Fashion

టీ డికాక్షన్‌తో తలస్నానం చేస్తే….

For healthy hair try washing it with tea decoction-టీ డికాక్షన్‌తో తలస్నానం చేస్తే....

కొందరి జుట్టు బాగా పొడిబారి ఎండుగడ్డిలా మారిపోతుంది. దువ్వినప్పుడు తెగిపోయి ఇబ్బందిగా కనిపిస్తుంది. అయితే ఈ సమస్యకి ఇంట్లోనే పరిష్కారముంది. అదెలాగంటే…
* మూడు చెంచాల చొప్పున తేనె, బాదం నూనె తీసుకుని మాడుకీ, జుట్టుకీ రాసుకుని కాసేపు మర్దన చేసుకోవాలి. గంటయ్యాక తలస్నానం చేసి కండిషనర్‌ పెట్టుకోవాలి. తరచూ ఈ విధంగా చేస్తుంటే జుట్టుకు తేమ అంది పట్టుకుచ్చులా మారుతుంది.
* కట్ట మెంతి కూరనూ, కొన్ని మందార ఆకుల్నీ తీసుకుని మిక్సీలో పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి గుడ్డులోని తెల్లసొన కలిపి పూతలా రాసుకుని రెండు గంటలయ్యాక కడిగేసుకోవాలి.
* పావు కప్పు కలబంద గుజ్జుకు నాలుగు చెంచాల తేనె, రెండు గుడ్లలోని తెల్ల సొన కలిపి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి షవర్‌ క్యాప్‌ పెట్టుకుని గంటయ్యాక తలస్నానం చేయాలి. రెండు వారాలకోసారి ఇలా చేస్తుంటే జుట్టుకు తేమ అందుతుంది.
* చిక్కగా కాచిన టీ డికాక్షన్‌తో మాడునీ, జుట్టునీ మర్దన చేసి గంటయ్యాక తలస్నానం చేయాలి. వారానికోసారి ఈ విధంగా చేస్తే ఎండుగడ్డిలా మారిన జుట్టు నిగనిగలాడుతుంది.