DailyDose

ట్రక్కు బోల్తా..21మందికి గాయాలు-నేరవార్తలు–07/28

Truck Flips Killing 21 In India-Telugu Crime News Today-July 28 2019

* బిలాస్ పూర్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 40 మంది యాత్రికులు నైనా దేవి ఆలయంలో పూజలు చేసేందుకు ట్రక్కులో బయలు దేరగా..మార్గమధ్యలో మండ్యాలి గ్రామానికి సమీపంలోని రహదారిపై ట్రక్కు బో్ల్తా పడింది.
* వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం రాయినిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గరుడుబిల్లి వద్ద ఒడిశాకు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి శనివారం బొకారో ఎక్స్ప్రెస్ బోగీపైకి ఎక్కి హడావుడి సృష్టించాడు.
* అప్పుల బాధలకు తట్టుకోలేక శనివారం కర్నూలు జిల్లాలో ఇద్దరు రైతులు, గుంటూరు జిల్లాలో ఓ రైతు బలవంతంగా ఊపిరి తీసుకున్నారు.
*వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి(ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు) వ్యక్తిగత సహాయకుడి పేరును ఉపయోగించుకుని ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తామంటూ అక్రమాలకు పాల్పడిన నలుగురు విశాఖపట్నం యువకులు పండరి విష్ణుమూర్తి, గంధవరపు తరుణ్, ఎం.జగదీష్, పి.జయకృష్ణలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
* బాలుడు జషిత్ను అపహరించినవారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అపహరణకు గురైన నాలుగేళ్ల జషిత్ ఇటీవల విడుదల కావడంతో శనివారం ఉప ముఖ్యమంత్రి వారి ఇంటికి వెళ్లారు.
*జమ్మూకశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో జైష్ ఎ మహ్మద్ ముఠా సభ్యుడు మున్నా లాహోరీ కూడా ఉన్నాడు. గత నెలలో కశ్మీర్లో జరిగిన కారుబాంబు పేలుడుకు ఇతడే సూత్రధారి.
*అధిక వడ్డీల ఆశపెట్టి డిపాజిటర్ల నుంచి భారీ మొత్తాలు దండుకున్న కేసులో నిందితురాలైన నౌహీరా షేక్ను పోలీసులు శనివారం కర్ణాటకకు తరలించారు. ఆ రాష్ట్రంలోని శివమొగ్గ కోర్టులో ఆమెను హాజరుపరిచేందుకు చంచల్గూడ మహిళా జైలు నుంచి తీసుకెళ్లారు. తెలంగాణాలో పలు కేసుల కారణంగా ఆమె విచారణ ఖైదీగా ఉండటం విదితమే.
*ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగినంటూ అధికారులను బెదిరించి రూ.లక్షలు వసూలు చేసుకుంటున్న నేరస్థుడు రాయబండి సూర్యప్రకాష్ చారి అలియాస్ సూరిబాబును హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
*అంబర్పేటలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. తన వదినతో కలిసి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారం గొలుసును దుండగులు లాక్కెళ్లిన ఘటన శనివారం ఉదయం అంబర్పేటలో కలకలం రేపింది.
*ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బస్తర్ జిల్లా జగదల్పూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
*ఉగ్రమూకలపై ఉక్కుపాదం మోపిన భారత సైన్యం జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగిస్తోంది. శనివారం దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ టాప్ కమాండర్ మున్నా లాహోరిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. అతడితో పాటు మరో స్థానిక ఉగ్రవాది కూడా ఈ ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
* ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్ను కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.