DailyDose

పాకిస్థాన్‌లో తులం బంగారం ₹74వేలు-వాణిజ్య-08/13

పాకిస్థాన్‌లో తులం బంగారం ₹74వేలు-వాణిజ్య-08/13-Gold price in Pakistan is skyrocketting-telugu business news today-aug 13 2019

* నింగివైపు చూస్తున్న బంగారం ధరలు పెట్టుబడి దారుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, ఆభరణాల వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి పరుగుకు ఇప్పట్లో బ్రేక్‌లు పడే అవకాశం కనిపించడంలేదు. ముఖ్యంిగా పాకిస్తాన్‌లో పుత్తడి ధర వింటే గుండె గుభేలే. అవును.. ఇండియాతో పోలిస్తే.. పాకిస్తాన్‌లో బంగారం ధర రెండింతలు ఎక్కువ పలుకుతోంది. నిన్న (సోమవారం ,ఆగస్ట్ 12) పాకిస్తాన్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.74,588గా ఉంది. పాకిస్తాన్ పరిమాణంలో తులా బార్స్ (11.6638038 గ్రా) బంగారం రూ.87,000 గా ఉంది. పాకిస్తాన్‌లోని ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది.24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 21 క్యారెట్లు, 18 క్యారెట్లు, 10 తులాల బంగారం ధరలు ఆయా నగరాల్లో ఇలా ఉన్నాయి. కరాచిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,588 ఉండగా, 24 క్యారెట్ల తుల బార్ రూ.87,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,373గా ఉంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, సియాల్‌కోట్ నగరాల్లో 24 క్యారెట్లు, 24 క్యారెట్లు తుల బార్స్, 22 క్యారెట్ల బంగారం వరుసగా.. రూ.74,588, రూ.87,000, రూ.68,373గా ఉన్నాయి.మరోవైపు దేశీయంగా బంగారం ధరలు రూ.38 వేలు మార్క్‌ను అధిగమించాయి. అంతేకాదు త్వరలో రూ.40వేలకు చేరుకుంటుందని బులియన్‌ వర్గాలు అంచా వేస్తున్నాయి. వెండి కూడా దాదాపు ఇందే రేంజ్‌లో పరుగులు పెడుతోంది. ఫెడ్‌ వడ్డీరేటు, అమెరికా చైనా ట్రేడ్‌వార్‌ లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది.
*బక్రీద్ సందర్భంగా నిన్న (సోమవారం) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు, ఫారెక్స్, మనీ మార్కెట్లు పనిచేయలేదు. ప్రధాన కమొడిటీ మార్కెట్లకు కూడా పగలంతా సెలవే. అంతర్జాతీయ విపణులతో పాటు రాత్రి పనిచేశాయి.
*జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు నష్టాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.131.51 కోట్ల నికర నష్టాన్ని ఈ సంస్థ నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో నికర నష్టం రూ.54.86 కోట్లు మాత్రమే.
* ఎన్సీసీ లిమిటెడ్ మొదటి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.72.27 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.
* ఈ నెల 16వ తేదీ నుంచి 18 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో కన్‌స్ట్రక్షన్‌ ఆర్కిటెక్చర్‌ ఇంటీరియర్‌ (సీఏఐ) ఎక్స్‌పో 2019 జరగనుంది. ఈ ఎక్స్‌పోలో నిర్మాణ, ఆర్కిటెక్చర్‌, ఇంటీరియర్స్‌ రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొననున్నాయి. ఏడో విడతగా ఈ ఎక్స్‌పోను ఐయాడ్స్‌ అండ్‌ ఈవెంట్స్‌ గ్రూప్‌ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనే సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడమేకాకుండా నిర్మాణం, ఆర్కిటెక్చర్‌, ఇంటీరియర్‌ డిజైన్‌లకు సంబంధించిన ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సందర్శకులు మార్కెట్లో అందుబాటులో ఉన్న సరికొత్త ఉత్పత్తులు, టెక్నాలజీల గురించి తెలుసుకోవచ్చు.
* 2018-19 ఆర్థిక సంవత్సరానికి (2019-20 అసెస్‌మెంట్‌ సంవత్సరం) ఐటీ రిటర్న్‌ల ఉచిత ఈ-ఫైలింగ్‌ సదుపాయం కల్పించేందుకు క్లియర్‌టాక్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 50 లక్షలకు పైబడిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు ఈ ఉచిత ఈ-ఫైలింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది
* డిజిటల్‌ పరివర్తనం కోసం టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో రిలయన్స్‌ జియో జట్టు కట్టినట్లు ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ఈ దీర్ఘకాలిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా జియో దేశవ్యాప్తంగా భారీ డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ డేటా సెంటర్లకు మైక్రోసాఫ్ట్‌ తన అజుర్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌ యాక్సెస్‌ కల్పించనుంది. అంతేకాకుండా స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ఏజీఎంలో అంబానీ పలు చర్యలు ప్రకటించారు. అంతేకాదు, ఆవిర్భావ దశలో ఉన్న సంస్థలకు డేటా కనెక్టివిట్‌ మౌలిక వసతుల సేవలను ఉచితంగా అందించనున్నట్లు ఆయన చెప్పారు
* జియో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ప్లాట్‌ఫామ్‌ వాణిజ్య సేవలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌కు కనీసం 100 కోట్ల డివైజ్‌లను అనుసంధానించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా కంపెనీకి ఏటా రూ.20,000 కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని జియో భావిస్తోంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ నష్టాలు మరింతగా పెరిగాయి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర నష్టాలు రూ.54.86 కోట్ల నుంచి రూ.131.51 కోట్లకు పెరిగాయి.