Politics

గంటా కేశినేనిలు ఎగ్గొట్టారు

Ganta Kesineni Skips Important Meeting By Chandrababu

ఏపీలో అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై టీడీపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో రాష్ట్ర స్థాయి నేతల విస్తృత సమావేశం నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలు అంతా హాజరై రాష్ట్రంలో పార్టీ పరిస్థితి.. వైసీపీ పాలనపై సుదీర్ఘంగా చర్చించారు..రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నేతలు ఖండించారు. వారికి అండగా ఉండటంతో పాటుగా, పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో ఫోకస్‌ చేశారు.గత ఎన్నికల ఓటమితో కుదేలైన పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపడానికి ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్లాలి తదితర అంశాల్లో పార్టీ శ్రేణులకు సీనియర్‌ నేతలు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఇకపై ఎవరూ పార్టీ మారకుండా చూసుకోవాలని నిర్ణయించారు.ష్ట్రంలో ప్రస్తుతమున్న ఆందోళనకరమైన వాతావరణంలో టీడీపీ శ్రేణులు ఎవరు భయాందోళనలకు గురి కావద్దని టీడీపీ అధినేత పిలుపు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎదుర్కునేందుకు అందరూ సన్నద్ధం కావాలని నేతలకు సూచించారు. వైసీపీ నేతల మూకుమ్మడి దాడిని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని, అందుకోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నేటి భేటీలో నిర్ణయించారు.టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో.. పార్టీ ఓటమిపై సుధీర్ఘంగా చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు తీవ్రంగా కష్టపడ్డారన్నారని. కానీ ఆ ష్టాన్ని ప్రజల్లో తీసుకువెళ్లడంలో పార్టీ నేతలు, అధికారులు విఫలమమయ్యారన్నారు. మరోవైపు స్వార్థ పరులకు పదవులు దక్కడం పైనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ వర్గాలు దూరం కావడంతో పాటు ఇతర ఈక్వేషన్ల వల్ల పార్టీ ఓటమి పాలైందన్నారు గోరంట్ల..టీడీపీ అధినేత చంద్రబాబు చేతికి స్వల్పంగా గాయమైంది. ఆయన కుడిచేతికి కట్టు కట్టి ఉంది. చేతికి కట్టుతోనే సమావేశానికి వచ్చారు చంద్రబాబు. మరోవైపు ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ సమావేశానికి కీలక నేతలు గైర్హజరయ్యారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ కేశనానిలు హాజరుకాకపోవడం హాట్‌టాపిక్‌ అయ్యింది.