DailyDose

కరెంట్ షాక్ తగిలి ముగ్గురు విద్యార్ధులు మృతి-నేరవార్తలు–08/14

Three students die in india due to electric shock-telugu crime today-aug142019

*విద్యుద్ఘాతంతో ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సంతమాగులూరు కొప్పరంలో విద్యుద్ఘాతంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఇనుప స్తంభమే ముగ్గురు చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారింది. గ్రామంలో ఉన్న జెండా స్తంభం పట్టుకొని ఆడుతుండగా ప్రమాదం జరిగింది. స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో చిన్నారులకు కరెంట్ షాక్ తగిలింది. ముగ్గురు చిన్నారులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారులు షేక్ పఠాన్ గౌస్, హసన్, పఠాన్ అమర్ ఐదో తరగతి చదువుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జెండా స్తంభానికి పక్కనే ఉన్న విద్యుత్ లైన్ తగలడంతో విద్యుత్ సరఫరా అయినట్లు స్థానికులు చెబుతున్నారు.
* హర్యానాలోని ఫరీదాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీసీపీ) ఆత్మహత్యకు పాల్పడారు. ఫిరీదాబాద్‌ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విక్రమ్‌ కపూర్‌ ఇవాళ తెల్లవారజామున తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పని ఒత్తిడి కారణంగా విక్రమ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన విక్రమ్‌ గత ఏడాదే ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు.
*బుల్లెట్‌ రూ.25 నుంచి రూ.35వేలకే వస్తోందంటే ఆశ్చర్యమే కదూ… వైఎస్సార్‌ కడప జిల్లా నందలూరులో పలువురు యువకుల చేతిలో బుల్లెట్‌ కనిపిస్తోందంటే ఇదే కారణం అన్న భావన వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే కర్ణాటక నుంచి నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్, పల్సర్‌ లాంటి బైకులను తీసుకొచ్చి అతి తక్కువ ధర విక్రయించే ముఠా వ్యవహారం నందలూరులో బట్టబయలైంది. రూ.1లక్షకు పైగా ఉన్న బుల్లెట్‌ ద్విచక్రవాహనం ధర రూ.50 వేలకే లభ్యం కావడంతో యువత ఎగబడి కొన్నారు. నందలూరు పోలీసులకు అనుమానం వచ్చి రెండురోజుల కిందట బుల్లెట్‌ వాహనాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. వీటిని స్మగ్లింగ్‌ చేసే అసలు వ్యక్తి కోసం పోలీసులు రంగంలోకి దిగారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను స్టేషన్‌కు తరలించారు
* క్రికెట్‌ ఆటలో జరిగిన గొడవ ఓ విద్యార్ధి ప్రాణం తీసింది. ఈ ఘటన విశాఖపట్నంలోని పాతర కరసా ప్రాంతంలో జరిగింది. విజయ్, సాయి అనే ఇద్దరు విద్యార్ధులు రెండు టీంలుగా ఏర్పడి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. రెండు మ్యాచ్‌ల్లోనూ విజయ్ టీం గెలిచింది. మూడో మ్యాచ్‌ సైతం గెలిచే అవకాశం ఉండటంతో సాయి.. గొడవకు దిగాడు. మాటా మాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సాయి… విజయ్‌ కడుపులో బలంగా కొట్టాడు. ఆ తర్వాత బ్యాట్‌తోనూ కొట్టినట్లు స్నేహితులు చెబుతున్నారు. ఆ బాధ భరించలేని విజయ్‌.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చివరికి స్నేహితుల సహాయంతో అతను ఇంటికి చేరుకున్నాడు. అయితే కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో.. ఆసుపత్రికి తరలించారు విజయ్‌ తల్లిదండ్రులు. అయితే.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు విజయ్‌. సాయి వల్లే తమ కుమారుడి చనిపోయాడంటున్నారు విజయ్‌ తల్లిదండ్రులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
* రాయ్ పూర్ లో మంగళవారం ముగ్గురు పోలీస్ అధికారులు ఓ మైనర్ ను కొట్టారు. పోలీసులు మైనర్ ను జుట్టు పట్టుకుని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మైనర్ పై దాడికి పాల్పడిన వీడియోను చూశాం. వీడియో పుటేజీని పరిశీలించిన వెంటనే ఆ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని రాయ్ పూర్ అదనపు ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.
* ఆరు నెలల క్రితం శ్రీసిటీలో జరిగిన సెల్‌ఫోన్‌ లోడ్‌ వాహనం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఈ ఘటన జరిగింది. దగదర్తి జాతీయ రహదారి వద్ద రూ. 4.18కోట్ల విలువజేసే సెల్‌ఫోన్ల వాహనాన్ని దుండగులు అపహరించారు. ఆరు నెలలప కేసును విచారించిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 70 లక్షల విలువ చేసే చోరీ నగదు, లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్ చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై తమిళనాడు, చిత్తూరులోనూ పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన ఫోన్లను మహారాష్ట్ర నుంచి బంగ్లాదేశ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
* సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా నేమాంకు చెందిన టీడీపీ నేత మేడిశెట్టి బుజ్జి ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో బుజ్జి నుంచి పెద్ద ఎత్తున సారాయి, బోటు, ఆటోను స్వాధీనం పరుచుకున్నట్లు ఎక్సైజ్‌ సిబ్బంది వెల్లడించింది. కాకినాడకి చెందిన ఓ టీడీపీ నేత అండదండలతో బుజ్జి నాటుసారా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలోనూ ఇదే విధంగా నాటుసారా తరలిస్తుండగా కాకినాడ రూరల్‌ పోలీసులకు చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.
*గతంలో వనస్థలిపురంలో చోటుచేసుకున్న ఏటీఎం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన రాంజీనగర్‌ ముఠాను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన ప్రైవేట్‌ సెక్యూరిటీ సంస్థ సిబ్బంది దృష్టి మరల్చి దుండగులు సుమారు రూ.70 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ చోరీకి పాల్పడింది రాంజీ ముఠానేనని తేల్చి దాదాపు నాలుగు నెలల పాటు గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దోపిడీకి ఉపయోగించిన వాహనంతో పాటు.. సుమారు 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు
*మొదటి భార్యతో సంబంధం కొనసాగుతున్నదని తెలుసుకొని రెండో భార్య తన సోదరుడితో కలిసి భర్తను హతమార్చిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కల్గూడ కాలనీలో చోటు చేసుకున్నది.
*ఝార్ఖండ్లో ఇద్దరు గిరిజన క్రీడాకారిణులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. సిండేగా జిల్లాలో శనివారం అదృశ్యమైన హాకీ క్రీడాకారిణులు సునందినీ బాగే(23), శ్రద్ధ సొరేన్(18)లు ఆదివారం బిరు గ్రామంలో ఓ చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
*హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి పరారైన 26 ఏళ్లకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. 1989 నవంబర్ 15న జరిగిన హత్యలో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్కు చెందిన భిచ్చేయాదవ్రావు ఏ4 నిందితుడు.
*డీలర్ల వద్దే ఆన్లైన్లో వాహనాల రిజిస్ట్రేషన్కు వెసులుబాటు కల్పిస్తుండగా, దానిని కొందరు దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా అక్రమాలకు పాల్పడ్డారని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.
*ఇద్దరు స్నేహితుల మధ్య క్రికెట్ ఆటలో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. ఈ విషాదకర సంఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది.
*మలికిపురం పోలీస్స్టేషన్పై దాడి చేశారన్న అభియోగం మేరకు నమోదైన కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గœ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
*అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో గత నెల 24న ఆరుగురు మహిళా ఎమ్మెల్యేల ఫొటోలను ఫేస్బుక్లో పెట్టి, అసభ్యకర వ్యాఖ్యలు రాసిన వ్యక్తిని గ్రామీణ గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.
*కొత్త డ్రెస్సు కొనుక్కుందనే కోపంతో ఓ తమ్ముడు అక్కపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో పాటు గదిలో పెట్టి బంధించాడు. అమానవీయమైన ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. బిహార్కు చెందిన బాధిత యువతి(20).. తన తమ్ముడు(17), చెల్లెళ్లతో కలిసి దిల్లీలోని ద్వారక సమీపంలో నివసిస్తోంది.
*సినీ హీరో నాగశౌర్యకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఆయన తన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకొని ప్రయాణిస్తున్నారు. దీన్ని గమనించిన పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవి ఆ కారును ఆపి రూ.500 జరిమానా విధించారు. అనంతరం కారుకు వేసిన బ్లాక్ ఫిలింను తొలగించారు.
*భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేయడంతో మనస్తాపానికి గురైందో మహిళ. తన ఇద్దరు పిల్లలతో కలిసి తనువు చాలించింది. బెంగళూరులోని హనుమంత నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
* భర్త చేసిన పాడు పనికి తట్టుకోలేక ఓ మహిళ ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తమ తండ్రి చేసిన పాడు పనికి జీవితం మీద విరక్తి కలిగిందని వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ఇద్దరు కుమార్తెలు, తల్లి సూసైడ్ చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగింది.