Politics

ఈడీ అటాచ్ చేసిన జగన్ ఆస్తుల విడుదలకు కోర్టు ఉత్తర్వ్యూ

ED Attached Properties Of Jagan To Be Released-ఈడీ అటాచ్ చేసిన జగన్ ఆస్తుల విడుదలకు కోర్టు ఉత్తర్వ్యూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బంపర్ బొనాంజ తగిలింది. జగన్ ఆస్తుల కేసులో 13 అప్పీళ్లకు సంబంధించి ఈడీ జప్తు చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. వాన్ పిక్ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు జగన్ ఆస్తులను అటాచ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలతో సీఎం వైయస్ జగన్ తోపాటు వాన్ పిక్ కేసు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపార వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లకు చెందిన ఆస్తులను కూడా విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు నిమ్మగడ్డ ప్రసాద్ కు సంబంధించిన రూ.324 కోట్లను ఈడీ గతంలో అటాచ్ చేసింది. ఆ ఆస్తులను కూడా విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే నిమ్మగడ్డ ప్రసాద్ ను రూ.274 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీని చూపించాలని ఆదేశించింది.