ScienceAndTech

ఇస్రోతో భాగస్వామ్యం కోసం అమెరికా కంపెనీల చూపు

American Companies Wanting To Partner With ISRO

శాటిలైట్లను చాలా తక్కువ ఖర్చుతోనే అంతరిక్షానికి పంపాలంటే ఏ అంతరిక్ష సంస్థ బెటర్? స్పేస్ప్రయోగాల కోసం రాకెట్లను వాడుకోవాలంటే ప్రపంచంలోనే చీప్ అండ్ బెస్ట్ కంపెనీ ఏది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఒక్కటే..అదే మన ఇస్రో! అందుకే ఇప్పుడు అమెరికా కంపెనీలు ఇస్రో వైపు చూస్తున్నాయి. ఇస్రో కొత్తగా ప్రారంభించిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్)కు నెల తిరగకుండానే ఓ కాంట్రాక్టు కూడా లభించింది. అది కూడా ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(ఎస్ఎస్ఎల్వీ) ద్వారా ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షానికి పంపేందుకు డీల్ కుదిరింది. ‘అమెరికాకు చెందిన ఓ కస్టమర్కోసం’ ఒక స్పేస్క్రాఫ్ట్ను అంతరిక్షానికి పంపేందుకు మేం ఒప్పందం చేసుకున్నాం. ఈ స్పేస్క్రాఫ్ట్ను ఇస్రో డెవలప్ చేస్తున్న ఎస్ఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించేందుకు ఎన్ఎస్ఐఎల్తో కూడా డీల్ కుదుర్చుకున్నామని స్పేస్ఫ్లైట్ అనే అమెరికా కంపెనీ ప్రకటించింది. ఎస్ఎస్ఎల్వీ తొలి ప్రయోగాత్మక పరీక్షను పోయిన నెలలోనే చేపట్టాల్సి ఉన్నా, అది ఈ ఏడాది చివరికి వాయిదా పడింది. వచ్చే ఏడాది చేపట్టే రెండో డెవలప్‌‌మెంటల్ లాంచ్లో స్పేస్ఫ్లైట్ శాటిలైట్ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఈ రాకెట్500 కిలోల వరకు బరువు ఉండే శాటిలైట్లను లో ఎర్త్ ఆర్బిట్కు చేరుస్తుంది. రాకెట్బరువు 110 టన్నులు. ఆరుగురు సిబ్బంది 72 గంటల్లోనే అసెంబుల్ చేయవచ్చు. ఖర్చు కేవలం రూ. 30 కోట్లు. దీనికి మనదేశంలోనే ఏటా 15 నుంచి 20 ఎస్ఎస్ఎల్వీల తయారీకి డిమాండ్ ఉంటుందని అంచనా. ఇస్రో తయారుచేస్తున్న ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఒకేసారి ఎక్కువ మైక్రోశాటిలైట్లను ప్రయోగించొచ్చని స్పేస్ఫ్లైట్ కంపెనీ ప్రెసిడెంట్ కర్ట్బ్లేక్ చెప్పారు. ఈ రాకెట్ శాటిలైట్లను వేర్వేరు కక్ష్యల్లోకి కూడా విడిచిపెట్టగలదన్నారు. మొదటలో ఎర్త్ ఆర్బిట్లోకి, 2020 నుంచి సన్ సింక్రనస్ ఆర్బిట్‌‌లోకి ఉపగ్రహాలు పంపించాలని భావిస్తున్నామన్నారు. చిన్న చిన్న శాటిలైట్లను మినీ రాకెట్ల ద్వారా ఒకేసారి అంతరిక్షానికి పంపడం వల్ల చాలా లాభాలున్నాయని ఎన్ఎస్ఐఎల్ డైరెక్టర్ డి.రాధాకృష్ణన్‌‌ చెప్పారు. దీనివల్ల స్పేస్ఫ్లైట్తో మరిన్ని డీల్స్ కుదురుతాయన్నారు. మరిన్ని విదేశీ కంపెనీలు కూడా భవిష్యత్తులో ముందుకు వస్తాయన్నారు.