NRI-NRT

చిత్తూరు యువకుడికి ఏడాది జైలు

Chittoor Youth Sentenced To One Year In Prison For Burning University Computers With USB

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థికి అమెరికాలో ఏడాది పాటు జైలు శిక్ష పడింది. అంతేకాక 58,471 డాలర్ల జరిమానా కూడా విధించారు. న్యూయార్క్‌ లోని అల్బనీలో తాను చదువుతున్న కళాశాలలో 60 కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా చెడిపోయేలా చేసిన నేరానికి ఈ శిక్ష పడినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆకుతోట విశ్వనాథ్‌ (27) అనే యువకుడు 2015 నుంచి విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. సెయింట్‌ రోస్‌ కాలేజీలోని 66 కంప్యూటర్లకు ‘యూఎస్‌బీ కిల్లర్‌’ పెట్టాడని, దీనివల్ల ఆ పరికరాలు దెబ్బతిన్నట్లు గత ఫిబ్రవరిలోనే అభియోగం నమోదైంది. అదే నెల 22న విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, విచారణ అనంతరం తాజాగా కోర్టు అతనికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఈ ‘యూఎస్‌బీ కిల్లర్‌’ను యూఎస్‌బీ పోర్టులో పెట్టడం ద్వారా కంప్యూటర్లలోని ఎలక్ట్రానిక్‌ విడిభాగాలకు విద్యుత్తు ప్రవాహం హెచ్చుతగ్గులకు లోనై దెబ్బతినే ప్రమాదం ఉంది.