DailyDose

ఎమ్మెల్యే ఉదయభాను కొడుకు అరెస్టు-నేరవార్తలు–07/30

MLA Udayabhanu Son Arrested-Telugu Crime News Today-July 30 2019 - ఎమ్మెల్యే ఉదయభాను కొడుకు అరెస్టు-నేరవార్తలు–07/30

* నా వాహనాన్నే ఆపుతావా ? నేనెవరో తెలుసా అంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను తిడుతూ దాడి చేశాడు ఓ ఎమ్మెల్యే కొడుకు మాదాపూర్‌‌ పోలీసుల కథనం ప్రకారం…సోమవారం సాయంత్రం మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్రెడ్డి ఖానామేట్ చౌరస్తాలో డ్యూటీ చేస్తున్నాడు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడం, వన్వే ఉండడం తో 6.30 గంటల సమయంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేట్ ఎమ్మెల్యే సామినేని ఉదయ్భాను కుమారుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ తన కారులో హైటెక్స్ నుండి కొండాపూర్ వైపు వెళ్తున్నాడు. కారు ఖానామేట్ వద్దకు చేరుకోగానే ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్రెడ్డి కారును నిలిపి వేసి వన్వే కాబట్టి వెళ్లవద్దని చెప్పారు. దీంతో ప్రసాద్ కారు దిగి తాను ఎవరో తెలుసా? ఎవరి కారును ఆపావో తెలుసా అంటూ ఇన్స్పెక్టర్ను దూషిస్తూ పైపైకి వచ్చాడు. దీంతో ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్రెడ్డి ‘మీరు ఎవరైనా రూల్స్‌‌ అందరికీ ఒకేటా ఉంటాయ్‌‌’ అని చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రసాద్ నాకే రూల్స్ చెప్తావా అంటూ ఇన్స్పెక్టర్ను బూటు కాలితో తన్నాడు. దీంతో రాజ్‌‌గోపాల్‌‌ రెడ్డి గాయపడ్డాడు. వెంటనే ఆయన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఏ. శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ఎమ్మెల్యే కుమారుడు వెంకటకృష్ణ ప్రసాద్‌‌ ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
*ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ని సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రన్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్ గ్రేడ్ లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
వాన్ పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డ పై రన్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితమే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుగా… ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెర్బియాకు ఆయన విహారయాత్రకు వెళ్లి అక్కడ పోలీసులకు చిక్కడం విశేషం.
*అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగల భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు రేణిగుంట టాస్క్ ఫోర్స్ పోలీసులు. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 94 ఎర్ర చందనం దుంగలను, వాటిని తరలిస్తున్న తొమ్మిది మంది స్మగ్లర్లను పోలీసులు ప్లాన్ వేసి పట్టుకున్నారు. వారి వద్దనుండి మూడు బైకులు, ఒక టాటా సుమో స్వాధీనం చేసుకున్నారు.
*ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం దేశ రాజధాని కాబూల్ లో జరిగిన ఆత్మహుతి దాడిలో దాదాపు 20 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఆప్ఘనిస్తాన్ ఉపాధ్యక్ష రేసులో ఉన్న అర్హులా సాలే కార్యాలయం సమీపంలో జరిగినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో రద్దీగా ఉండే సమయంలో దాడి జరగడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు.
*సైనిక శిక్షణ విమానం కూలి దాదాపు 17మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. రావల్పిండి సమీపంలోని గ్యారిసన్ సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుందతి. ఈ ఘటనలో పైలెట్లు సహా 17మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు జవాన్లు, 12మంది సాధారణ పౌరులు ఉన్నారు.
*కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయన అదృశ్యమైనట్లు అందరూ భావించారు. కానీ… ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. ఆత్మహత్యకు ముందు తన కేఫ్ కాఫీ డే బోర్డు మెంబర్స్ ని ఉద్దేశించి ఆయన ఓ లేఖ రాశారు.
*మహబూబాబాద్ ల్లాలోని మరిపెడ మండలం దర్వాతుతండాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త గొంతుకోసి హతమార్చాడు. వివాహిత కస్తూరి స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తుంది. కుటుంబ తగాదాల కారణంగా భర్త కత్తితో గొంతు కోశాడు. దీంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
* రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడిన ఘటన పెబ్బేరు సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
*మొగల్తూరు మండలంలోని పేరుపాలెంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది.
*రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 38 తులాల బంగారం, 71 తులాల వెండి, రూ. 43 వేలు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో 17 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
*రంజీ మాజీ ప్లేయర్ బుడమూరు నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. స్పాన్సర్ షిప్ తో వచ్చిన డబ్బుతో నాగరాజు జల్సాలు చేశాడని, ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సీఎం పర్సనల్ సెక్రటరీ కేఎన్ఆర్ నంటూ కార్పొరేట్ ఆస్పత్రి నుంచి డబ్బులు తీసుకుని బ్యాంకాక్ లో నాగరాజు జల్సాలు చేస్తున్నాడని, నాగరాజు అకౌంట్ లో రూ.3లక్షలు సీజ్ చేసి, ఆరు కేసులు నమోదు చేశారు
* 5 వ తరగతి చదువుతున్న బాలికపై హెడ్‌ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన మంగళవారం గుంటూరు జిల్లా రాయపూడిలో చోటు చేసుకుంది. గుంటూరు రాయపూడి ఎంపిపి స్కూల్‌లో 5 వ తరగతి చదువుతున్న బాలికపై హెడ్‌ మాస్టర్‌ సుబ్బారావు అత్యాచారానికి పాల్పడ్డాడు. హెడ్‌ మాస్టర్‌ సుబ్బారావు పరారీలో ఉన్నాడు. బాలిక తల్లిదండ్రులు స్కూల్‌ వద్ద ఆందోళన చేపట్టారు.
*ఘరానా మోసగాడు షేక్‌ సర్దార్‌ హుస్సేన్‌ ను సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరిడియం కాపర్ బిందెలతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి పదిహేనుంది నుండి రూ.30 లక్షలు వసూలు చేశాడు. అంతర్జాతీయ అణు శక్తి సంస్ధ, ఆర్కియాలజీ శాఖ అనుమలు ఉన్నట్లు లెటర్ హెడ్,రిజర్వ్ బ్యాంక్, ప్రధాని మోడీ నకిలీ లెటర్ హెడ్ లు సృష్టించిన నిందితుడు పలువురి మోసం చేసి బాధితుల నుండి పెద్ద ఎత్తునా నగదును దండుకున్నాడు. కాగా రిజర్వ్ బ్యాంక్ నుండి రూ.500 కోట్లు కంటైనర్ లో వస్తున్నాయని మరోసారి మోసం చేసి సర్పవరం పోలీసులకు చిక్కాడు.
*ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. పిచ్చికుక్క దాడిలో 20మందికి పైగా గాయాలయ్యాయి. ఈ దాడిలో గాయపడిన వారిని ఎర్రగొండపాలెం ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
* ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, హతమార్చిన దోషికి మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ పట్టణంలో వెలుగుచూసింది. పిపారియా గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలలిక ఇంటి బయట ఆడుకుంటుండగా గత ఏడాది అక్టోబరు 31వతేదీన దీపక్ అనే వ్యక్తి చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, హతమార్చాడు. ఈ కేసులో డీఎన్ఏ పరీక్ష జరపగా నిందితుడిని గుర్తించారు. ఈ కేసులో దోషి అయిన దీపక్ను ఐపీసీ సెక్షన్ 302, 376 ఏబీ సెక్షన్ల కింద మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి కేఎన్ సింగ్ తీర్పు వెలువరించారు.
* గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని హతమార్చిన ఘటన మంగళవారం నీలగిరి సంఘం, నెల్లూరు టౌన్‌ లో చోటు చేసుకుంది. నీలగిరి టౌన్‌, నెక్లెస్‌ రోడ్డు కింద, ఎస్‌బిహెచ్‌సి, చిన్నబజార్‌ వద్ద గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని హతమార్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు దాసరి శివ కుమారుడు రమణయ్య (31) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
* పాకిస్తాన్‌లో ఆర్మీ విమానం కూలిన ఘ‌ట‌న‌లో 15 మంది మృతిచెందారు. రావ‌ల్పిండి న‌గ‌రంలో ఉన్న ఓ రెసిడెన్షియ‌ల్ ప్రాంతంలో ఆ విమానం కూలింది. ఈ ప్ర‌మాదంలో అయిదు మంది సిబ్బంది, ప‌ది మంది సాధార‌ణ పౌరులు మృతి చెందారు. ఇదే ప్ర‌మాదంలో మ‌రో 12 మంది గాయ‌ప‌డ్డారు.
* నెక్లెస్ రోడ్డు సమీపంలో దారుణం జరిగింది.శివ అనే యువకుడు దారుణ హత్యకు గురైనాడు.బీర్ బాటిల్స్ తో దాడి చేసి హతమార్చిన తెలుస్తుంది.నీలగిరిసంగం వాసిగా గుర్తించారు.
* కృష్ణాజిల్లా గన్నవరం లో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియ విన్నర్ 32 సంవత్సరాలు ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
*విశాఖ ఏజెన్సీచింతపల్లి మండలం లో విషజ్వరాలతో ఇద్దరు మృతి.
* జయశంకర్‌భూపలపల్లి జిల్లాలోని మల్హర్ మండలం కొండపేట గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తోటలో కలుపు పనిచేస్తున్న ముగ్గురు రైతులపై అడవి పంది దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన రైతులను స్థానికులు మహాదేవ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. బాధితులను సంపత్, రాజు, లక్ష్మీభాయ్‌లుగా గుర్తించారు.
* శ్రీకాకుళం…జాతీయరహదారి పై లారీ బోల్తాసోంపేట మండలం బేసిరామచంద్రపురం జంక్షన్ వద్ద జాతీయరహదారి పై తెల్లవారు జామున లారీ బోల్తా పడింది.బెంగుళూరు నుండి కోల్కత్త కాయగూరలు లోడుతో వెళ్తున్నా లారీ.తెవారు జామున లారీ డ్రైవర్ నిద్ర మత్తులోకి జరుకోవడంవల్ల అదుపు తప్పి బోల్తా కొట్టింది.ఈ ప్రమాదం లో డ్రైవర్, క్లినర్ కు ఎటువంటి గాయాలు కాలేదు.
* సూర్యపేటజిల్లాలోని గరిడేపల్లి మండలం గడ్డిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
* ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన ఇద్దరు యువకులను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.
* పాకిస్థాన్‌లో ఓ సైనిక శిక్షణ విమానం కుప్పకూలింది. రావల్పిండి సమీపంలోని గ్యారిసన్‌ సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలట్లు సహా 17మంది మృతి చెంచారు. మృతుల్లో ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులు ఉన్నారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
* ఇరిడియం కాపర్‌ బిందెలతో రూ.కోట్లు సంపాదించవచ్చని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న పెదపూడికి చెందిన ఘరానా మోసగాడు షేక్‌ సర్దార్‌ హుస్సేన్‌ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
*గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది.
*టిక్టాక్ మోజు ఓ విద్యార్థిని అడవిపాలు చేసింది. శేషాచల అడవిలో టిక్టాక్ చేస్తూ దారితప్పి స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న యువకుడిని పోలీసులు రక్షించారు. సీఐ రామచంద్రారెడ్డి తెలిపిన సమాచారం మేరకు… చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కలకడ మండలానికి చెందిన మురళి చదువుతున్నాడు.
*సరకు రవాణా మాటున కార్గో విమానంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ 6ఈ-815 కార్గో విమానం ఆదివారం రాత్రి రాయ్పూర్ నుంచి శంషాబాద్ చేరుకుంది.
*వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు నిర్వహిస్తున్న సీపీఐ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఛత్తీస్గఢ్లోని సుకుమాజిల్లా కన్నెగూడ-బాలంగితోగ్ అటవీప్రాంతాలవైపు డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు) సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో కొంతమంది మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో కుంట ఏరియా కమిటీ ఎల్వోఎస్ కమాండర్ మంగుడు, మరో మహిళా మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందారు.
*విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను కాలితో తన్ని ఇష్టానుసారంగా దూషించాడో ఎమ్మెల్యే కుమారుడు. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం పొద్దుపోయాక ఘటన జరిగింది.
*విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను కాలితో తన్ని ఇష్టానుసారంగా దూషించాడో ఎమ్మెల్యే కుమారుడు. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం పొద్దుపోయాక ఘటన జరిగింది.
*హైదరాబాద్లో ఆటోమొబైల్ ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టించింది. అదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన బాధితుడి ఫిర్యాదుతో సోమవారం వెలుగులోకి వచ్చింది.
*ఉత్తర్ప్రదేశ్లో అత్యాచార బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును రాయ్బరేలీ వద్ద ట్రక్కు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
*హైదరాబాద్కు చెందిన రచయిత్రి, పాత్రికేయురాలు డాక్టర్ కొల్లూరి భాగ్యలక్ష్మి(70) సోమవారం రాత్రి చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్లో గుండెపోటుతో కన్నుమూశారు.
*పశ్చిమగోదావరి ఏలూరులో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఏలూరు శివారులోని ఆస్రం మెడికల్ కళాశాలలో సోమవారం సాయంత్రం జరిగింది.
*వారం రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని హయత్నగర్లో అపహరణకు గురైన యువతి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ ఆమెను ప్రకాశం జిల్లా అద్దంకిలో వదిలేసి వెళ్లిపోయాడు.
* భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లిలో యోహానశ్రావణి (దంపతులు నివాసముంటున్నారు. మద్యానికి బానిసైన యోహాన్ తరుచూ ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే నేడు శ్రావణికి కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
* సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ.. కేంద్ర మంత్రికి వైసీపీ ఎంపీల లేఖ
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. రస్‌ అల్‌ ఖైమా నూతన సీఈవో ఫిర్యాదుతో ఇంటర్‌పోల్‌ రంగంలోకి దిగింది. రెండ్రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ ఘటనకు ఆలస్యంగా వెలుగు చూసింది.సెర్బియాలో విహారయాత్రకు వెళ్లగా అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే నిమ్మగడ్డను భారత్‌కు తీసుకువచ్చేందుకు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. నిమ్మగడ్డను అరెస్ట్ చేయకుండా సురక్షితంగా ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ఎంపీలు కోరారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశమైంది. కాగా.. నిమ్మగడ్డకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే.