Food

పులసలు దొరక్క అల్లాడుతున్న ప్రజలు

Scarcity of pulasa fish in telugu states - పులసలు దొరక్క అల్లాడుతున్న ప్రజలు

పుస్తెలు అమ్ముకునైనా పులస తినాలనేది నానుడి! అందుకే… గోదావరి పొంగిందంటే… తూర్పు, పశ్చిమ జిల్లాల్లో పులుసుడకాల్సిందే! అయితే.. ఈసారి మాత్రం చేపల ప్రియులకు నిరాశే ఎదురయ్యేలా ఉంది. ఆశించిన స్థాయిలో దొరక్కపోవడంతో… పులస ధర ఈసారి కొండెక్కేసింది! గోదావరికి వరదనీరు వచ్చిన తర్వాత సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి వచ్చే ఇలస, పులస చేపగా మారుతుంది. గతంలో జులై వచ్చేసరికి పులసలు విపరీతంగా దొరికేవి. గోదావరిలో వరదనీరు రాకతో పులస చేపల లభ్యత ఎక్కువయ్యేది. ఈ సారి వరద ఉద్ఢృతంగా ప్రవహిస్తున్నా.. పులస మాత్రం కానరావడం లేదు. జాలర్లు వలలతో నిరీక్షిస్తున్నా… అశించిన స్థాయిలో దొరకడం లేదు. పులస కోసం జాలర్లు ఎంతలా వేచి చూస్తారో.. భోజన ప్రియులు అంతకంటే ఎక్కువే నిరీక్షిస్తారు. అలాంటిది ఈ ఏడాది పులసలు ఆశించినంతగా చిక్కకపోవడంతో జాలర్లు, భోజన ప్రియులు ఇరువురు నిరాశ చెందుతున్నారు.