Sports

₹39కోట్ల సంపాదన

₹39కోట్ల సంపాదన-PV SIndhu Ranked No.13 In Earnings Of Tennis Players

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆదాయం ఆర్జించిన మహిళా అథ్లెట్లతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితా (2019)లో భారత్ నుంచి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు మాత్రమే చోటు దక్కింది. 15 మంది అథ్లెట్ల జాబితాలో ఆమె రూ.39 కోట్లతో 13వ స్థానంలో నిలిచింది. దాదాపుగా రూ. 205 కోట్ల సంపాదనతో సెరెనా విలియమ్స్ అగ్రస్థానంలో ఉంది. రూ. 170 కోట్లతో నవోమి ఒసాకా రెండో స్థానంలో నిలిచింది. 2018 జూన్ నుంచి మొదలు ఏడాది కాలంలో అథ్లెట్లు నగదు బహుమతి, జీతాలు, బోనస్లు, వాణిజ్య ఒప్పందాలు తదితర మార్గాల్లో ఆర్జించిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఫోర్బ్స్ జాబితాలో 12 మంది టెన్నిస్ క్రీడాకారిణులే కావడం విశేషం.