Business

కిలో కనకాంబరాలు ₹1000

One Kilo Kanakambaram Flowers Costs 1000 Rupees-కిలో కనకాంబరాలు ₹1000

శ్రావణ మాసం.. లక్ష్మీ దేవికి ఆవాసం. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని పూలకు రెక్కలొచ్చాయి. ధరలు నింగినంటుతున్నాయి. కిలో కనకాంబరాలు వెయ్యి రూపాయలు పలుకుతున్నాయి మార్కెట్లో. శ్రావణమాసం మొదలైనప్పటినుంచి కనకాంబరం సాగుదారులకు కనకం కురిపిస్తోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం బత్తలపల్లి మార్కెట్లో కిలో కనకాంబరం పూల ధర రూ.950 నుంచి 1050 వరకు పలికింది. రెండ్రోజుల క్రితం రూ.1300 పలకడంతో రైతులకు అదనపు ఆదాయం వచ్చింది. జూన్ నెలలో ఆషాఢ మాసం కావడంతో ధరలు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. శ్రావణ మాసం రాగానే రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.