Editorials

అసలు మీకు ఏమి కావాలి?

CJI Gogoi Gets Angry At Petititoner For Not Being Clear

అధికరణ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

పిటిషన్‌దారులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయి అసహనం వ్యక్తం చేశారు.

ఎలాంటి పిటిషన్‌ వేశారంటూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మను ప్రశ్నించారు.

అరగంటపాటు చదివినా వ్యాజ్యం ముఖ్య ఉద్దేశ్యం ఏంటో అర్థం కాలేదన్నారు.

ఒకవేళ ఈ పిటిషన్‌ కొట్టివేస్తే సంబంధిత ఐదు వ్యాజ్యాలపైనా ప్రభావం పడుతుందని తెలిపారు.

ఈ విషయంపై మొత్తం 7 పిటిషన్లు దాఖలు కాగా.. అందులో నాలుగింటిలో లోపాలున్నాయన్నారు.

ఏం కోరుకుంటున్నారో స్పష్టత లేకుండా వ్యాజ్యం ఎలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ విచారణను వాయిదా వేశారు.