్ప కూలడంపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, శశి థరూర్‌ ఈ అంశంపై ట్వీట్లు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే.. ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్రలు పన్నారని భాజపాపై మండిపడ్డారు. తాజా పరిస్థితిపై వారు ట్వీట్‌ చేశారు.
*అమిత్షాతో వివేక్ భేటీ
భాజాపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రితో మాజీ ఎంపీ వివేక్ మంగళవారం దిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు మన్నికగానే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మించాలని యోచిస్తోందని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాధనం ఆదా చేయాల్సిన అవసరంఉందని వివేక్ అన్నారు. సమయం ఇస్తే దీనిపై అఖిలపక్షంగా వచ్చి వివరిస్తామని అమిత్షాకు తెలిపారు.
*పింఛను పేరుతో వంచన
‘‘మాట మార్చం-మడమ తిప్పం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అర్హులందరికీ 45 ఏళ్లకే పింఛను ఇస్తామంటూ జగన్ ఎన్నికల ముందు రాష్ట్రమంతా ప్రచారం చేశారు. నిజమేననుకుని ప్రజలు ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 ఏళ్లు దాటిన మహిళల కుటుంబాలకు మొత్తంగా రూ.75 వేలు చొప్పున ఇస్తామని ఇప్పుడంటున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా 45 ఏళ్లకే నెలకు రూ.3 వేలు చొప్పున పింఛను ఇచ్చి ఉంటే.. ఐదేళ్లలో రూ.1.80 లక్షలయ్యేది. ఇప్పుడు రూ.75 వేలే ఇస్తామని చెప్పడం వల్ల ఒక్కో కుటుంబానికి రూ.1.05 లక్షల నష్టం జరుగుతుంది. అది మోసం’’ అని ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
*కొంప ముంచిన పొత్తు
లోక్సభ ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న సీట్ల సర్దుబాటు కాంగ్రెస్, జనతాదళ్ మధ్య విభేదాలకు మరింత ఊతమిచ్చింది. మండ్య లోక్సభ నియోజకవర్గంలో సుమలతా అంబరీష్కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి జనతాదళ్ అంగీకరించలేదు. ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్గౌడకు అక్కడినుంచి జనతాదళ్ టిక్కెట్టు కేటాయించారు.
*చేతిలో ఇక 4 రాష్ట్రాలే
కర్ణాటకలో ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో ఇక దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 4 మాత్రమే మిగిలాయి. ఒక కేంద్రపాలిత ప్రాంతం (పుదుచ్ఛేరి)లో ఆ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇంతవరకు దక్షిణాదిలో ఆ పార్టీ (జేడీఎస్తో సంకీర్ణం) అధికారంలో ఉన్న రాష్ట్రం ఒక్క కర్ణాటక మాత్రమే. తాజా పరిణామాలతో కాంగ్రెస్ ఎంతో కీలకమైన ఆ రాష్ట్రంలోనూ పట్టు కోల్పోయినట్లయింది. ఇక ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మాత్రమే. మరోవైపు భాజపాకు గట్టిపట్టున్న దక్షిణాది రాష్ట్రం కూడా కర్ణాటకే కాగా.. ఆ పార్టీ ఏకంగా దేశంలోని 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.
*ప్రధాని, హోంమంత్రితో విజయసాయిరెడ్డి భేటీ
ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షాలతో మంగళవారం వైకాపా నేత విజయసాయిరెడ్డి వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆయనతోపాటు సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కూడా పాల్గొనడంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ కేడర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్కు రావడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కేంద్రం నుంచి కొన్ని అడ్డంకులు ఉండడంతో విజయసాయిరెడ్డితో కలిసి ఆమె ప్రధాని, హోంమంత్రిలను కలిసినట్లు తెలుస్తోంది.
*ఐదు బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం
ఏపీ శాసనసభ మంగళవారం ఐదు బిల్లులకు ఆమోదం తెలిపింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చించిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. వెనుకబడిన తరగతుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయడంతో పాటు తమను బీసీల్లో చేర్చాలంటూ వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిశీలించేందుకు శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లును శాసనసభ ఆమోదించింది.
*బీసీలకు 50% టికెట్లు కేటాయించండి
మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను 62 నుంచి 50 శాతానికి తగ్గిస్తూ కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తెరాస పార్టీ పరంగా బీసీలకు 50 శాతం టికెట్లు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసినట్లు తెలిపారు. హైదరాబాద్లోని విద్యానగర్ బీసీ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.
*ప్రశ్నించే గొంతుకను అణచివేస్తున్నారు
కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు మావోయిస్టు పోరాటంపై గతంలో ఎన్నడూ లేని విధంగా బహుముఖ దాడి కొనసాగిస్తున్నాయని సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ అన్నారు. సమాధాన్ పేరుతో 2022 నాటికి దేశంలో విప్లవోద్యమాన్ని అంతమొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని పేర్కొన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం గోరక్షణ పేరుతో మూక దాడులకు పాల్పడుతోంది.
*బీసీలకు 50% టికెట్లు కేటాయించండి
మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను 62 నుంచి 50 శాతానికి తగ్గిస్తూ కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తెరాస పార్టీ పరంగా బీసీలకు 50 శాతం టికెట్లు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసినట్లు తెలిపారు. హైదరాబాద్లోని విద్యానగర్ బీసీ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.
*ఎస్సీ వర్గీకరణపై మాట తప్పిన జగన్
ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట తప్పారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. అసెంబ్లీలో ఇటీవల ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ సీఎం ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ.. మంగళవారం తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటున్న సీఎం.. వర్గీకరణ చేయాలంటూ గతంలో ప్రధానికి లేఖ ఎందుకు రాశారని ప్రశ్నించారు. ఇడుపులపాయ వేదికగా జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని తీర్మానం చేసిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. జగన్ రెండు నెలల పాలనలో మోసాలు, వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై చేసిన ప్రకటనను ఉపసంహరించుకుని.. వర్గీకరణకు ప్రయత్నం చేస్తానని సీఎం ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
* టీ కాంగ్రెస్ నేతల గెస్ట్ రోల్ అప్పియరెన్స్‌పై హైకమాండ్ సీరియస్!
కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనకూలంగా మలుచుకుని ఉద్యమాలు నిర్మించడంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారనే అసంతృప్తిలో ఉన్నారు హస్తిన నేతలు. ఖమ్మంలో రైతులకు బేడీలు, నేరెళ్ల దళితుల మీద దాడి వంటి అనేక తప్పిదాలు జరిగినా వాటిని ఎండగట్టి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో టీ కాంగ్రెస్ విఫలమవుతున్నారన్న అభిప్రాయంలో హై కమాండ్ ఉంది. రాష్ట్ర నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న అధిష్టానం పెద్దలు..కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటానికి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే భావనలో ఉన్నారు. దీనికి తోడు పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై మరింత ఆగ్రహంగా ఉన్నారు