DailyDose

కోడెల మాకొద్దు బాబోయ్-తాజావార్తలు–08/07

Sattenapalli TDP Cadre Doesnt Want Kodela Leadership-Telugu Breaking News Today-Aug72019...కోడెల మాకొద్దు బాబోయ్-తాజావార్తలు–08/07

* గుంటూరు జిల్లా,సత్తెనపల్లి తెదేపా లో ఎగిసిపడుతున్న కోడెల అసమ్మతి జ్వాలాలు.నేడు చంద్రబాబును కలవనున్న కోడెల అసమ్మతి నేతలు. కోడెల నాయకత్వంపై అసంతృప్తిగా తెలుగుతమ్ముళ్లు. సత్తెనపల్లి నియోజకవర్గానికి కొత్త ఇంచార్జి నియమించాలని చంద్రబాబును కోరనున్న కోడెల అసమ్మతి నేతలు. త్తెనపల్లి పట్టణంలో పాత తెదేపా కార్యాలయం తిరిగి ప్రారంభం. కోడెల నాయకత్వం అవసరం లేదంటున్న తమ్ముళ్ళు. తన నాయకత్వం వస్తే రానున్న మున్సిపల్, పంచాయతీ యంపిటిసి, జెడ్పీటీసీ, సోసైటీ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపుతామని ..నూతన ఇంచార్జి కావాలంటున్న తెలుగుతమ్ముళ్లు.మారు 200 మంది పైగా వాహనాలు లో.. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు ను కలిసేందుకు.. అసమ్మతి నేతలు ఏర్పాట్లు..త్తెనపల్లి పట్టణంలో ని పాతబస్టాండ్ వద్ద కల తెదేపా కార్యాలయం వద్ద వాహనాలు ఏర్పాటు…రంగంలోకి దిగిన కోడెల..!వెళ్లవద్దని..మాజీ మునిసిపల్ చైర్మన్, సత్తెనపల్లి పట్టణ తెదేపా అధ్యక్షుడు.. తదితర నేతల తో..ఫోన్లు..తటస్థ నేతలకు..ఇరువర్గాల ఫోన్లు..సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా లో..ఈ రోజు ఆసక్తికర పరిణామాలు.
* గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టిడిపి ప్రతినిధి బృందం పర్యటన వివరాలు…మొదటి రోజు పశ్చిమగోదావరి జిల్లా
-ఆచంట నియోజకవర్గంలో ..మార్టేరు,కోడేరు,ఆచంట,ఆచంట వేమవరం ,గుమ్ములూరు ,పాలకొల్లు నియోజకవర్గం ..వర్దిపర్రు ,కాంబోట్లపాలెం ,గుంపర్రు,దొడ్డిపట్ల ,పాలకొల్లు ఏఎంసి ప్రాంగణం ,ఆగర్రిపాలెం,వెలివెల ,
నరసాపురం నియోజకవర్గంలో ..మల్లవరం,మల్లవరంలంక ,సరిపల్లి,గొంది ,చిట్టవరం.
* రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ సర్కారు కసరత్తులు చేస్తోంది. వచ్చే నెలలో స్థానిక సంస్థల షెడ్యూల్‌ జారీ చేసే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలతో స్థానిక సమరం ప్రారంభం కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వచ్చే ఏడాది చేపట్టే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు జాప్యం కానుండడంతో ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లోగా అన్ని స్థాయిల్లో స్థానిక ఎన్నికల పూర్తికి కసరత్తు చేస్తోంది.
* పెనుమంట్ర మండలంలో మాజీ మంత్రి నారా లోకేష్‌ బుధవారం పర్యటించారు. మార్టేరు నుండి ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గంలో ముంపునకు గురైన పంట పొలాలను లోకేష్‌ పరిశీలించారు. ముందుగా మార్టేరు నుండి బయలు దేరారు. ఈ పర్యటనలో లోకేష్‌ తో పాటు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, తదితరులు పాల్గన్నారు.
* హైదరాబాద్ లోని సరూర్ నగర్ మైదానంలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించారు. ఓబీసీ మహాసభకు మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ లతో పాటు దేవేందర్ గౌడ్, బూర నర్సయ్య, ఎల్.రమణ, జస్టిస్ ఈశ్వరయ్య లు హాజరయ్యారు.
* ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కి అందచేశారు. అనంతరం నన్ననేని మాట్లాడుతూ…‘ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్‌కు అందచేశా. నా నివేదికను చూసి గవర్నర్‌ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచా. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్‌గా చల్లా మధుసూదన్‌ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈయన రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఐటీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు .ఈ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరామ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, స్పీకర్‌ తమ్మినేని సీతారం, ఎమ్మెల్యేలు రక్షణ నిధి, కిలారి రోషయ్య హజరయ్యారు. వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలి.’ అని అన్నారు.
* పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌పై 7 వికెట్లతో భారత్‌ ఘన విజయం సాధించింది. యాషెస్‌ తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు కొట్టిన స్టీవ్‌ స్మిత్‌ను ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఆకాశానికెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి స్మిత్‌ ఏమాత్రం తీసిపోడని అన్నాడు.ఇప్పటికే యాషెస్‌ తొలి టెస్టులో ఘోర పరాజయంతో డీలాపడ్డ ఇంగ్లండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
* గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు పంచాయతీ ఉద్యోగులు. దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో గుత్తేదారు నుంచి రూ. 31 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ ఉద్యోగులైన ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో పంచాయతీ కార్యదర్శి గోవిందరావు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణారెడ్డి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నరేందర్ రెడ్డి ఉన్నారు. పురపాలికలో అభివృద్ధి పనులకు సంబంధించి గుత్తేదారుకు రూ. 2.50 లక్షల బిల్లు ఇవ్వడానికి ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు.
* ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
*వంశధార, నాగావళి నదుల వరదల పై సంబంధిత జిల్లా, మండల అధికారులతో జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ ను నిర్వహించారు. జె.నివాస్‌ మాట్లాడుతూ… అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం నాటికి వంశధారలో 1.50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుకుంటుందని తెలిపారు.
*జమ్ము కాశ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌ సింగ్‌ తన కారుపై ఉన్న కాశ్మీర్‌ జెండాను తొలగించారు. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను తొలగిస్తూ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన నేపథ్యంలో నిర్మల్‌ సింగ్‌ తన కారుపై ఉన్న కాశ్మీర్‌ జెండాను తొలగించారు.
*పంజాబ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్‌ ప్రకటించింది. భద్రతా దళాలను భారీగా మోహరించింది. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జెష్‌-ఎ-మొహమ్మద్‌, లష్కర్‌-ఎ-తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశాలున్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలను గుర్తించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
*ఒడిశాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు నాగావళి, వంశధార నదులకు వరద నీటి ప్రవాహం పోటెత్తింది. దీంతో తోటపల్లి, గొట్టా బ్యారేజీ వద్ద వరద నీటి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది.
*పెద్దపల్లి జిల్లా రామగుండం కోల్‌బెల్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 4 ఓసీపీలలో 30వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
*బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తడం వల్ల ఒడిశా రాష్ట్రంలో బుధవారం పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. రాయగఢ- టిటిలాఘడ్ మార్గంలో అంబోదల రైల్వేస్టేషను సమపీంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. మూడు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో రైల్వే సిబ్బంది వీటిని పునరుద్ధరించేందుకు పనులు చేపట్టారు. వరదనీరు రైలు పట్టాలపైకి చేరడంతో దైకలు-అంబదోలా సెక్షన్ లో నాలుగు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. దీంతో పాటు మరో ఐదు రైళ్లను దారి మళ్లించారు. వరదల వల్ల రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
*మహిళలు నాటు వేస్తుండగా ఒక్కసారిగా వాగు పొంగడంతో 45 మంది నాలుగు గంటల పాటు తీవ్ర అవస్థలు పడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో ముసలమ్మ వాగు అవతలనున్న పొలాల్లో 45 మంది మహిళా కూలీలు నాటు వేయడానికి వెళ్లారు. కాసేపటికే వాగు పొంగడంతో నాలుగు గంటల పాటు మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో గ్రామస్తులంతా తాళ్ల సాయంతో మహిళలను ఒడ్డుకు చేర్చారు.
*కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామానికి చెందిన ఓ మహిళకు తన సొంత పొలంలోనే ఆరు క్యారెట్ల బరువైన వజ్రం లభించింది. దాన్ని అదే రోజు అర్ధరాత్రి అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన వ్యాపారులు రూ.4 లక్షల నగదుతో పాటు మూడు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది బొళ్లవానిపల్లిలో వ్యవసాయ కూలీకి లభించిన రూ.13 లక్షల వజ్రం తర్వాత ఇదే ఖరీదైందని తెలిసింది.
*భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని ములకపల్లి కస్తూర్బా హాస్టల్‌లో 10మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వారిని హాస్టల్ సిబ్బంది హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయితే పది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గోడలపై బొమ్మలకు రంగులు వేస్తుండగా వాసనకు విద్యార్థులంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
*మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు ప్రక్రియను హడావుడిగా పూర్తి చేయడానికి జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈనెల 9లోగా కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
*జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని భారత్ రద్దు చేయడం వల్ల ఆ రాష్ట్రంలో పుల్వామా తరహా దాడులు మరిన్ని జరగొచ్చని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల రెండు దేశాల మధ్య యుద్ధం చెలరేగవచ్చన్నారు.
*దశాబ్దం తర్వాత మళ్లీ నారాయణపూర్ నుంచి భారీగా వరద నీరు విడుదలైంది. మంగళవారం సాయంత్రం 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2009లో కృష్ణా నది చరిత్రలోనే అత్యధికంగా శ్రీశైలం వద్ద 25 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. 2009 అక్టోబరు 2న 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. దిగువన భీమా నది నుంచి, స్థానికంగా లభ్యమైన నీటితో కలిసి జూరాలలోకి 11.14 లక్షల క్యూసెక్కుల వరద అప్పట్లో వచ్చింది.
*మున్సిపల్ ఎన్నికలకు ముందస్తు ప్రక్రియను హడావుడిగా పూర్తి చేయడానికి జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఈనెల 9లోగా కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
*ఓబీసీల జాతీయ మహాసభలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. దేశంలోని వెనకబడిన తరగతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలుగెత్తి చాటడానికి వేదికవుతోంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతి, రిజర్వేషన్లు, హక్కుల సాధనే లక్ష్యాలుగా ముందుకు సాగనుంది. జనాభా దామాషాలో అన్నింటా వాటా కావాలనే డిమాండ్ను వినిపించనుంది.
*తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయశంకర్ జయంత్యుత్సవాలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ముఖ్యమంతి, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆయనకు నివాళులర్పించారు.
*సచివాలయం సమీపంలోని లుంబినీ పార్కు వద్ద నిర్మిస్తున్న అమరుల స్మృతి వనం ఆరు నెలల్లో పూర్తి కానుందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
*కర్నూలు జిల్లా పగిడిరాయికి చెందిన ఓ మహిళకు తన సొంత పొలంలోనే ఆరు క్యారెట్ల బరువైన వజ్రం లభించింది. దాన్ని అదే రోజు అర్ధరాత్రి అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యాపారులు రూ.4లక్షల నగదుతో పాటు 3తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం.
*జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల’(డీసీసీబీ) పరిధిలో కొత్తగా మరో 16 శాఖలు తెరవాలని రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయించింది. కొత్త శాఖలను ఆదిలాబాద్ డీసీసీబీ పరిధిలో 6, కరీంనగర్, మెదక్లలో అయిదేసి చొప్పున తెరుస్తారు.
* ఎంసెట్ బైపీసీ విద్యార్థులకు బీఫార్మసీ, ఫార్మా డి, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి విడత సీట్లను మంగళవారం కేటాయించారు. మొత్తం 7,793 సీట్లు అందుబాటులో ఉండగా 7,376 మందికి సీట్లు దక్కాయి.
*‘జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల’(డీసీసీబీ) పరిధిలో కొత్తగా మరో 16 శాఖలు తెరవాలని రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయించింది.
*వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం వాయుగుండం ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్ని ఆనుకుని బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోంది. బుధవారంలోగా తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వరసగా నాలుగు రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించారు.
*ఆప్కాబ్ పర్సన్ ఇన్ఛార్జిగా సహకారశాఖ కమిషనర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాథమిక సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో ఆప్కాబ్కు ఆరు నెలల కాలానికి పర్సన్ ఇన్ఛార్జిని నియమించారు.