Sports

భారత మహిళా బాక్సర్ల గుద్దులకు రష్యా అదిరింది

భారత మహిళా బాక్సర్ల గుద్దులకు రష్యా అదిరింది - Indian female boxers performing great at russian interantional championship

బాక్సింగ్ రింగుల్లో మన దేశ మహిళా బాక్సర్లు అదరగొడుతున్నారు. రష్యాలో జరుగుతున్న అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ఏకంగా నలుగురు మహిళా బాక్సర్లు వివిధ కేటగిరిల్లో సెమీస్‌లోకి దూసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే రష్యాలోని కాస్సియస్క్‌ నగరంలో మాగోమెడ్‌ సలాం ఉమక్మోవ్‌ మెమోరియల్‌ అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి. భారతదేశం తరుఫున ఆసియా గోల్డ్‌మెడలిస్ట్‌ పూజారాణి 75 కేజీల విభాగంలో రష్యాకు చెందిన లౌరాను 4-1 తేడాతో ఓడించగా, ప్రపంచచాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత లోవిలినా బోర్గోహైన్‌ 69 కేజీలు విభాగంలో అనస్తేసియాసిగేవాను 5-0 తేడాతో మట్టికరిపించింది. వీరిద్దరితోపాటు ఇండియన్‌ ఓపెన్‌ గోల్డమెడలిస్ట్‌ నీరజ్‌(57 కేజీలు) 4-1 తేడాతో సయానాపై గెలుపొందగా, జానీ 5-0 తేడాతో ఒబుషేన్‌కొవాను ఓడించింది. మరొక మహిళబాక్సర్‌ పింకి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. పురుషల విభాగంలో అశీష్‌ ఇన్షా(52కేజీలు) కార్టర్‌ఫైనల్‌లో అడుగుపెట్టగా, గౌరవ్‌సొలంకీ(56కేజీలు) గోవింద్‌సహాని(49కేజీలు) సంజీత్‌(91 కేజీలు)లు చివరి ఎనిమిదో దశకు చేరారు. మొత్తం 21 దేశాలు నుంచి సూమారు 200కు పైగా అంతర్జజాతీయ బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు.