Food

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే దాల్చిన చెక్క

Cinnamon Controls Blood Glucose Levels

దాల్చిన చెక్కను సుగంధ ద్రవ్యంగానే కాదు, ఆహార దినుసుగా కూడా తరచుగా ఉపయోగిస్తూ ఉండాలి. దీనిలోని పోషకాలు, ఔషధ గుణాలు పలు రకాల రుగ్మతలను తరిమికొడతాయి.వ్యాధులకు అడ్డుకట్ట: దాల్చినచెక్క ఆహారంలోని ఫంగల్, బ్యాక్టీరియల్, వైరస్ సంబంధింత అంశాలను నిరోధించడంతో పాటు మెటబాలిజంతో సంబంధం ఉన్న అధిక రక్తపోటు, రక్తంలో ప్లాస్మా, గ్లూకోజ్, స్థూలకాయాత్వాన్ని నియంత్రిస్తుంది.

మధుమేహం అదుపు: మధుమేహానికి శాశ్వత విరుగుడు లేకపోయినా, ఈ రుగ్మత సంబంధిత లక్షణాలను దాల్చినచెక్క అదుపు చేస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గుదల: దాల్చినచెక్కను క్రమంతప్పక ఆహారంలో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులు అదుపు: లక్షణాలను అదుపు చేసే క్రమంలోనే ఈ వ్యాధులకు చికిత్స కొనసాగుతుంది. అయితే చికిత్సతో పాటు దాల్చినచెక్కను ఆహారంలో చేర్చుకుంటే చికిత్స ప్రభావం ఇనుమడిస్తుంది.