Sports

డెయిల్ స్టెయిన్ గుడ్‌బై

Dayle Steyn Bids Good Bye To Test Cricket

సౌతాఫ్రికా స్పీడ్‌‌‌‌స్టర్‌‌‌‌ డేల్‌‌‌‌ స్టెయిన్‌‌‌‌.. టెస్ట్‌‌‌‌లకు గుడ్‌‌‌‌బై చెప్పాడు. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో ఎక్కువ కాలం కొనసాగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ‘నేను ఎక్కువగా ఇష్టపడే ఐదు రోజుల ఫార్మాట్‌‌‌‌కు వీడ్కోలు చెబుతున్నా. క్రికెట్‌‌‌‌కు టెస్ట్‌‌‌‌లే ప్రాణం. ఓ క్రికెటర్‌‌‌‌ను మానసికంగా, శారీరకంగా పరీక్షిస్తాయి. భావోద్వేగానికి గురి చేస్తాయి.అవి ఎంతలా అంటే.. మరో టెస్ట్‌‌‌‌ ఆడొద్దనే భయాన్ని కలిగిస్తాయి. కానీ ఇప్పుడు మొత్తానికే గుడ్‌‌‌‌బై చెప్పడం మరింత భయంకరంగా ఉంది. షార్ట్‌‌‌‌ ఫార్మాట్స్‌‌‌‌లో ప్రొటీస్‌‌‌‌ టీమ్‌‌‌‌కు అందుబా టులో ఉంటా’ అని స్టెయిన్‌‌‌‌ వ్యాఖ్యా నించాడు. 2004లో ఇంగ్లండ్‌‌‌‌పై అరంగే ట్రం టెస్ట్‌‌‌‌ ఆడిన స్టెయిన్‌‌‌‌.. ఈ ఏడాది ఫిబ్రవ రిలో లంకతో చివరి మ్యాచ్‌‌‌‌ ఆడాడు.