DailyDose

ఆవుల మృతికి కారణం ఇదే-తాజావార్తలు–08/12

Death of cows in vijayawada goshala mystery solved-today telugu breaking news-aug122019

*విజయవాడ తాడేపల్లి గోశాల ఆవుల అనుమానాస్పద మృతిలో కొత్తకోణం వెలుగుచూసింది. పశువులకు వేసిన గడ్డిలో అధిఖ శాతం నైట్రోజెన్ ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. గడ్డి ఏపుగా పెరగడానికి రైతులు నైట్రోజెన్ వినియోగిస్తారు. అయితే నైట్రోజెన్ పిచికారి చేసిన వారం రోజుల వరకు గడ్డి కోయరాదు. అలాంటిది పిచికారి చేసిన రెండు రోజుల్లోనే గడ్డికోసి అవులకు మేతగా వేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో టాక్సీటి ఎక్కువై ఆవులు మృతి చెందాయన్నారు పశు సంవర్ధక శాఖ అధికారులు.
* వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు లను ఖరారు చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ,
మైనార్టీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లా సీనియర్‌ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి
*లడఖ్‌ భారతీయ జనతా పార్టీ ఎంపీ జమ్యాంగ్‌ నామ్‌గ్యల్‌ ఆదివారం తన సొంత నియోజకవర్గానికి చేరుకుని పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఉత్సాహంతో డ్యాన్స్‌ చేశారు. తన చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని దరువుకు అనుగుణంగా చిందేశారు.
*విశాక ఔటర్‌ హార్బలోని టగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో టగ్‌లో 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 15 మంది సురక్షితంగా తప్పించుకున్నట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
* వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో సహా ఆరుగురు పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక అధినేత డోల్ ఇంద ప్రసాద్ మీద దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై టిడిపి, బిజెపి ,సిపిఎం, పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మీడియా పై దాడులకు నిరసనగా జర్నలిస్టు సంఘాలు ధర్నాలు రాస్తారోకోలు చేపట్ట డం, జర్నలిస్టు సంఘాల నేతలు ఆదివారం సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు.
* శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఎకో స్పోర్ట్స్ కార్ ను ఓవర్ టాక్ చేస్తూ వెనకనుంచి ఢీకొట్టిన ఎర్టిగా కార్ ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందగా ఒక్కరి పరిస్థితి విషమం. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.
* పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో విజిలెన్స్ అధికారులు సోమ‌వారం తనిఖీలు నిర్వ‌హించారు. అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ లో తరలిస్తున్న రెండున్నర టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, మినీ వ్యాన్ ను, బియ్యాన్ని సీజ్ చేశారు. బియ్యం విలువ 4 6,242 రూపాయలు ఉంటుంద‌ని తెలిపారు. ఈ దాడిలో ఇండియన్ ఫోర్స్ మెంట్ సిఐయూజే విల్సన్ రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
* తాము రాముడి కుమారుడు కుశుడు వంశానికి చెందిన వారమని బీజేపీ ఎంపీ, జైపూర్‌ రాజకుమారి దియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడి వంశస్థులు ప్రపంచం అ‍ంతటా వ్యాపించి ఉన్నారని.. అయోధ్య వివాదం తొందరలోనే పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం దియా కుమారి మాట్లాడుతూ… ‘రాముడి వారసులు ఉన్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. వారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. అంతెందుకు మా కుటుంబం కుశుడి అంశ నుంచి ఉద్భవించింది. రాజ కుటుంబం వద్దనున్న మను చరిత్ర, జన్యుశాస్త్రం ఆధారంగా ఈ విషయం చెబుతున్నాను. కావాలంటే నా దగ్గర ఉన్న పత్రాల ద్వారా ఈ విషయాన్ని నిరూపిస్తాను కూడా. దాదాపు ప్రతీ ఒక్కరు రాముడి పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. అయోధ్య కేసులో త్వరగా తీర్పు వెలువరించాల్సిందిగా వారందరి తరఫున విన్నపం చేస్తున్నా’ అని పేర్కొన్నారు.
* భారతావని వరదలతో అతలాకుతలమవుతోంది. నీటిలో నానుతూ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. జనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇక వరదలకు దేశ వ్యాప్తంగా 200 మంది వరకు దుర్మరణం చెందారు. వ్యాపారులకు రూ. 40 నుంచి 50లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. కూటకన్ను ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. కేరళలో మొత్తం 60 మంది మృతి చెందినట్లు సమాచారం.
* ఈశాన్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంది.దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడుతుందని ఐఎండీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.అదేవిధంగా దక్షిణ కోస్తా సముద్రతీరం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది.వీటి ప్రభావంతో ఈ నెల 13వ తేదీన ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
* ఢిల్లీ- అటారీల మధ్య నడిచే సంజౌతా లింక్ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్లు భారత రైల్వే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టికల్ 370 రద్దు కారణంగా కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్.. లాహోర్ – అటారీల మధ్య నడుస్తున్న సంజౌతా ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసింది. దీంతో భారత్ అటారీ వరకు వెళ్లే సంజౌతా లింక్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసింది
* ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ భర్త అనుభవ్‌ కోహ్లిని పోలీసులు ముంబైలో అరెస్టుల చేశారు. ఆయనపై భార్య శ్వేత గృహహింస కేసును నమోదు చేశారు. అంతేకాకుడా శ్వేత కుతూరు పాలక్‌ తివారీకి అతను అసభ్య ఫొటోలను చూపించినట్టు అభియోగాలు వినిపిస్తున్నాయి.
* జమ్ముకశ్మీర్‌లో బక్రీద్‌ ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి ముస్లింలు ఉదయమే మసీదులకు చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు నిషేదాజ్ఞల దృష్ట్యా మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు గుంపులుగా రాకుండా బారికేడ్లు పెట్టి పోలీసులు ప్రజల్ని నియంత్రించారు నిషేదాజ్ఞల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి భారీ ప్రదర్శనలు నిర్వహించడానికి పోలీసులు అనుమతించలేదు బక్రీద్‌ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు రేషన్‌ దుకాణాల్లో సరకులు అందుబాటులో ఉంచారు ఏటీఎంలలో డబ్బులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. శ్రీనగర్‌లో ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులకు పోలీసులు, అధికారులు మసీదుల వద్ద శుభాకాంక్షలు తెలియజేశారు ఒకరికొకరు ఆలింగనం చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు
*అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డి పల్లి వద్ద కస్తూరిబ్బా గాంధి బాలకల పాఠశాలలో విద్యార్థినీయు ఆందోళనకు దిగారు ఎస్ ఓ , పిఈటి ల సస్పేన్షన్ ను రద్దు చేస్తూ హింది ఉపాధ్యాయురాలు శాంతి దేవిని బదీలి చేయ్యాలంటూ పలకలపై నినాదాలు రాసి ధర్నా చేపట్టారు ఇటివల ఈ పాఠశాలను బిసి సంక్షేమశాఖ మంత్రి శంకరనారయణ ఆకస్మికంగా తనిఖి చేసిన సంధర్భంగా విధ్యార్థినీలు ఉపాధ్యాయుల వేధింపులపై సమస్యను మంత్రి దృష్టికి తెచ్చారు విధ్యార్థినీలు కాళ్లపై పడి తమ ఆవేదనను చేప్పుకోవడంతో ఆగ్రహించిన మంత్రి హింది ఉపాధ్యాయురాలు శాంతిదేవి, పిఈటి జ్యోతి ,ఎస్ ఓ పై చర్యలకు ఆదేశించారు ఈ దిశలో ముగ్గూరికి షోకాజ్ నోటిసులు జారి చేయ్యడంతో పాటు వారిని సంస్పెండ్ చేసారు
* రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంసీఏ, ఎంబీఏ కళాశాలల్లో సీట్లభర్తీకి సంబంధించిన ఏపీ ఐసెట్‌ 2019 కౌన్సెలింగ్‌ను ఈనెల 16నుంచి 19వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. కాకినాడ పరిధిలో రెండు వెబ్‌బేస్‌డు కౌన్సెలింగ్‌ సహాయ కేంద్రాలను జేఎన్టీయూకే, ఆంధ్రా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఏర్పాటుచేశారు. 16న 1వ ర్యాంకు నుంచి 8000 ర్యాంకు వరకు, 17న 8001నుంచి 19,000 ర్యాంకు వరకు, 18న 19,001 నుంచి 31,000 వరకు, 19న 31,001 నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నామని, 19నుంచి 21వ తేదీ వరకు 1నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులు ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చని జేఎన్టీయూకే సహాయకేంద్ర సమన్వయకర్త ప్రొఫెసర్‌ బాలాజీ తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఏపీఐసెట్‌ హాల్‌టిక్కెట్‌, ర్యాంక్‌కార్డు ,ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, టీసీ, పీసీ, స్టడీ, నివాస ధ్రువపత్రం, ఆదాయ,కుల, ఆధార్‌ ధ్రువపత్రాలతోపాటూ రెండుసెట్ల జిరాక్స్‌ కాపీలను తీసుకురావాలన్నారు.
*బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో గల అశోక్‌థామ్ మందిరంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక భక్తుడు మృతి చెందాడు. 10 మందికిపైగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. మరోవైపు ఆలయ ప్రాంగణంలో మేళా ఏర్పాటు చేశారు. రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ ఆలయ నిర్వాహకులు బందోబస్తు ఏర్పాట్లు చేయలేదు. ఆలయంలో గందరగోళం నెలకొనడంతో భక్తులు ఇటునటు పరుగులు తీశారు.
*జమ్ము కాశ్మీర్‌లో పోలీసులు విధించిన ఆంక్షలతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఈద్‌ను ఉత్సాహంగా జరుపుకోలేకపోయారు. హింసాకాండ చెలరేగే అవకాశం ఉందనే భయంతో తిరిగి ఆంక్షలను విధించడంతో శ్రీనగర్‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అనేక మసీదుల్లోకి ప్రజలను అనుమతించలేదు. గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా తదితరులను సమీపంలోని మసీదుల్లో నమాజ్‌ చేసుకునేందుకు అనుమతించినట్లు అధికారులు చెప్పారు. శనివారంనాడు ఆంక్షలను ఎత్తివేసిన తరువాత శ్రీనగర్‌లో చెదురుమదురు సంఘటనలు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది.
*ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జాతీయత ఉట్టిపడింది. పలు స్వచ్ఛంద సంస్థలు 15 కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించి తమ దేశభక్తిని చాటుకున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వసుధైవ్‌ కుటుంబం ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొత్తంగా 35 స్వచ్ఛంద సంస్థలు కలిసి 15 కిలోమీటర్ల జాతీయ జెండాను ఏర్పాటు చేసి.. అమపార చౌక్‌ నుంచి పండిట్‌ రవిశంకర్‌ శుక్లా యూనివర్సిటీ వరకు ప్రదర్శించారు. ఈ 15 కి.మీ. పొడవునా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆయా పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాను రెపరెపలాడించారు.
*నిన్న మల్కిపురం పోలీసు స్టేషన్ దగ్గర జనసేన ధర్నా ఉద్రిక్తత…రాజోలు జనసేన M.L.A గారిని మల్కిపురం పోలీస్ స్టేషన్ S.I కాల్చేస్తా అనడం తో పోలీసు స్టేషన్ ముందు బెటాయించిన జనసేన కార్యకర్తలు… ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్బక్రీద్‌ పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మతపెద్దలు ఖురాన్‌ సందేశాన్ని వినిపించారు.
*అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డి పల్లి వద్ద కస్తూరిబ్బా గాంధి బాలకల పాఠశాలలో విద్యార్థినీయు ఆందోళనకు దిగారు ఎస్ ఓ , పిఈటి ల సస్పేన్షన్ ను రద్దు చేస్తూ హింది ఉపాధ్యాయురాలు శాంతి దేవిని బదీలి చేయ్యాలంటూ పలకలపై నినాదాలు రాసి ధర్నా చేపట్టారు ఇటివల ఈ పాఠశాలను బిసి సంక్షేమశాఖ మంత్రి శంకరనారయణ ఆకస్మికంగా తనిఖి చేసిన సంధర్భంగా విధ్యార్థినీలు ఉపాధ్యాయుల వేధింపులపై సమస్యను మంత్రి దృష్టికి తెచ్చారు విధ్యార్థినీలు కాళ్లపై పడి తమ ఆవేదనను చేప్పుకోవడంతో ఆగ్రహించిన మంత్రి హింది ఉపాధ్యాయురాలు శాంతిదేవి, పిఈటి జ్యోతి ,ఎస్ ఓ పై చర్యలకు ఆదేశించారు ఈ దిశలో ముగ్గూరికి షోకాజ్ నోటిసులు జారి చేయ్యడంతో పాటు వారిని సంస్పెండ్ చేసారు
*కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుటంతో జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని శివాలయం గర్భగుడిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం తెల్లవారు జామున ఉధృతంగా వచ్చిచేరిన వరదనీటితో కోదండరామలయం చుట్టూ వరదనీరు చుట్టుముట్టింది. అంతకంతకు పెరుగుతున్న వరద నీటితో ఆలయ ప్రాంగణం మొత్తం వరదనీరు వచ్చిచేరగా క్రమేపీ వరదనీరు ఆంజనేయ స్వామిఆలయం తూర్పు ద్వారం వరకు చేరుకుంటుంది.
*నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ అంతర్జాతీయ అవార్డును దక్కించుకుంది. ఇండియా మోస్డ్ ట్రస్టెడ్ ఎడ్యూకేషన్ – 2019 అవార్డును ఢిల్లీలో ఇంటర్నేషనల్ బ్రాండ్ కన్సల్టింగ్ కార్పొరేషన్ (యూఎస్ఏ) చైర్మన్ కౌశిక్ ట్రిపుల్ కళాశాల వీసీ అశోక్కు అందజేశారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాసర ట్రిపుల్ కళాశాల సాంకేతిక విద్యను అందించడంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు పొందినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
*ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నెల 9న మూసివేసిన కొచ్చిన్ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలను అధికారులు ఆదివారం పునఃప్రారంభించారు.
*పారిశ్రామికవేత్త ఎర్నేని జానకిరామయ్య (79) శనివారం రాత్రి 11 గంటలకు కన్నుమూశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరుకు చెందిన ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. రామోజీ ఫిల్మ్సిటీ, డాల్ఫిన్ హోటల్స్ ఎండీ అయిన విజయేశ్వరి ఆయన కుమార్తె. ఆదివారం ఉదయం జానకిరామయ్య మృతదేహాన్ని గంగూరులోని స్వగృహానికి తీసుకొచ్చారు. రామోజీ ఫిల్మ్సిటీ ఎండీ అట్లూరి రామ్మోహనరావు, విశ్రాంత కేంద్ర విజిలెన్స్ కమిషనరు కేవీ చౌదరి, పారిశ్రామికవేత్త ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్, బంధుమిత్రులు.. జానకిరామయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భార్య సరోజిని, కుమార్తెలు శ్రీవిజయరాజరాజేశ్వరి, విజయేశ్వరి, అమరేశ్వరిలను పలువురు ప్రముఖులు పరామర్శించారు. అనంతరం పటమటలంక స్వర్గపురిలో జానకిరామయ్య పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
*తాను క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యానేగానీ.. ప్రజాజీవితం నుంచి విశ్రాంతి తీసుకోలేదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశమంటే కేవలం భౌగోళిక చిత్రం కాదని, అది కోట్ల మంది సమ్మిళిత అభివృద్ధి ముఖచిత్రం కావాలని ఆకాంక్షించారు.
* శ్రీనగర్లో మళ్లీ నిషేధాజ్ఞలు విధించారు. సెక్షన్ 144ను ఉపసంహరించాక చెదురుమదురు ఘర్షణలు చోటుచేసుకోవడంతో మళ్లీ ఆంక్షలు విధించారు. ప్రజలు ఇళ్లకు వెళ్లిపోవాలని, దుకాణాలు మూసేయాలని ప్రకటనలు చేశారు.
*భారతదేశ చలనచిత్ర రంగానికి తెలంగాణను ప్రధాన కేంద్రం (హబ్)గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొత్త చలనచిత్ర విధానాన్ని రూపొందిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చలన చిత్రాల నిర్మాణంలో ముంబయిని మించిపోయేలా హైదరాబాద్ను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆదివారం ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ వద్ద ఇదే అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.
*మహిళలు, బాలికల రక్షణ కోసమే సైబర్ మిత్ర, మహిళా మిత్ర సేవలను ప్రారంభించామని, బాధితులు పోలీస్స్టేషన్కు వెళ్లకుండా ఫిర్యాదు చేసి సత్వర సేవలు పొందవచ్చని హోం మంత్రి ఎం.సుచరిత చెప్పారు.
*రిజిస్ట్రేషన్ చేయకుండా, రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా ద్విచక్ర వాహనాలను విక్రయించారని ఆరోపణలపై గుంటూరులో గౌతమ్స్ హీరో, యర్రంశెట్టి ఆటో డీలర్స్ షోరూమ్లను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు.
*కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు విమానాశ్రయంలో అత్యాధునిక నైట్ ల్యాండింగ్, ఆటోమేటిక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థను శనివారం ఏర్పాటు చేశారు.
*ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు కేటాయించిన 10% రిజర్వేషన్లలో 5% కాపులకు కేటాయిస్తూ గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని (యాక్ట్-14/2019) రద్దు చేయాలంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
* పరిశ్రమల స్థాపన కోసం వేసిన పునాదిరాయి నిరుపయోగం కాకుండా రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తోందని శనివారం ట్వీట్ చేశారు. పారిశ్రామికాభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రతినిధులకు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు
* వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)పై ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అవగాహన ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి అన్నారు.
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబరులో ‘‘పర్యాటకరంగ పెట్టుబడుల సదస్సు’’ నిర్వహించనుంది. రాష్ట్రంలో పర్యాటకరంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూలు, వేదిక ఖరారు