Videos

కమ్మరాజ్యంలో కడప రెడ్లు పాట

కమ్మరాజ్యంలో కడప రెడ్లు పాట - RGV Releases First Song From Kamma Rajyamlo Kadapa Redlu

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కుతున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. తాజాగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ విడుదల అయ్యింది. ఎప్పడూ వివాదాస్పద మార్గంలోనే వెళ్లే ఆర్జీవీ, ఈసారి కూడా అదే పంథాను ఎంచుకున్నాడు. పాట ప్రారంభంలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆపై అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని, మాజీ సిఎం చంద్రబాబు, జగన్ ల మధ్య వాగ్యుద్ధాన్ని చూపిస్తూ పాట మొదలైంది. చంద్రబాబు, జగన్ ల వ్యాఖ్యలను కూడా ఈ పాటలో చూపించడం విశేషం. ఇక ఇవే దృశ్యాలు సినిమాలో ఉంటాయో, ఉండవో తెలియదుగానీ, ప్రస్తుతానికి మాత్రం ఈ పాట సోషల్ మీడియాలో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది.