DailyDose

అమెరికా వెళ్లేందుకు జగన్‌కు కోర్టు అనుమతి-నేరవార్తలు–07/31

Court grants permission for jagan to go to the US-telugu crime news today-july 31 2019 - అమెరికా వెళ్లేందుకు జగన్‌కు కోర్టు అనుమతి-నేరవార్తలు–07/31

* అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమెరికా తో పాటు ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతి మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి 25 మధ్య జెరూసలెం, అమెరికా వెళ్లడానికి అనుమతించాలంటూ జగన్ చేసుకున్న దరఖాస్తును సీబీఐ కోర్టు అనుమతించింది. అయితే పర్యటనకు వెళ్లినపుడు ఫోన్, ఫ్యాక్స్నెంబర్లు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసుల్లో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికీ అనుమతి మంజూరు చేసింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 30లోగా 30 రోజులపాటు అమెరికా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో పర్యటించడానికి అనుమతిస్తూ రూ.2 లక్షల పూచీకత్తుతో బాండు సమర్పించాలని ఆదేశించింది.
* విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను కాలితో తన్ని ఇష్టానుసారంగా ప్రవర్తించారనే కేసులో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు సామినేని ప్రసాద్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మరోవైపు పోలీసులతో ప్రసాద్‌ దురుసు ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
*ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా చిన్న ఆవుటపల్లి సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మరియా విన్నర్ అనే కానిస్టేబుల్‌ భవనంపై నుంచి దూకారు.
* షాపింగ్‌ కోసం వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన కంకిపాడు మండలం&గ్రామంలో చోటుచేసుకుంది. అంకమ్మగుడి మార్కెట్‌లో షాపింగ్‌ కోసం గురువారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన కర్రె తేజ (17) కనిపించకుండా పోయింది. కూతురు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి నారాయణరావు కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*విజయవాడ నగరంలోని అయోధ్యనగర్‌ కరకట్ట వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపులేని వేగంతో దూసుకుపోతే రెండు ఆటోలను ఢీకొట్టింది. అంతేకాకుండా అక్కడే ఉన్న బాలుడిని సైతం కారు గుద్దేసింది. దీంతో 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు.
* గుంటూరు జనరల్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాబు మృతి…గుంటూరు ఆనందపేట కు చెందిన షేక్ రహిమా అనే మహిళకు ఈ నెల 26వ తేదీన డెలివరీ తేదీ ఇచ్చిన డాక్టర్లు…రోజు రోజుకు డెలివరీ తేదీ పొడిగింపు…ఈ రోజు ఉదయం 3గంటలకు డెలివరీ అయితే 6.30 కి అని చెప్పిన డాక్టర్లు….డాక్టర్లు సరిగ్గా పట్టించుకోకుండా వ్యవహరించారని బాధితుల ఆవేదన..
* నరసరావుపేట రెడ్డి కళాశాల వద్ద కాలువలో పసికందు మృతదేహం దర్యాప్తు చేస్తున్న 2 పట్టణ పోలీస్లు
* గుంటూరు జిల్లా నూజేండ్ల మండలం తంగిరాల గ్రామంలో తేల్లమేకల లక్ష్మమ్మ ను అనుమానం తో భర్త కత్తి తో పోడిచి చంపి పారారువిచాణ చేపట్టిన పోలీసులు
* కడపజిల్లా చాపాడు మండలం తిప్పిరెడ్డి పల్లి లో రోడ్డు వివాదంఇంటి మధ్యలో రహదారి వేస్తున్నారు అన్న కారణంగా మనస్తాపం చెంది తల్లికొడుకు రేణుక, శంకర్ లు ఆత్మహత్య యత్నంప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
* కృష్ణా జిల్లాజగ్గయ్యపేటపెనుగంచిప్రోలు. మున్నేరు అవతల గుర్తు తెలియని మృతదేహం లభ్యం పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది
* తూర్పుగోదావరి జిల్లాఅన్నాచెల్లెళ్ళ గట్టు సమీపంలో సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన సోనాబోటు ఢీ కొట్టడంతో బోట్ లోకి నీరు చేరి సముద్రంలో మునిగిపోయింది. వెనుక వస్తున్న మరో బోటులో ఉన్న అంతర్రాష్ట్ర జాలర్లు మునిగిపోతున్నవారిని రక్షించారు.అనుమానం తో భార్య ను కత్తి తో పోడిచి చంపినా భర్త
*నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్న ఐతం రవిశంకర్‌ అలియాస్‌ రవి ఆచూకీ కోసం తెలంగాణా రాష్ట్ర పోలీసులు వైఎస్సార్‌ జిల్లాలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పోలీసులకు పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు.
*తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలను మోసగించిన ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టయ్యారు. ఇరిడియం కాపర్ బిందెలతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి 15మంది నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి షేక్‌ సర్దార్‌ హుస్సేన్‌ పరారయ్యాడు.
*ద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామం ఎస్సీ పాలెంలో మంగళవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది.
*రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 కోట్లు ఇస్తానని చెప్పి ప్రజలకు రూ.30 లక్షల వరకు టోకరా వేసిన ఘరానా మోసగాడిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.
*రంజీ క్రికెటర్‌ జల్సాలకు, వ్యసనాలకు బానిసై మోసాలబాట పట్టాడు. ప్రముఖులు, మంత్రుల పీఏల పేరుతో రాష్ట్రంలోని పలు కార్పొరేట్‌ సంస్థల నిర్వాహకులకు ఫోన్లు చేసి డబ్బులు వసూళ్లుకు పాల్పడి పలుసార్లు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. * నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం లభ్యం-కాఫీడే యజమాని కథ విషాదాంతం
కేఫ్‌ కాఫీడే సీఎండీ వి.జి సిద్ధార్థ కథ విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆయన.. నేత్రావతి నదిలో ఈ రోజు ఉదయం శవమై కన్పించారు. ఈ నెల 29న సాయంత్రం నేత్రావతి నది వంతెనపై వెళ్తుండగా డ్రైవర్‌ను కారు పక్కకు నిలపాలని సిద్ధార్థ సూచించారు. వంతెనపై నడుస్తూ సాయంత్రం 6:30వరకు ఫోన్‌లో మాట్లాడారు. కొద్ది సేపటి తర్వాత ఆయన కనిపించకపోవడంతో డ్రైవర్‌ ఆందోళన చెంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, డ్రైవర్‌ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం నుంచి మూడు పోలీసు బృందాలు ఓవైపు, ఎనిమిది పడవల సాయంతో గజ ఈతగాళ్లు, తీర ప్రాంత గస్తీదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు మరోవైపు నేత్రావతి నదిలో గాలింపు చేపట్టాయి. నదిలో ఎనిమిదో స్తంభం వద్ద ఓ వ్యక్తి నీటిలో దూకడం చూశానని స్థానిక జాలరి ఒకరు వెల్లడించినట్లు మాజీ మంత్రి యు.టి.ఖాదర్‌ తెలిపారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్నందున రక్షించే సాహసం చేయలేకపోయినట్లు ఆ జాలరి తెలిపారు.ఎన్నో ఆశలతో కాఫీడే సామ్రాజ్యాన్ని స్థాపించినా, అనుకున్న విజయాన్ని సాధించలేకపోయానని ఆయన రాసినట్లుగా చెబుతున్న లేఖ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. తన సంస్థల్లో సుమారు 30 వేల మందికి ఉపాధి కల్పించానని, ఆర్థిక నష్టాలు తీవ్రంగా కదిలించాయని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను విభాగం ఉన్నతాధికారి వేధింపులతో విసిగిపోయానని ఆ లేఖలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేఫ్‌ కాఫీ డేను స్థాపించి భారతీయ కాఫీకి అంతర్జాతీయ ప్రాచుర్యం కల్పించడంతో సిద్ధార్థ కార్పొరేట్‌ ప్రపంచానికి సన్నిహితుడయ్యారు. బెంగళూరు సహా దేశ, విదేశాల్లో కాఫీ డే విక్రయ కేంద్రాలను స్థాపించారు. చిక్‌మగలూర్‌ జిల్లాలో దాదాపు 12 వేల ఎకరాల కాఫీ తోటల్ని నిర్వహిస్తున్నారు.
* పాకిస్తాన్‌‌లో మంగళవారం తెల్లవారుజామున ఆర్మీ ఫ్లైట్‌‌ క్రాష్‌‌ అయింది. ఈ ఘటనలో సిబ్బందితో పాటు 18 మంది చనిపోయారు.
* భర్త మరణాన్ని జీర్ణించుకోలేక అస్వస్థతకు గురైన భార్య ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపురానికి చెందిన మైసయ్య(55) కొద్ది రోజులుగా అనారోగ్యం పాలయ్యారు.
* జాతీయ రహదారి కొంపల్లి వద్ద ఓ ఇన్నోవా కార్ బీభత్సం సృష్టించింది . మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది . మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మొత్తం ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
* బీఫార్మసీ విద్యార్థిని సోనీని అపహరణ చేసిన రవిశేఖర్‌ పోలీసులకు పట్టుబడ్డట్టు తెలుస్తోంది.. అద్దంకిలో సోనీని వదిలేసిన రవిశేఖర్‌.. అక్కడి నుంచి మరో చోటుకు పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయినట్లు సమాచారం .. అయితే, పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.
* మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి వద్ద గడిచిన అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతులను విక్రమ్(22), ఇందా చంద్(22), దినేశ్(22)గా గుర్తించారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలం దేవెళ్లగూడెం అటవీప్రాంతంలో న్యూడెమోక్రసీ దళానికి చెందిన లింగన్న దళం, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో న్యూడెమోక్రసీ దళ సభ్యుడు ఒకరు మృతిచెందారు.
* హైదరాబాద్ నగరంలోని మదాపూర్ పరిధిలో క్యూనెట్ బాధితుడు అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
* మేడ్చల్‌ నగర శివారులోని కొంపల్లిలో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.
* క్యూనెట్ చేతిలో మోసపోయిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.
*మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..సతారా వద్ద బెంగళూరు-పుణె జాతీయరహదారిపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. పుణె వైపు నుంచి వేగంగా వస్తున్న కారు కాశిల్‌ అనే గ్రామం వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
*అఫ్గానిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ఫర్హా ప్రావిన్స్‌లో కాందహార్‌-హెరాత్‌ జాతీయరహదారిపై బుధవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
*పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఒక విమానం మంగళవారం రావల్పిండిలోని ఒక నివాస ప్రాంతంపై కూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు.
*వైకాపా విపరీత ధోరణికి సామాజిక మాధ్యమాల్లో వారు పెడుతున్న పోస్టింగులే నిదర్శనమని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు.
*అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ప్రెస్(రైలు నంబరు 12656)లోని బీ4 ఏసీ బోగీలో అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాలీ బ్యాగుల్లోని 500 నక్షత్ర తాబేళ్లను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు మంగళవారం విజయవాడలో స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు నక్షత్ర తాబేళ్లను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
*అమరావతిలోని తుళ్ళూరు మండలం రాయపూడి మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల(ఆదర్శ)లో సోమవారం ఒక విద్యార్థిని పట్ల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థిని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఓ మాజీ క్రికెట్ క్రీడాకారుడిని నెల్లూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు.
*రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 కోట్లు ఆదాయం వస్తుందని నమ్మబలికి.. సుమారు 15 మందిని మోసం చేసిన యువకుడు చివరకు పోలీసులకు చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పెద్దాడకు చెందిన 31 ఏళ్ల షేక్ సర్దార్ హుస్సేన్ అలియాస్ శివాజీ..ప్రధాని మోదీ, ఆర్బీఐ అధికారులు సంతకాలు చేసినట్లుగా నకిలీ ధ్రువపత్రాలు చూపి సుమారు రూ.30 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డాడు.
*మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది.
*హీరాగోల్డ్ ఛైర్పర్సన్ నౌహీరా షేక్పై ఉన్న కేసుల వివరాలు అందజేయాలని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
* కాలినగాయాలతో 17 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ‘జైశ్రీరాం’ అని నినాదాలు చేయనందుకే తనపై నలుగురు వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించారని బాధితుడు పోలీసులకు చెప్పాడు.
*అమెరికాలో తుపాకీ కాల్పుల ఘటనలు ఆగడం లేదు. తాజాగా విస్కాన్సిన్ రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనల్లో నలుగురు బలయ్యారు.
*అమెరికాలోని మిసిసిప్పీలో ఉన్న వాల్మార్ట్ దుకాణంలో మాజీ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో ఇద్దరు వాల్మార్ట్ ఉద్యోగులు చనిపోయారు. ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. సౌత్హేవెన్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఎదురుకాల్పుల్లో హంతకుడు గాయపడ్డాడు.
*సింగరాయకొండ పోలీసు స్టేషన్లో పని చేస్తోన్న ఎ.ఎస్.ఐ. నుంచి రక్షణ కల్పించాలంటూ తన్నీరు నాగరాజు అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్న చేశారు.
*సింగరాయకొండ పోలీసు స్టేషన్లో పని చేస్తోన్న ఎ.ఎస్.ఐ. నుంచి రక్షణ కల్పించాలంటూ తన్నీరు నాగరాజు అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్న చేశారు.
*భార్య మెయిల్ ఐడీతో ఫేస్బుక్ ఖాతా తెరిచి అసభ్యకర చిత్రాలు పోస్టింగ్తో వేధింపులకు పాల్పడుతున్న ఓ ప్రబుద్ధుడిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
* రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు ఆమోదం తెలిపి ఒక్కరోజు గడవకుండానే ఓ భర్త తన భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన ఘటన బుధవారం అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో భాదితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తేలింది . ప్రసుతం సదరు యువతి అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తలాక్‌ చెప్పిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.