ScienceAndTech

చందమామపై చైనా సక్సెస్

Chinese Satellite Lands On Far Side Of Moon - చందమామపై చైనా సక్సెస్

చైనాకు చెందిన బుల్లి వ్యోమనౌక లాంగ్‌జియాంగ్‌-2 తన ప్రస్థానాన్ని ముగించుకొని శుక్రవారం జాబిల్లి ఉపరితలాన్ని ఢీ కొట్టి, అంతమైంది. నిర్దేశించిన రీతిలో జాబిల్లి ఆవలి భాగాన్ని అది తాకిందని చైనా అంతరిక్ష సంస్థ వివరించింది. 47 కిలోల బరువున్న ఈ వ్యోమనౌకను గత ఏడాది మే 21న ప్రయోగించారు. అది 437 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరిభ్రమించింది. ఇందులో సౌదీ అరేబియా అభివృద్ధి చేసిన ఒక ఆప్టికల్‌ కెమెరా కూడా ఉంది.