Food

అల్లం…రక్తపోటుకు వేస్తుంది కళ్లెం

అల్లం...రక్తపోటుకు వేస్తుంది కళ్లెం - Ginger aids in controlling blood pressure

మీకు హైబీపీ ఉందా. దీనిని నియంత్రించుకునేందుకు వందల రూపాయలు ఖర్చు పెట్టి మందులు కొంటున్నారా? ఇవి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముందని తెలిసినా.. తప్పదని సర్దుకు పోతున్నారా? అయితే, ఇకపై చింతించకండి. నేరుగా వంటగదిలోకి వెళ్లి.. అల్లం ముక్కను తీసుకుని, 4 గ్రాముల ముక్కను తుంచుకుని నమిలి తినండి. రోజూ ఇలా చేయడం ద్వారా హైబీపీతో పాటు రక్తంలోని చక్కెర, శరీరంలోని అధిక కొవ్వు తగ్గిపోవడం ఖాయమని నైజీరియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలోరిన్ శాస్త్రవేత్తలు తెలిపారు. అల్లం.. హైబీపీని నియంత్రించే అమృతమని పేర్కొన్నారు. అల్లంపై పలు ప్రయోగాలు చేసిన వీరు.. దీనిలోని రసాయనిక గుణాలు, త్వరగా జీర్ణమయ్యే నూనెలు, ఫెనాల్ కాంపౌండ్స్ వంటివి హైబీపీ నుంచి రక్షణ కల్పిస్తాయని వివరించారు.