Movies

నా సినిమా బంగారం

Varma Says His New Movie Kamma Rajyamlo Kadapa Redlu Will Not Cause Issues...నా సినిమా బంగారం

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి తెర తీశాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమాతో ఘన విజయం అందుకున్న వర్మ, ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలోనే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించబోతున్నట్టుగా ప్రకటించాడు. అయితే ఆ సమయంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ప్రమోషన్‌ కోసమే వర్మ ఈ ప్రకటన చేసినట్టుగా భావించారు.కానీ వర్మ చెప్పినట్టుగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను ప్రారంభించాడు. ఎప్పుడు మొదలైందో.. ఎక్కడి వరకూ వచ్చిందో చెప్పకపోయినా, రేపు(09-08-2019) ఉదయం 9 గంటలకు ఈ సినిమా తొలి పాట ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తావివ్వని సినిమా అని చెపుతున్నాడు వర్మ. టైటిల్‌తోనే వివాదానికి తెర తీసిన వర్మ నిజంగా వివాదాలకు తావివ్వకుండానే ఈ సినిమా రూపొందిస్తున్నాడేమో చూడాలి.